Home /News /technology /

APPLE ASKS SUPPLIERS FOR FOLDING IPHONE SAMPLES TO TEST HINGE 2022 RELEASE POSSIBLE REPORT SS GH

iPhone: ఫోల్డింగ్ ఐఫోన్‌ను తయారు చేస్తున్న యాపిల్‌

iPhone: ఫోల్డింగ్ ఐఫోన్‌ను తయారు చేస్తున్న యాపిల్‌
(ప్రతీకాత్మక చిత్రం)

iPhone: ఫోల్డింగ్ ఐఫోన్‌ను తయారు చేస్తున్న యాపిల్‌ (ప్రతీకాత్మక చిత్రం)

ఫోల్డింగ్ ఫోన్ శాంపిల్స్‌ను యాపిల్ పరీక్షిస్తుందని వార్తా సంస్థలు చెబుతున్నాయి. స్క్రీన్, హింజ్ స్టాండ్ (మడత పెట్టే ప్రదేశం) పనితీరును లక్షకంటే ఎక్కువ సార్లు పరీక్షించనున్నారు.

స్మార్ట్‌ఫోన్లు ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతికతతో వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే వివిధ సంస్థలు ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ల (మడతపెట్టగలిగే స్మార్ట్‌ఫోన్‌)ను తయారు చేసే పనుల్లో నిమగ్నమయ్యాయి. తాజాగా యాపిల్ కంపెనీ కూడా ఫోల్డింగ్ ఐఫోన్‌లను తీసుకురానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందే యాపిల్ సంస్థ వివిధ ఫోల్డింగ్ ఫోన్ల పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. దీంతో త్వరలోనే ఫోల్డింగ్ ఐఫోన్‌ను ఆ సంస్థ విడుదల చేయనుందని వినియోగదారులు భావిస్తున్నారు. సాధారణంగా టెక్ కంపెనీలు రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రక్రియలో భాగంగా పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంటాయి. అంతమాత్రాన అవన్నీ ఉత్పత్తి వరకు వెళ్లి మార్కెట్లోకి వస్తాయని భావించలేం. కానీ ఇటీవల యాపిల్ సంస్థకు చైనా సరఫరాదారులైన ఫాక్స్‌కాన్, నిప్పాన్ నిప్పాన్ సంస్థలు ఫోల్డింగ్ ఫోన్ శాంపిల్స్ పంపినట్లు ఎకనామిక్ డైలీ వార్తాసంస్థ పేర్కొంది. అందువల్ల ఫోల్డింగ్ ఐఫోన్‌పై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి.

Cylinder Booking on Paytm: పేటీఎంలో సింపుల్‌గా సిలిండర్ బుకింగ్... ఎలా చేయాలంటే

Earphones: ఇయర్‌ఫోన్స్ ఎక్కువగా వాడితే ఎంత డేంజరో తెలుసా?

లక్షసార్లు పరీక్షిస్తారు


ఫోల్డింగ్ ఫోన్ శాంపిల్స్‌ను యాపిల్ పరీక్షిస్తుందని వార్తా సంస్థలు చెబుతున్నాయి. స్క్రీన్, హింజ్ స్టాండ్ (మడత పెట్టే ప్రదేశం) పనితీరును లక్షకంటే ఎక్కువ సార్లు పరీక్షించనున్నారు. టెస్టింగ్ కోసం శాంపిల్స్ పంపడానికి తైవాన్‌కు చెందిన సప్లై చైన్ సంస్థలపై యాపిల్ ఆధారపడుతోంది. హన్ హై (ఫాక్స్‌కాన్), నిప్పాన్ నిప్పాన్ పార్ట్నర్‌షిప్ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. యాపిల్ మొదటి ఫోల్డింగ్ ఐఫోన్ కోసం వీటిపై ఆధారపడుతోంది. మోడళ్లను బట్టి ల్యాప్‌టాప్ హింజెస్‌ను 20,000 నుంచి 50,000 సార్లు పరీక్షిస్తారు. కానీ ఫోన్‌ల శాంపిల్స్‌ను లక్ష కంటే ఎక్కువ సార్లు పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫోన్‌ హింజ్ ల్యాప్‌ట్యాప్‌తో పోలిస్తే చిన్నదిగా ఉంటుంది. ల్యాప్‌ట్యాప్‌తో పోలిస్తే ఫోన్‌ను ఎక్కువ సార్లు ఉపయోగిస్తారు. అందువల్ల టెస్టింగ్ ఎక్కవసార్లు చేయాలి.

WhatsApp Feature: మెసేజెస్‌తో వాట్సప్ ఫుల్ అవుతోందా? ఈ సెట్టింగ్స్ మార్చండి

Jio New Plans: జియోలో రూ.75 నుంచే ఆల్ ఇన్ వన్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే

విడుదల ఎప్పుడు?


కొత్త ఫోల్డింగ్ ఐఫోన్‌లు ఎలాంటి స్క్రీన్‌ను ఉపయోగిస్తున్నాయనే అంశంపై స్పష్టమైన సమాచారం లేదని తాజా నివేదిక చెబుతోంది. OLED లేదా microLED స్క్రీన్లతో దీన్ని తయారు చేసే అవకాశం ఉంది. microLED కొత్తతరం డిస్‌ప్లే టెక్నాలజీ. అందువల్ల ఫోల్డింగ్ ఐఫోన్‌కు ఈ డిస్‌ప్లే అయితే బాగుంటుందని వినియోగదారులు భావిస్తున్నారు. బ్రైట్‌నెస్‌, కలర్ శాచురేచన్, పవర్‌ ఎఫీషియెన్సీ పరంగా ఇది మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఒకవేళ శాంపిల్ టెస్టింగ్ కోసం ఫోల్డింగ్ ఐఫోన్‌ను పంపినా, అది తుది ఉత్పత్తిగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంటుందో లేదో చూడాలి. వీటన్నింటినీ బట్టి చూస్తే, ఫోల్డింగ్ ఐఫోన్‌ ఇప్పట్లో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు లేవు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Apple, Iphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు