హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Current Bill: మీ కరెంట్ మీటర్ రీడింగ్ మీరే తీసుకోవచ్చు.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఎలా అంటే?

Current Bill: మీ కరెంట్ మీటర్ రీడింగ్ మీరే తీసుకోవచ్చు.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఎలా అంటే?

మీ కరెంట్ మీటర్ రీడింగ్ మీరే తీసుకోవచ్చు.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఎలా అంటే?

మీ కరెంట్ మీటర్ రీడింగ్ మీరే తీసుకోవచ్చు.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఎలా అంటే?

ఎవరి ఇంట్లోని విద్యుత్ మీటర్ కు వారే రీడింగ్ తీసి బిల్లులు పొందేలా టెక్నాలజీని తీసుకువచ్చారు అధికారులు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇప్పుడు ప్రపంచమంతా ఆన్లైన్లోనే (Online) నడుస్తోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ (Smartphone) ఉంటే చాలు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండానే ఎన్నో పనులు చేయగలుగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ (Banking), షాపింగ్ (Shopping) లాంటివి చిటికలో చేయగలుగుతున్నాం. ముఖ్యంగా ఈ కరోనా (Corona) వచ్చినప్పటి నుంచి ఈ ఆన్లైన్ షాపింగ్, లావాదేవీలు అధికమయ్యాయి. అయితే.. విద్యుత్ బిల్లల చెల్లింపు సదుపాయం కూడా ఆన్లైన్లో ఎప్పటి నుంచో ఉన్నా.. మీటర్ రీడింగ్ కోసం మాత్రం సిబ్బంది ఇంటికి రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే.. ఈ సమస్యకు చెక్ పెట్టింది ఏపీ రాష్ట్ర ఇందన శాఖ. ఎవరి మీటర్ కు వారే రీడింగ్ తీసి బిల్లులు పొందేలా టెక్నాలజీని తీసుకువచ్చింది. ఇప్పటికే ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ తూర్ప ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) తీసుకువచ్చింది. ఈ విధానాన్ని మరో రెండు డిస్కంలు అయిన ఏపీఎస్సీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ లు కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

రీడింగ్ ఎలా తీయాలంటే..

సొంతంగా రీడింగ్ తీసుకోవాలనుకుంటున్న వారు మొదటగా గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఈస్టర్న్‌ పవర్‌ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం యాప్ లో పేరు, చిరునామా, సెల్‌ ఫోన్‌ నంబర్, మెయిల్‌ ఐడీ నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారా లాగిన్‌ అవ్వాలి. తర్వాత 16 నంబర్ల విద్యుత్ సర్వీస్‌ మీటరును నమోదు చేయాలి.

UPI offline: మొబైల్ డేటా లేకపోయినా యూపీఐ పేమెంట్స్... *99# సర్వీస్ వాడుకోండి ఇలా

అనంతరం మీకు వెంటనే మీ సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేస్తే మీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి అవుతుంది. అనంతరం మీటరు ఐకాన్‌ రిజిస్ట్టర్‌ సర్వీస్‌ నంబర్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత కెమెరా ఐకాన్‌ ద్వారా మీటర్‌ రీడింగ్‌ ను స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. దానిని సబ్మిట్‌ చేయాలి. అనంతరం సంబంధిత అధికారి నిర్ధారణ చేస్తారు. అనంతరం వినియోగదారుడి మొబైల్‌కు సమాచారం వస్తుంది.

Indian Railways: పండుగ పూట రైల్వే ప్రయాణికులకు భారీ షాక్.. ఆ టికెట్ ధర డబుల్.. వివరాలివే

ఈ విధానం ఎందుకంటే..

కరోనా నేపథ్యంలో బిల్ తీసుకునేందుకు విద్యుత్ సిబ్బంది ఇళ్లలోకి రావడంపై అనేక మంది భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు సిబ్బంది ప్రాణాలు సైతం కోల్పోయారు. కొన్ని సార్లు కరోనా పరిస్థితుల నేపథ్యంలో బిల్లులు తీయడం ఆలస్యం కావడంతో స్లాబులు మారి బిల్లులు కూడా పెరడంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ సమస్యలు పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ లో ఈ విధానాన్ని తీసుకువచ్చారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, Digital Platform, ELectricity, Online service

ఉత్తమ కథలు