హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Apple: ఇండియాలో హెల్త్ డేటా ప్రైవసీపై యాపిల్ అవగాహన కార్యక్రమాలు..కంపెనీ ప్లాన్స్ ఇవే..

Apple: ఇండియాలో హెల్త్ డేటా ప్రైవసీపై యాపిల్ అవగాహన కార్యక్రమాలు..కంపెనీ ప్లాన్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా హెల్త్‌ డేటా ప్రైవసీపై అవగాహన పెంచడానికి యాపిల్‌ కంపెనీ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా 24 ప్రాంతాలలో బ్రాడ్‌కాస్ట్‌, సోషల్ మీడియా, బిల్‌బోర్డ్‌ల సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో కనిపిస్తుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Apple: ప్రస్తుతం స్మార్ట్‌ డివైజ్‌లతో హెల్త్‌ డేటాను (Health data)ట్రాక్‌ చేసే వారి సంఖ్య పెరిగింది. ఇండియాలో కూడా ఎక్కువ మంది ఇలాంటి స్మార్ట్‌వాచ్‌లను వినియోగిస్తున్నారు. దీంతో ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా హెల్త్‌ డేటా ప్రైవసీపై అవగాహన పెంచడానికి యాపిల్‌ కంపెనీ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా 24 ప్రాంతాలలో బ్రాడ్‌కాస్ట్‌, సోషల్ మీడియా, బిల్‌బోర్డ్‌ల సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో కనిపిస్తుంది. భారతదేశంలో కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణె, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బిల్‌బోర్డ్‌ల ద్వారా ప్రదర్శించనున్నారు.

ఈ ప్రచారంలో ఎమ్మీ అవార్డ్-విజేత నటి జేన్ లించ్ వాయిస్‌తో రూపొందిన అడ్వర్టైజ్‌మెంట్‌ ఉంది. ఇది వినియోగదారుల అనుమతి లేకుండా వారి హెల్త్‌ డేటాను థర్డ్ పార్టీలకు షేర్‌ చేయడంపై రూపొందింది. హెల్త్‌ డేటా ప్రైవసీ ప్రాముఖ్యతను గట్టిగా చెప్పడమే ఈ అడ్వర్టైజ్‌మెంట్‌ లక్ష్యం. ఈ యాడ్‌కు ‘ఐ, టోన్యా’, ‘క్రూయెల్లా’ వంటి మూవీలతో పాపులర్‌ అయిన అవార్డు-విన్నింగ్‌ ఫిల్మ్‌ మేకర్‌ క్రెయిగ్ గిల్లెస్పీ దర్శకత్వం వహించారు. ఇది ఆకట్టుకునేలా, వినోదాత్మకంగా సమస్యను హైలైట్‌ చేస్తుంది.

వినియోగదారుల ప్రైవసీ పట్ల యాపిల్‌ కంపెనీ అనుసరిస్తున్న విధానాలను, నిబద్ధతను తెలియజేసే శ్వేతపత్రాన్ని యాపిల్‌ రిలీజ్‌ చేసింది. యాపిల్ ఏఫోన్‌లు, హెల్త్‌కిట్‌లో హెల్త్ యాప్‌లో స్టోర్‌ చేసే డేటాను ప్రొటెక్ట్ చేయడానికి తీసుకుంటున్న చర్యలను వివరించింది.

* యాపిల్‌ ప్రిన్సిపల్స్‌ ఇవే

యాపిల్‌ కంపెనీ ప్రధానంగా నాలుగు కీలక ప్రైవసీ ప్రిన్సిపల్స్‌ను అనుసరిస్తుంది. అవి డేటా మినిమైజేషన్‌, ఆన్‌ డివైజ్‌ ప్రాసెసింగ్‌, ట్రాన్స్‌పరెన్సీ అండ్‌ కంట్రోల్‌, సెక్యూరిటీ. ఈ ప్రిన్సిపల్స్‌ను ప్రారంభం నుంచి యాపిల్‌ కంపెనీ అనుసరిస్తోంది.

యాపిల్‌ సర్వర్‌లకు పంపే హెల్త్‌ డేటా మొత్తాన్ని తగ్గించడానికి, యాపిల్‌ డివైజ్‌లోనే హెల్త్‌ మెట్రిక్స్‌ను రూపొందిస్తుంది. టూ- ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌, డివైజ్‌ పాస్‌కోడ్, హెల్త్ యాప్ డేటా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ఉంటాయి. iOS 12 లేదా నెక్స్‌ వెర్షన్‌ ఉపయోగించాలి. చివరికి యాపిల్‌ కూడా ఈ డేటాను యాక్సెస్ చేయలేదు.

WhatsApp: వాట్సాప్‌లో భారీ మార్పులు.. కాంటాక్ట్ నంబర్స్ స్థానంలో యూజర్‌నేమ్స్..

* డివైజ్‌లోనే డేటా జనరేషన్‌

హెల్త్ యాప్‌లో డిస్‌ప్లే అయ్యే ట్రెండ్స్‌& హైలైట్స్‌, రెస్టింగ్‌ హార్ట్ రేట్‌, సైకిల్‌ ట్రాకింగ్‌ ప్రెడిక్షన్స్‌ వంటివి డివైజ్‌లోనే కాలిక్యులేట్‌ అవుతాయి. ఈ డేటాకు యాపిల్‌కి యాక్సెస్‌ ఉండదని ఇక్కడే అర్థమవుతుంది.

* వినియోగదారులకు కంట్రోల్‌

హెల్త్‌ డేటా సున్నితత్వాన్ని గుర్తిస్తూ, యాపిల్ వినియోగదారులకు, తాము ఏ డేటాను షేర్‌ చేసుకుంటారు, ఎవరితో? ఎలా? అనే అంశాలపై కంట్రోల్‌ను అందించింది. యాప్‌లు హెల్త్‌ కిట్‌ ద్వారా నిర్దిష్ట డేటాకు యాక్సెస్‌ని రిక్వెస్ట్‌ చేయవచ్చు. అనుమతి ఇవ్వాలా? వద్దా? అని వినియోగదారులు నిర్ణయించుకోవచ్చు.

* ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌

ఐఫోన్‌, యాపిల్ వాచ్‌ల నుంచి కలెక్ట్ చేసిన హెల్త్‌, ఫిట్‌నెస్ డేటా డివైజ్‌లోనే ఎన్‌క్రిప్ట్ అవుతుంది. రెండింటి మధ్య సురక్షితంగా సింక్రనైజ్‌ అవుతుంది. ఎవరైనా పాస్‌కోడ్‌ లేకుండా హెల్త్ యాప్‌లో స్టోర్‌ అయిన డేటాను యాక్సెస్‌ చేయలేరు. 2022 ఆగస్టు నాటికి 95 శాతం మంది యాక్టివ్ ఐక్లౌడ్ వినియోగదారులకు యాపిల్ టూ స్టెప్‌ అథెంటికేషన్‌ను ఎనేబుల్‌ చేశారు.

First published:

Tags: Apple

ఉత్తమ కథలు