స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి షాక్... ఎందుకంటే

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇప్పుడే కొంటే పర్లేదు కానీ... తర్వాత కొందాంలే అని వాయిదా వేస్తే మాత్రం మీకు షాక్ తప్పదు. ఎందుకో తెలుసుకోండి.

news18-telugu
Updated: July 9, 2020, 2:39 PM IST
స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి షాక్... ఎందుకంటే
స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి షాక్... ఎందుకంటే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్మార్ట్‌ఫోన్ కంపెనీలు మీకు షాక్ ఇవ్వబోతున్నాయి. వచ్చే ఏడాది నుంచి మీ స్మార్ట్‌ఫోన్‌ బాక్సులో ఛార్జర్ ఉండదు. అవును... ఇకపై స్మార్ట్‌ఫోన్లతో పాటు ఛార్జర్లను ఇవ్వకూడదని బడా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు నిర్ణయిస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి స్మార్ట్‌ఫోన్లలో ఛార్జర్లు ఉండకపోవచ్చు. బాక్సులో కేవలం స్మార్ట్‌ఫోన్ మాత్రమే ఉంటుంది. ప్రొడక్షన్ కాస్ట్‌తో పాటు ఇ-వేస్ట్ తగ్గించేందుకు యాపిల్, సాంసంగ్ లాంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకోబోతున్నాయి. యాపిల్ ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్లు కొంటే వాటితోపాటు ఛార్జర్ రాకపోవచ్చన్న వార్తలొస్తున్నాయి. సాంసంగ్ కూడా ఇదే ఆలోచన చేస్తోంది.

BSNL: బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్త ప్లాన్స్... లాభాలు ఇవే

Poco M2 Pro: బడ్జెట్ సెగ్మెంట్‌లో రిలీజైన పోకో ఎం2 ప్రో... ధర ఎంతంటే

ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌ కొంటే బాక్సులో హెడ్‌ఫోన్స్ కూడా వచ్చేవి. ఖర్చు తగ్గించుకోవడం కోసం కంపెనీలు హెడ్‌ఫోన్స్ ఇవ్వడం ఆపేశాయి. ఇప్పుడు మీరు ఏ స్మార్ట్‌ఫోన్ కొన్నా ఛార్జర్ అడాప్టర్, కేబుల్ మాత్రమే ఉంటాయి. కొన్ని కంపెనీలు స్మార్ట్‌ఫోన్ బ్యాక్ కేస్‌లు ఇస్తున్నాయి. ఒకట్రెండు స్మార్ట్‌ఫోన్లకు మాత్రం హెడ్‌ఫోన్స్ వస్తున్నాయి. త్వరలో స్మార్ట్‌ఫోన్ కొంటే బాక్సులో ఫోన్ తప్ప ఇంకేమీ ఉండకపోవచ్చు. కంపెనీలు ఫోన్లను, ఛార్జర్లను వేర్వేరుగా అమ్మే అవకాశం ఉంది. ఇందుకు మరో కారణం కూడా ఉండొచ్చు. కొన్ని ఫోన్లకు ఎక్కువ వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నా బాక్సులో మాత్రం స్టాండర్డ్ ఛార్జర్ వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకునేవారి ప్రత్యేకంగా ఛార్జర్ కొనక తప్పట్లేదు. అదే ధర తగ్గించి కేవలం స్మార్ట్‌ఫోన్ మాత్రమే అమ్మితే యూజర్లు తమకు కావాల్సిన ఛార్జర్ కొనొచ్చని కంపెనీలు భావిస్తున్నట్టున్నాయి.

4K Smart TV: రూ.24,999 ధరకే 4కే స్మార్ట్ టీవీ... చైనా కంపెనీ కాదు

WhatsApp: ఈ 5 కొత్త ఫీచర్స్‌తో మీ వాట్సప్ అదుర్స్

అంతేకాదు... ఇప్పటికే కస్టమర్ల దగ్గర ఛార్జర్లు ఉన్నట్టయితే వాటి కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. పాత ఛార్జర్ ఉపయోగించొచ్చు. దీనివల్ల ఇ-వేస్ట్ కూడా తగ్గుతుంది. అందుకే బాక్సులో ఛార్జర్ ఇవ్వొద్దన్న ఆలోచన చేస్తున్నట్టున్నాయి. ప్రస్తుతానికి యాపిల్, సాంసంగ్ లాంటి బడా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఛార్జర్ ఇవ్వకూడదన్న దిశగా ఆలోచిస్తున్నాయి. అదే జరిగితే మిగతా కంపెనీలు కూడా ఛార్జర్ లేకుండా స్మార్ట్‌ఫోన్లు అమ్మొచ్చు. ఛార్జర్ లేకుండా ఫోన్లు అమ్ముతారు కాబట్టి స్మార్ట్‌ఫోన్ రేటు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే ఛార్జర్ లేకుండా స్మార్ట్‌ఫోన్లు అమ్ముతారన్న వార్తలపై యాపిల్, సాంసంగ్ స్పందించలేదు.
Published by: Santhosh Kumar S
First published: July 9, 2020, 2:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading