Home /News /technology /

APPLE ANNOUNCE FREE SERVICE FOR IPHONE 12 OR IPHONE 12 PRO PHONES EVK

Apple Mobile: "ఆపిల్" సూప‌ర్ ఆఫ‌ర్‌.. ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో యూజ‌ర్ల‌కు ఉచిత స‌ర్వీస్

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ప్ర‌ముఖ మొబైల్ త‌యారీ దిగ్గ‌జం ఆపిల్(Apple) త‌మ వినియోగ‌దారుల కోసం కొత్త‌గా స‌ర్వీస్ ప్రొగ్రామ్‌ని ప్రారంభించింది. సౌండ్ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్న ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో(iPhone 12 pro) వినియోగదారులకు ఉచిత సర్వీస్(Free Service) ప్రొగ్రాంను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

ఇంకా చదవండి ...
    ప్ర‌ముఖ మొబైల్ త‌యారీ దిగ్గ‌జం ఆపిల్(Apple) త‌మ వినియోగ‌దారుల కోసం కొత్త‌గా స‌ర్వీస్ ప్రొగ్రామ్‌ని ప్రారంభించింది. ముఖ్యంగా ఐఫోన్ 12(iPhone 12), ఐఫోన్ 12 ప్రో వినియోగ‌దారులు కొన్ని ఫోన్‌ సౌండ్ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో(iPhone 12 pro)లో చాలా కొద్ది ప‌ర్సెంటేజ్‌లో సౌండ్ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయని కంపెనీ పేర్కొంది. దీని కార‌ణం రిసీవ‌ర్(Receiver) మోడ‌ల్‌లోని కాంపోనెంట్స్ ప‌నితీరు విఫ‌లం అవ్వ‌డ వ‌ల్ల సౌండ్ సంబంధిత స‌మ‌స్య‌లు ఏర్ప‌డ్డ‌ట్టు సంస్థ పేర్కొంది. అక్టోబ‌ర్ 2020, ఏప్రిల్ 2021 మ‌ధ్య‌లో త‌యారైన ఐఫోన్‌ 12, ఐఫోన్ 12 ప్రో ఈ స‌మ‌స్య ఉన్న‌ట్టు గుర్తించామ‌ని సంస్థ పేర్కొంది. ప్ర‌స్తుతం ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఉచితంగా స‌ర్వీస్ ఆప్ష‌న్(Service Option) ఇస్తున్న‌ట్లు వారు తెలిపారు.

    Google-Apple Deal: యాపిల్‌-గూగుల్ అదిరిపోయే డీల్.. విలువ రూ.ల‌క్షా ప‌దివేల కోట్లు


    స‌మ‌స్య‌ ఏంటీ..
    ఐఫోన్‌12, ఐఫోన్‌12 ప్రో యూజ‌ర్లు ముఖ్యంగా ఫోన్ చేసిన‌ప్పుడు, లేదా ఫోన్ వ‌చ్చిన‌ప్పుడు సౌండ్ సంబంధిత స‌మ‌స్య‌లు వ‌స్తే స‌మ‌స్య ప‌రిష్కారానికి మొబైల్ ఫ్రీ స‌ర్వీస్(Free Service) అందిస్తున్న‌ట్లు సంస్థ ప్ర‌క‌టించింది. ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో మాక్స్ ఫోన్‌ల ఎటువంటి స‌మ‌స్య‌లు లేవ‌ని వాటికి ఫ్రీ స‌ర్వీస్ అందించ‌ట్లేద‌ని సంస్థ ప్ర‌క‌టించింది. ఎవ‌రైతే ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో యూజ‌ర్లు ఈ స‌ర్వీస్‌ను ఉప‌యోగించుకొనే వాళ్లు మీకు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ యాపిల్ రీటైల్ సెంట‌ర్‌(Retail Center)కు వెళ్లాల‌ని సూచించారు. రీటైల్ సెంట‌ర్‌కు వెళ్లేవారు ముందుగాఅపాయింట్ మెంట్ తీసుకొని వెళ్లాల‌ని పేర్కొంది. లేదా ధ్రువీకృత(Authorized)  ఆపిల్ స‌ర్వీస్ సెంటర్‌కు వెళ్లినా ఈ సేవ‌లు పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది. ఈ-మెయిల్(e-Mail) ద్వారా కూడా ఆపిల్ స‌పోర్ట‌ర్ స‌ర్వీస్ సంబంధింత స‌మాచారం తెలుసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో రిపైర్ స‌ర్వీస్‌పొందిన వారికి రెండేళ్ల‌పాటు స‌ర్వీస్ క‌వ‌ర్ ల‌భిస్తుంద‌ని సంస్థ పేర్కొంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Apple

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు