ఇండియాలో స్టూడెంట్స్‌కు సమ్మర్ హాలిడే సీజన్ ఎండ్ అయింది. ఇప్పటికే విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. కొత్త అకడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. దీంతో యాపిల్ ఇండియాలో 'బ్యాక్ టూ స్కూల్' క్యాంపెయిన్ 2022 ఎడిషన్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా స్టూడెంట్స్‌కు ఉపయోగపడే ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ప్రస్తుతం యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో మ్యాక్ బుక్స్ (MacBooks), ఐపాడ్స్‌పై (iPad) ఆఫర్లను అందిస్తోంది. కస్టమర్లు ఉచితంగా ఎయిర్‌పాడ్స్‌ను, 6 నెలల పాటు యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌తో పొందవచ్చు. అదనంగా Apple Care+పై 20 శాతం తగ్గింపు ఉంది. AirPods 2ను ఇష్టపడని వారు కేవలం రూ. 6,400తో AirPods Gen 3కి, రూ. 12,200తో AirPods ప్రో వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
ఐపాడ్స్‌లో యాపిల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్ iPad Air (5th Gen), 11-inch iPad Pro (3rd Gen), 12.9-inch iPad Pro (5th Gen) డివైజ్‌లకు వర్తిస్తుంది. PCలలో తాజా ఆఫర్లు MacBook Air M1, MacBook Air M2 (జూలైలో అందుబాటులో ఉంటుంది), MacBook Pro, 24-అంగుళాల iMac డివైజ్‌లపై ఉన్నాయి. చెల్లుబాటు అయ్యే ID కార్డులు ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా ఈ ఆఫర్లను పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఎడ్యుకేషన్ డిస్కౌంట్ ఆఫర్‌కు అర్హులో కాదో చెక్ చేసుకోవచ్చు.
Apple iPad Air 5వ జనరేషన్ USP.. PC-గ్రేడ్ M1 సిలికాన్‌తో, 8-కోర్ CPUతో వస్తుంది. ఇది 60 శాతం వరకు ఫాస్టర్ పర్ఫార్మెన్స్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. 8-కోర్ GPU మునుపటి iPad Airతో పోలిస్తే రెండింతలు వేగవంతమైన గ్రాఫిక్స్ పనితీరును అందిస్తుంది. CPU, GPUతో కలిపి 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఐప్యాడ్ ఎయిర్ అధునాతన మెషీన్ లెర్నింగ్ (ML) ఫంక్షన్స్‌కు సపోర్ట్ చేస్తుంది. 4K వీడియో స్ట్రీమ్స్ ఎడిటింగ్, ఆగ్మెంటెడ్/వర్చువల్ రియాలిటీ (AR/VR)తో సహా గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ గేమ్స్ ప్లే చేయడంతో పాటు ఇతర ఫంక్షన్స్ విషయంలో స్మూత్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించగలదు.
ఐప్యాడ్ ఎయిర్ Wi-Fi మోడల్స్ ఇండియాలో రూ. 54,900 ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. Wi-Fi + సెల్యులార్ మోడల్స్ ధరలు రూ. 68,900 నుంచి ప్రారంభమవుతాయి. M2 సిలికాన్‌తో కూడిన కొత్త మ్యాక్‌బుక్ ప్రో, ఎయిర్ విత్ M2 సిలికాన్ డివైజ్‌లు అత్యంత శక్తివంతమైన PCలుగా గుర్తింపు పొందుతున్నాయి. MacBook Air విత్ M2 ధర రూ. 1,19, 900 వరకు ఉంది. అయితే స్టూడెంట్స్ తాజా ఆఫర్‌లో దీన్ని రూ. 1, 09, 900 ధరకే సొంతం చేసుకోవచ్చు. 13-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో విత్ M2 ధర రూ. 1, 29, 900 నుంచి ప్రారంభమవుతోంది. అయితే స్టూడెంట్ ప్లాన్ ద్వారా విద్యార్థులు కేవలం రూ. 1,19,900 ప్రారంభ ధరతో దీన్ని సొంతం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.