ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో గూగుల్ ప్లే ద్వారా కొన్ని వేల యాప్స్ ని డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. అలా వాడుకునే అప్లికేషన్లలో ఏవైనా మన ఫ్రెండ్స్‌కో, తెలిసినవారికో పంపాలనుకుంటే అది ఎలా అన్నది చాలా మందికి తెలియని విషయం. ఆ యాప్ గురించి చెప్పడమో, దాని పేరు చెప్పడమో చేస్తుంటారు చాలా మంది. కొంతమందైతే... గూగుల్ ప్లే స్టోర్‌లో ఏ పేరుతో సెర్చ్ చేస్తే ఆ యాప్ వస్తుందో చెబుతారు. ఐతే... ఈ రోజుల్లో ఒకే పేరుతో రకరకాల యాప్స్ వచ్చేస్తున్నాయి. అందువల్ల మీ ఫ్రెండ్స్ మీరు చెప్పిన యాప్ కాకుండా వేరేది డౌన్లోడ్ చేసుకుంటే సమస్య రావచ్చు. సరిగ్గా మీరు వాడే యాప్ లాంటిదే అవతలి వాళ్లూ వాడాలనుకుంటే... సింపుల్‌గా మీరు వాడే యాప్‌నే వాళ్లకూ పంపవచ్చు. అందుకోసం గూగుల్ ప్లే స్టోర్‌లో ఓ యాప్ అందుబాటులో ఉంది.
ఆండ్రాయిడ్ యాప్స్‌ని ఎవరికైనా పంపాలంటే వాటిని APK ఫైల్స్ రూపంలో మార్చాల్సి ఉంటుంది. అందుకోసం APK Extrator యాప్ ఉపయోగపడుతుంది. ఇది మంచి యాప్. ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. దీని సైజ్ అంతాకలిపి 1.8 MB మాత్రమే. గూగుల్ ప్లే స్టోర్‌లో దీనికి మంచి రేటింగ్ ఉంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుని, ఇన్ స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత ఓపెన్ చేయాలి.
ఈ యాప్ ఓపెన్ చేసి చూస్తే... ఇందులో మీ మొబైల్లో ఉన్న అన్ని యాప్స్ కనిపిస్తాయి. వాటి లోంచీ మీరు ఏ యాప్‌ని APK రూపంలో పంపాలనుకుంటున్నారో... ఆ యాప్‌పై ఓ మూడు సెకన్లపాటూ మీ వేలును ఒత్తి (tap) ఉంచాలి. ఆ తర్వాత Info ఆనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చెయ్యాలి. అంతే షేర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ఉపయోగించి... Whatsappలో గానీ Facebookలో కానీ మీ ఫ్రెండ్స్, కొలీగ్స్, తెలిసినవారికి షేర్ చెయ్యవచ్చు.
APK రూపంలో జస్ట్ యాప్ మాత్రమే అవతలి వారికి వెళ్తుంది. ఆ యాప్‌లో మీరు దాచుకున్న డేటా, ఇతరత్రా వివరాలేవీ వెళ్లవు. అందువల్ల మీ సమాచారం ఏదీ అవతలి వారికి చేరదు.
ఇవి కూడా చదవండి :
ట్రూకాలర్ నుంచీ మన నంబర్ తీసేయడం ఎలా? సింపుల్ ట్రిక్... ఫాలో అవ్వండి మరి
ఆన్లైన్లో డబ్బు సంపాదించాలా? మీ కోసమే ఈ వెబ్సైట్లు... ట్రై చెయ్యండి మరి
ఆ గ్రహశకలంపై 20,00,000 కేజీల బంగారం ఉందన్న నాసా... ఫ్యూచర్లో తవ్వేస్తారా....
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.