Home /News /technology /

ANOTHER FAMOUS APP HAS BEEN BANNED IF THEY KNOW WHY THEY DID IT THEY WILL SAY UMG GH

VLC Media Player: మరో ఫేమస్ యాప్ బ్యాన్.. ఎందుకు చేశారో తెలిస్తే అయ్యో అంటారు !

 మరో ఫేమస్ యాప్ బ్యాన్.. ఎందుకు చేశారో తెలిస్తే అయ్యో అంటారు !

మరో ఫేమస్ యాప్ బ్యాన్.. ఎందుకు చేశారో తెలిస్తే అయ్యో అంటారు !

భారత ప్రభుత్వం VLC మీడియా ప్లేయర్‌(Player)ను బ్యాన్ చేసింది. ఇండియన్ యూజర్లు VLC మీడియా ప్లేయర్ వెబ్‌సైట్ “www.videolan.org”, డౌన్‌లోడ్ లింక్‌ను యాక్సెస్ చేయడం కుదరడం లేదు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ప్రముఖ మీడియా ప్లేయర్ వీఎల్‌సీ(VLC)ని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యూజ్‌ చేస్తున్నారు. కంప్యూటర్ల(Computer)తో పాటు ఆండ్రాయిడ్(Android), ఐఓఎస్ యూజర్లకు కూడా ఈ వీడియో ప్లేయర్ ఫేవరెట్‌గా ఉంటుంది. అయితే భారత ప్రభుత్వం VLC మీడియా ప్లేయర్‌ను బ్యాన్ చేసింది. ఇండియన్ యూజర్లు VLC మీడియా ప్లేయర్ వెబ్‌సైట్ “www.videolan.org”, డౌన్‌లోడ్ లింక్‌ను యాక్సెస్ చేయడం కుదరడం లేదు. ఈ ప్లేయర్ అఫీషియల్ వెబ్‌సైట్‌కు యాక్సెస్ బ్లాక్ అయినా యాప్ (VLC App) మాత్రం ఇప్పటికీ యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ రెండింటిలోనూ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ ప్లేయర్ సాఫ్ట్‌వేర్‌ను లేదా యాప్‌ను డౌన్‌లోడ్ వేసుకుని ఉంటే.. అది పని చేస్తూనే ఉంటుందని యూజర్లు గమనించాలి.

ప్యారిస్‌(Paris)కు చెందిన వీడియోలాన్ సంస్థ డెవలప్ చేసిన వీఎల్‌సీ మోస్ట్ పాపులర్ వీడియో ప్లేయర్లలో ఒకటిగా నిలుస్తోంది. అయితే వీఎల్‌సీ వెబ్‌సైట్‌, అఫీషియల్ డౌన్‌లోడ్ లింక్‌ను భారత ప్రభుత్వం ఏడాది ఫిబ్రవరి 13వ తేదీనే బ్యాన్ చేసింది. అంటే నిషేధం విధించి 5 నెలలకు పైగానే గడిచిపోతుంది. కాకపోతే ఈ విషయం తాజాగా తెలిసిందని MediaNama అనే టెక్ వెబ్‌సైట్‌ రిపోర్ట్ తెలిపింది. ఈ బ్యాన్ గురించి కంపెనీ గానీ భారత ప్రభుత్వం గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా వంటి అన్ని ప్రధాన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు భారతదేశంలోని యూజర్లు VLC వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతించడం లేదు. ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్న వారు VLC యాప్ లేదా సాఫ్ట్‌వేర్‌ సేవలను ఇప్పటికీ యాక్సెస్ చేయవచ్చు.

ఇదీ చదవండి: Mahindra EVs: ఇక అన్ని సెగ్మెంట్లలోకి ఈవీ కార్స్ లాంచ్.. మహీంద్రా ఫ్యూచర్ ప్లాన్ చూస్తే మతిపోతుందీ..!


 ఇండియాలో వీఎల్‌సీ ఎందుకు బ్యాన్ అయింది?
ఏప్రిల్ 2022లో చైనాకు చెందిన సికాడా (Cicada) అనే హ్యాకర్ గ్రూప్ చైనా ప్రభుత్వం మద్దతుతో సైబర్‌టాక్ క్యాంపెయిన్‌లో భాగంగా పీసీలలోకి మాల్వేర్ పంపించడానికి VLC మీడియా ప్లేయర్‌ని ఉపయోగించిందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు గతంలో పేర్కొన్నారు. ఈ కారణంగానే ఐటీ యాక్ట్, 2000 ప్రకారం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ ప్లేయర్‌ వెబ్‌సైట్‌ను బ్యాన్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదొక సాఫ్ట్ బ్యాన్ కాబట్టి మీడియా ప్లాట్‌ఫామ్‌ను నిషేధిస్తున్నట్లు కంపెనీ లేదా భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అందుకే ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.



ప్రస్తుతం ట్విట్టర్ యూజర్లు VLC ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నామని తెలుపుతున్నారు. ఒక ట్విటర్ యూజర్‌లలో VLC వెబ్‌సైట్ స్క్రీన్‌షాట్‌ను ట్వీట్ చేశారు. అందులో "ఐటీ యాక్ట్, 2000 ప్రకారం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆర్డర్ ప్రకారం వెబ్‌సైట్ బ్యాన్ అయింది" అని ఒక వార్నింగ్ మెసేజ్ కనిపించింది. దాంతో దేశంలో ఎవరూ ఏ పని కోసమైనా VLC ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయలేరు. 2020లో భారత ప్రభుత్వం PUBG మొబైల్, TikTok, Camscanner వంటి చైనీస్ యాప్‌లను బ్యాన్ చేసింది. ఇప్పటికీ వీటిలో అన్నిటిపై బ్యాన్‌ కొనసాగుతోంది. భారత ప్రజల భద్రత మేరకే ప్రభుత్వం వీటిని నిషేధించింది
Published by:Mahesh
First published:

Tags: Apps, Google Play store, Hackers, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు