హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartphone Blast: టపాసులను తలపిస్తున్న Redmi ఫోన్లు.. దారుణంగా పేలిన మరో ఫోన్.. వీడియో చూస్తే షాకవుతారు

Smartphone Blast: టపాసులను తలపిస్తున్న Redmi ఫోన్లు.. దారుణంగా పేలిన మరో ఫోన్.. వీడియో చూస్తే షాకవుతారు

ఫొటో: ట్విట్టర్

ఫొటో: ట్విట్టర్

ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్‌ఫోన్లు పేలడం లాంటి ఘటనలు ఇటీవల అనేకంగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం రెడ్‌మీ 6ఏ ఫోన్ పేలుడుకు గురై ఓ మహిళ ప్రాణాలను కోల్పియన విషయం తెలిసిందే..

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Vijayawada

  ఎలక్ట్రిక్ వాహనాలు (Electric Vehicles), స్మార్ట్‌ఫోన్లు (Smartphones) పేలడం లాంటి ఘటనలు ఇటీవల అనేకంగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం రెడ్‌మీ 6ఏ (Redmi 6A) లో పేలుడు కారణంగా ఓ మహిళ మరణించిన వార్త స్మార్ట్ ఫోన్ వాడే వారిని షాక్ గురి చేసింది. అదే సమయంలో ఫోన్ పేలుడు కారణంగా బరేలీకి చెందిన ఓ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు షియోమీకి (Xiaomi) చెందిన మరో ఫోన్ పేలిన ఉదంతం తెరపైకి వచ్చింది. Redmi Note 11T Pro ఫోన్ పేలింది. అయితే.. ఈ పేలుడు కారణంగా ఎవరూ చనిపోలేదు. అయితే వైరల్ వీడియోలో బ్లాస్ట్ అయిన పరికరాన్ని చూస్తే మాత్రం షాక్ అయ్యేలా ఉంది. Redmi Note 11T Pro బ్యాటరీలో పేలుడు జరిగిన విషయం చైనా దేశంలో చోటు చేసుకుంది.

  భారతదేశంలో, ఈ ఫోన్ Redmi K50i గా రీబ్రాండ్ చేయబడింది. మరియు విడుదల చేయబడింది కూడా. టిక్‌టాక్‌లో షేర్ చేయబడిన వీడియోలో, ఫోన్ స్క్రీన్ మరియు వెనుక ప్యానెల్ పూర్తిగా దెబ్బతిన్నాయి. స్క్రీన్ అద్దాలు పగిలిపోయాయి. అదే సమయంలో, వెనుక ప్యానెల్‌లోని కెమెరా మాడ్యూల్‌లోని కొంత భాగం మినహా.. ప్రతిదీ కాలిపోయింది.

  Smartphone Blast: ఫోన్ ను పక్కనే ఉంచి పడుకునే వారికి షాక్? ఇది చదివితే అలా చేయరు ఇక..

  అయితే.. ఈ ఫోన్ పేలడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. గత సంవత్సరం, OnePlus Nord 2 స్మార్ట్‌ఫోన్ బ్లాస్ట్ అయిన అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత కంపెనీ చాలా మంది వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. అయితే, ప్రతిసారీ స్మార్ట్‌ఫోన్ పేలినప్పుడు అది డివైజ్ మేకర్ తప్పు కాదని.. వినియోగదారుల తప్పిదాల వల్ల చాలా సార్లు స్మార్ట్‌ఫోన్‌లు పేలుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: China, Electric Vehicles, Redmi, Smartphones, Xiaomi

  ఉత్తమ కథలు