మీరు వాహనాన్ని వేగంగా నడుపుతున్నారా? అయితే స్పీడ్ ట్రాప్ కెమెరాకు చిక్కుతారు జాగ్రత్త. అంతేకాదు... ఫైన్ కూడా చెల్లించాల్సి వస్తుంది. అనుమతించిన వేగం కంటే వాహనం నడపడం తప్పు. ఒకవేళ పొరపాటున వేగంగా వాహనం నడిపితే బుక్కవ్వాల్సిందే. అందుకే ఎక్కడెక్కడ స్పీడ్ కెమెరాలు ఉన్నాయో ముందే హెచ్చరిస్తోంది గూగుల్ మ్యాప్స్. మీరు మ్యాప్‌లోనే స్పీడ్ కెమెరాను గుర్తించొచ్చు. మీ బండి వేగాన్ని తగ్గించొచ్చు. సూచించిన స్పీడ్‌లోనే బండిని నడపొచ్చు. గూగుల్ మ్యాప్స్‌లో కొత్తగా ప్రారంభమైన సేవలివి. మీకు కొన్ని కిలోమీటర్ల ముందుగానే స్పీడ్ ట్రాప్ కెమెరాలను గుర్తించి గూగుల్ మ్యాప్స్ అలర్ట్ చేస్తుంది. గూగుల్ మ్యాప్స్‌లో బ్లూ కలర్లో సీసీ కెమెరా ఐకాన్ కనిపిస్తే అక్కడ స్పీడ్ ట్రాప్ కెమెరా ఉన్నట్టే.

image: www.androidpolice
స్పీడ్ ట్రాప్ కెమెరాలను గుర్తించడం మాత్రమే కాదు... మీరు వెళ్లే రూట్లో ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగినట్టైతే ఆ విషయం కూడా గూగుల్ మ్యాప్స్‌లో తెలుసుకోవచ్చు. ముందుగానే యాక్సిడెంట్ గురించి మీకు సమాచారం లభిస్తుంది కాబట్టి మీరు ఆ రూట్ ఎవాయిడ్ చేయొచ్చు. లేదా ఆ రూట్లో ఇంకాస్త జాగ్రత్తగా వెళ్లొచ్చు. మీకు గూగుల్ మ్యాప్స్‌లో రెడ్ కలర్ ఐకాన్ కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ ఫీచర్ సరిగ్గా పనిచేయట్లేదు. రోడ్డు రిపేర్ చేస్తున్నా... ఆ ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగినట్టు గూగుల్ మ్యాప్స్ చూపిస్తోంది.

image: www.androidpolice
మీరు మీ గూగుల్ మ్యాప్స్‌ని అప్డేట్ చేస్తే ఈ కొత్త సేవల్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు... ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే మీరే స్వయంగా రిపోర్ట్ చేయొచ్చు. వాహనదారులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి గూగుల్ మ్యాప్స్‌లోని ఈ కొత్త ఫీచర్లు ఉపయోగపడ్తాయని భావిస్తోంది గూగుల్.
Holi 2019: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు... కలర్‌ఫుల్ ఫోటోలు చూడండి
ఇవి కూడా చదవండి:
(సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన మినిట్ టు మినిట్ న్యూస్ అప్డేట్స్ పొందేందుకు న్యూస్18 తెలుగు వాట్సప్ నోటిఫికేషన్ కోసం సబ్‌స్కైబ్ చేయండి)
Neta App: మీ లీడర్‌కు మీ స్మార్ట్‌ఫోన్‌లో రేటింగ్ ఇవ్వొచ్చు ఇలా...
Redmi Go: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... 'రెడ్మీ గో' ధర రూ.4,499 మాత్రమే
Post Office Internet Banking: పోస్ట్ ఆఫీస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలా వాడుకోవాలిPublished by:Santhosh Kumar S
First published:March 20, 2019, 17:05 IST