మీ ఫోన్‌లో ఈ యాప్ ఉందా....అయితే మీ డబ్బులు గోవిందా ...

ఎనీ డెస్క్ ద్వారా లావాదేవీలు జరిపే బ్యాంకులు, ఇతర ఆపరేటర్లు బీ అలర్ట్ అంటూ ఆర్బీఐ వార్నింగ్ ఇచ్చింది.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 20, 2019, 7:31 AM IST
మీ ఫోన్‌లో ఈ యాప్ ఉందా....అయితే మీ డబ్బులు గోవిందా ...
ప్రతీకాత్మక చిత్రం
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 20, 2019, 7:31 AM IST
నోట్లరద్దు పుణ్యమా అంటూ... డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్నాయి. ఎవరికైనా డబ్బులు చెల్లించలన్నా... లేదంటే ఏదైనా కొనాలన్నా ఇప్పుడు కరెన్సీతో పనిలేదు. కూర్చున్న చోట నుంచే కరెంట్ బిల్లుల నుంచి హోమ్ లోన్ల వరకు అన్నీ చెల్లించే రోజులు. అయితే డిజిటల్ లావాదేవీల కోసం మొబైల్ ఫోన్ యూజర్లు రకరకాల యాప్స్‌ను ఇన్ స్టాల్ చేసుకుంటూ ఉంటారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలా అనేక రకాల యాప్స్‌ను యూజ్ చేస్తుంటారు. వీటి వల్ల పెద్దగా నష్టం లేకపోయిన... ఎనీ డెస్క్ అనే యాప్ ఉంటే మాత్రం డేంజర్ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

‘ఎనీ డెస్క్‌’ అనే ఓ మొబైల్‌ యాప్‌ ద్వారా ‘యునైటెడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌’ (యూపీఐ) ఆన్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థపై కొన్ని మోసాలు జరుగుతున్నాయి. ఇది ఎవరో చెప్పిందం కాదు. స్వయాన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే హెచ్చరించింది. ఎనీ డెస్క్ ద్వారా లావాదేవీలు జరిపే బ్యాంకులు, ఇతర ఆపరేటర్లు బీ అలర్ట్ అంటూ ఆర్బీఐ వార్నింగ్ ఇచ్చింది. ఆ యాప్ ద్వారా వినియోగదారుల ఫోన్లను ఆధీనంలోకి తీసుకొని వారి ఖాతాల్లోని డబ్బును కొందరు సైబర్ నేరగాళ్లు మాయం చేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై ఆర్‌బీఐ సైబర్‌ భద్రత, ఐటీ పరిశోధన విభాగం ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది.

యూపీఐతోపాటు మొబైల్‌ వ్యాలెట్‌లు, బ్యాంకింగ్‌ యాప్‌ల వ్యవస్థలపైనా అక్రమాలు జరుగుతున్నాయని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) అధికారులు చెబుతున్నారు. ఎనీ డెస్క్‌ యాప్‌లో ఉన్న లోపాన్ని వాడుకొని , వేరే నకిలీ యాప్‌లను సృష్టించి దుండగులు మోసాలకు పాల్పడుతుండవచ్చని సైబర్‌ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎనీ డెస్క్ యాప్‌తో లావాదేవీలు జరిపే వారంతా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు.

First published: February 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...