Home /News /technology /

APPLE APP STORE APPS PURCHASES MAY BECOME MORE EXPENSIVE IN INDIA BECAUSE OF A NEW TAX SS GH

Apple: యాపిల్ యూజర్లకు షాకింగ్ న్యూస్... ఇక ఎక్కువ చెల్లించాల్సిందే

Apple: యాపిల్ యూజర్లకు షాకింగ్ న్యూస్... ఇక ఎక్కువ చెల్లించాల్సిందే
(ప్రతీకాత్మక చిత్రం)

Apple: యాపిల్ యూజర్లకు షాకింగ్ న్యూస్... ఇక ఎక్కువ చెల్లించాల్సిందే (ప్రతీకాత్మక చిత్రం)

Apple App Store | మీరు యాపిల్ ఐఫోన్ యూజరా? యాప్ స్టోర్ వాడుతున్నారా? అయితే మీరు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఎందుకో తెలుసుకోండి.

    ప్రీమియం ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ తన యూజర్లకు పెద్ద షాకిచ్చింది. ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉన్న యాప్స్, ఇన్- యాప్ కొనుగోళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. భారతదేశంతో సహా బ్రెజిల్, కొలంబియా, ఇండోనేషియా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ పెంపు అమల్లోకి రానుందని యాపిల్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఉన్న విధంగానే యాపిల్ ఐఫోన్లకు కూడా ప్రత్యేకంగా యాప్స్ అందుబాటులో ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే, ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్ ఎలాగైతే ఉంటుందో, ఐఫోన్ యూజర్లకు యాపిల్ ప్లేస్టోర్ అలాగే ఉంటుంది. ఆండ్రాయిడ్ వినియోగదారుల లాగా యాపిల్ యూజర్లకు చాలా యాప్స్ ఉచితంగా లభించవు. ఆయా యాప్స్‌కు నిర్ణీత రుసుం చెల్లించి యాపిల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

    Smartphone: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి షాక్... ఇక బాక్సులో ఛార్జర్లు ఉండవు

    Flipkart Big Diwali sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 7 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

    కాగా, యాపిల్ స్టోర్‌లో లభించే యాప్స్‌కు ప్రస్తుతం అమల్లో ఉన్న 18 శాతం జీఎస్టీకి అదనంగా మరో రెండు శాతం ఈక్వలైజేషన్ లెవీ యాడ్ కానుంది. ఈ ఈక్వలైజేషన్ లెవీ అనేది డైరెక్ట్ టాక్స్ రూపంలో ఉంటుంది. డిజిటల్ లావాదేవీల ద్వారా విదేశీ టెక్ కంపెనీలకు వచ్చే ఆదాయంపై పన్ను విధించాలనే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం దీన్ని 2016లో ప్రవేశపెట్టింది. 2020 ఫైనాన్స్ యాక్ట్ 165 ఎ సెక్షన్ కింద ఈ–కామర్స్ ఆపరేటర్లపై 2 శాతం ఈక్వలైజేషన్ లెవీని విధించాలని నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ ఈక్వలైజేషన్ లెవీ 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.

    2017 తర్వాత మళ్లీ ఇప్పడే


    అప్డేట్ చేయబడిన కొత్త ధరలు త్వరలోనే యాపిల్ డెవలపర్ పోర్టల్‌లో ప్రతిబింబిస్తాయని యాపిల్ పేర్కొంది. దీనికి గాను మీరు మై యాప్‌లో కనిపించే ప్రైజింగ్ అండ్ అవేలెబులిటీ సెక్షన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. పన్నులు లేదా విదేశీ మారక రేట్లు మారినప్పుడు, యాప్ స్టోర్‌లో లభించే యాప్‌ల ధరలను కూడా అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని యాపిల్ వివరించింది. దీనిలో భాగంగానే ఇదివరకు ఉన్న ధరలకు సవరిస్తున్నామని తెలిపింది. ఈ నూతన ధరలు అమల్లోకి రాగానే ఆయా యాప్ డెవలపర్లు ఆటోరెన్యూవెబుల్ సబ్‌స్క్రిప్షన్‌తో సహా తమ యాప్ రేట్లను అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది.

    Samsung Single EMI Scheme: సాంసంగ్ నుంచి అద్భుతమైన ఆఫర్... ఎన్ని వస్తువులు కొన్నా ఒకే ఈఎంఐ



    JioPhone: జియోఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.50,000 గెలుచుకోండి ఇలా

    అయితే, యాపిల్ మ్యూజిక్, యాపిల్ టివి ప్లస్, ఐక్లౌడ్ వంటి యాపిల్ సొంత సేవలకు కూడా ఈ కొత్త రేట్లు వర్తిస్తాయా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు. ఈ కొత్త ధరలు ఐస్లాండ్ మరియు అల్బేనియాలో కూడా అప్డేట్ చేయబడతాయని యాపిల్ పేర్కొంది. యాపిల్ యాప్ డెవలపర్లకు నూతనంగా నవీకరించిన యాప్ ధరల శ్రేణి చార్ట్‌లను అందజేసింది. ప్రస్తుతం భారత్లో యాపిల్ స్టోర్లో లభించే యాప్‌ల కనీస ధర రూ.80 ఉండగా, నూతన ధరలు అమల్లోకి వస్తే దీని కనీస ధర రూ. 89గా మారనున్నట్లు తెలుస్తోంది. కాగా యాపిల్ చివరగా యాప్ ధరలను 2017లో అప్డేట్ చేసిన విషయం తెలిసిందే.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Apple, Ios, Iphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు