మన ఫోన్‌లో ఎన్ని బ్రౌజర్లు ఉన్నా డీఫాల్ట్ బ్రౌజర్‌గా గూగుల్ (Google) ఉంటుంది. అందులో సందేహం అక్కర్లేదు. గూగుల్ అంతగా వినియోగదారులకు చేరువైంది. ప్రతీ ఫోన్‌లో అందరూ గూగుల్ వాడుతుండంతో పలు సంస్థలు గూగుల్‌తో ఒప్పందాలు చేసుకొంటున్నాయి. కొత్తగా ప్రముఖ సంస్థ యాపిల్(Apple) ఇంటర్నెట్ బ్రౌజింగ్(Browsing) దిగ్గజం గూగుల్‌తో ఏడాదికి రూ.లక్షా పదివేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకొంది.
ఈ ఏడాది తయారైన ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌లో గూగుల్ సర్చింజన్ కోసం ఈ ఒప్పందం చేసుకొన్నారు. దీంతో సఫారీ బ్రౌజర్‌లో గూగుల్ సెర్చ్ ఇంజిన్‌గా పనిచేయనుంది. మార్కెట్‌లో మైక్రోసాఫ్ట్-బింగ్ పోటీని తట్టుకునేందుకు ప్రతీ ఏడాది గూగుల్ ఇలాంటి భారీ ఒప్పందాలు చేసుకుంటూ పోతోంది. గతేడాది ఈ ఒప్పందం విలువ పది బిలియన్ల డాలర్లు ఉండగా.. 2019లో 8 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఇక వచ్చే ఏడాది ఈ విలువ మరింత పెరిగే అవకాశం ఉండవచ్చని మార్కెట్(Market) వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వచ్చే ఏడాది సుమారు 18-20 బిలియన్ డాలర్ల(Dollers) మధ్య ఈ ఒప్పందం పెరుగుతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. యాపిల్ డివైజ్‌లపై యాపిల్-గూగుల్ డీల్ గతంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. విస్తరణకు మిగతా బ్రౌజింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు అవకాశం ఇవ్వాలంటూ యూకే కాంపిటీషన్ అండ్ మార్కెట్ అథారిటీ అభిప్రాయపడింది.
ఆపిల్ పే నుంచి బిట్ కాయిన్ కొనుగోలు..
దీంతోపాటు యాపిల్ కంపెనీ పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొంటుంది. ఆపిల్ డిజిటల్ వాలెట్ అయిన ఆపిల్ పే యొక్క వినియోగదారులు ఇప్పుడు బిట్‌కాయిన్‌తో పాటు ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీలలో షాపింగ్(Shopping) చేసే వీలుంది. ఫోన్అరినా నివేదిక ప్రకారం, ఇప్పుడు ఆపిల్ పే వినియోగదారులు చెల్లింపు కోసం బిట్‌కాయిన్‌తో సహా ఇతర క్రిప్టోకరెన్సీలను ఉపయోగించగలరు. దీని కోసం, ఆపిల్ పే బిట్‌పే యాప్‌ను ప్రవేశపెట్టింది, ఇది వినియోగదారులు
బిట్‌కాయిన్(Bitcoin)ను కొనుగోలు చేయడానికి మరియు వారి యాప్ యొక్క మాస్టర్ కార్డ్‌ను ఆపిల్ పే(apple pay) వినియోగదారులకు ఉపయోగించుకునేలా చేస్తుంది. బిట్‌పే వాలెట్‌లను ఆపిల్ వాలెట్ మరియు ఆపిల్ పే రెండింటినీ కలపవచ్చు.
iOS యూజర్లకు స్పటికల్ ఆడియో సపోర్టు.
iOS వినియోగదారులను ప్రముఖ గ్లోబల్ స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై iOSలో నెట్‌ఫ్లిక్స్ చూసేవారికి స్పటికల్(spatial) ఆడియో సపోర్ట్‌ను అందించనున్నట్లు ప్రకటించింది.iOS లేదా iPadOS 14.6 రన్ అవుతున్న ఐఫోన్(iPhone), ఐప్యాడ్‌లలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నది. ప్రస్తుతం ఎయిర్‌పాడ్స్ ప్రో లేదా ఎయిర్‌పాడ్స్ మాక్స్ ద్వారా మాత్రమే ఈ స్పటికల్ ఆడియోను అందిస్తోంది. దీనితో పాటు యాపిల్ టీవి, మ్యూజిక్‌లలో ఈ సదుపాయం కలిగించనుంది. భవిష్యత్‌లో మాక్(Mac), యాపిల్ టీవీ (Apple TV) పరికరాలకు స్పటికల్ ఆడియో సపోర్ట్ చేసేలా చూసేందుకు సంస్థ ప్రయత్నాలు నడుస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.