Facebook : ఫేస్‌బుక్‌లో ఎవరు అన్‌ఫ్రెండ్ చేశారో ఇలా ఈజీగా తెలుసుకోండి...

ఫేస్‌బుక్‌లో అన్‌ఫ్రెండ్ ఆప్షన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మన ఫ్రెండ్ లిస్ట్‌లో ఉన్నవారు ఏమైనా ఇబ్బందిపెడితే వారిని వెంటనే అన్‌ఫ్రెండ్ చేసేస్తుంటాం. కొన్నిసార్లు మనల్ని కూడా అన్‌ఫ్రెండ్ చేస్తుంటారు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ చిన్న ట్రిక్ పాటించండి.

Amala Ravula | news18-telugu
Updated: March 17, 2019, 1:24 PM IST
Facebook : ఫేస్‌బుక్‌లో ఎవరు అన్‌ఫ్రెండ్ చేశారో ఇలా ఈజీగా తెలుసుకోండి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఫేస్‌బుక్ చాటింగ్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. చాలామంది డెయిలీ ఇందులో అప్‌డేట్ చేయనిదే ఏ పనిచేయరనిపిస్తుంది. మరికొంతమంది ఫ్రెండ్స్‌ని పెంచుకునేందుకు ఈ సోషల్ వెబ్‌సైట్‌ని వాడుతుంటారు. అయితే, ఆ లిస్ట్‌లో అందరూ మంచివారే ఉంటారని కాదు. కొన్ని ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయి. అలాంటి వారి నుంచి వచ్చే మెసెజెస్‌ని తట్టుకోలేక, ఇబ్బందులు పడక మనం అన్‌ఫ్రెండ్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఈ అన్‌ప్రెండ్ అనేదాన్ని మనం కూడా ఎదుర్కొంటుంటాం. అయితే, ఎవరూ అన్‌ఫ్రెండ్ చేశారో తెలుసుకోవాలంటే ‘హూ అన్‌ఫ్రెండెడ్ మీ’ అనే అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.
గూగుల్ ప్లే స్టోర్‌లో ‘హూ అన్‌ఫ్రెండెడ్ మీ’ అనే యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. దీని ద్వారా లాభమేంటంటే..ఎప్పటికప్పుడు ఫ్రెండ్‌ని గమనిస్తూ, కొత్తగా ఫ్రెండ్ లిస్ట్‌లో ఎవరు యాడ్ అయ్యారు.. ఎవరు అన్‌ఫ్రెండ్ చేశారో నోటీస్ చేస్తుంది.

అయితే.. ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేయడం వల్ల ఇలాంటి లాభమున్నట్లే.. కొంత ఇబ్బంది కూడా ఉంది. అదేంటంటే.. అదేంటంటే.. ఫోన్ స్లో అవుతుంది. కాబట్టి మీ అవసరాన్ని బట్టి వాడుకోండి.
First published: March 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు