హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Aadhaar Facebook Link | సోషల్ మీడియా అకౌంట్లతో ఆధార్‌తో లింక్?

Aadhaar Facebook Link | సోషల్ మీడియా అకౌంట్లతో ఆధార్‌తో లింక్?

ఫేస్ బుక్ లోగో, ఆధార్ కార్డ్

ఫేస్ బుక్ లోగో, ఆధార్ కార్డ్

సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే ఆలోచన ఏమైనా ఉందా? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే ఆలోచన ఏమైనా ఉందా? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఓ పిటిషన్ విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ ప్రశ్న వేసింది. దీనిపై సెప్టెంబర్ 24వ తేదీలోగా వివరణ ఇవ్వాలంటూ జస్టిస్ దీపక్ గుప్తా నేతృత్వంలోని బెంచ్ కేంద్రాన్ని ఆదేశించింది. అన్ని సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్ లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఓ గుర్తింపు నెంబర్‌ను లింక్ చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో రెండు, మధ్యప్రదేశ్, బోంబే హైకోర్టుల్లో చెరో పిటిషన్ దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై స్పందించిన ఫేస్ బుక్ అన్నీ కలసి సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ గతంలో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఫేస్ బుక్ దాఖలు చేసిన పిటిషన్ మీద విచారించిన న్యాయస్థానం అసలు కేంద్ర ప్రభుత్వం వద్ద ఆధార్, ఫేస్ బుక్ (లేదా సోషల్ మీడియా)‌తో లింక్ చేస్తుందా? అనే సందేహాన్ని లేవనెత్తింది.

First published:

Tags: Aadhaar, Facebook, Social Media, Supreme Court

ఉత్తమ కథలు