WhatsApp: వాట్సప్ నుంచి కొత్తగా 5 ఫీచర్స్... విశేషాలివే

WhatsApp | వాట్సప్ నుంచి మరో 5 సరికొత్త ఫీచర్స్ రాబోతున్నాయి. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: July 2, 2020, 5:03 PM IST
WhatsApp: వాట్సప్ నుంచి కొత్తగా 5 ఫీచర్స్... విశేషాలివే
WhatsApp: వాట్సప్ నుంచి కొత్తగా 5 ఫీచర్స్... విశేషాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వాట్సప్ యూజర్లకు అతిపెద్ద శుభవార్త. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఫీచర్లను రిలీజ్ చేయబోతోంది వాట్సప్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. వాట్సప్ ఫీచర్ల గురించి ఎక్కువగా రూమర్స్ వస్తుంటాయి. కానీ ఈసారి వాట్సప్ ఐదు ఫీచర్లను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. యానిమేటెడ్ స్టిక్కర్స్, క్యూఆర్ కోడ్స్, వెబ్, డెస్ట్‌టాప్ యాప్‌కు డార్క్ మోడ్, కేఏఐఓఎస్‌కు స్టేటస్ ఫీచర్, గ్రూప్ వీడియో కాల్స్‌ లిమిట్ పెంచడం లాంటి మార్పులు చేయబోతోంది వాట్పప్. త్వరలో ఈ ఫీచర్లన్నీ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఇంకొన్ని వారాల్లో ఒక్కొక్కటిగీ ఈ ఫీచర్స్‌ని రిలీజ్ చేయనుంది వాట్సప్. మరి ఏఏ ఫీచర్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకోండి.

Animated Stickers: మీరు ఇప్పటికే వాట్సప్‌లో స్టిక్కర్ ఫీచర్ ఉపయోగిస్తున్నట్టైతే త్వరలో యానిమేటెడ్ స్టిక్కర్స్ వాడుకోవచ్చు. అంటే స్టిక్కర్‌కు యానిమేషన్‌తో మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా వర్షన్లలో యానిమేటెడ్ స్టిక్కర్ ఫీచర్‌ని టెస్ట్ చేస్తోంది. మీరు వాట్సప్ బీటా యూజర్ అయితే ఆండ్రాయిడ్ 2.20.194.7, ఐఓఎస్ 2.20.70.26 వర్షన్‌ అప్‌డేట్ చేయాలి. మీకు వాట్సప్ యానిమేటెడ్ స్టిక్కర్స్ కనిపిస్తాయి. మీరు యానిమేటెడ్ స్టిక్కర్స్‌ని సేవ్ చేయొచ్చు. ఇతరులకు పంపొచ్చు. అంతేకాదు... ప్లే స్టోర్ నుంచి థర్డ్ పార్టీ యానిమేటెడ్ స్టిక్కర్స్‌ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు.

Alternative Apps: టిక్‌టాక్, హెలో, షేర్ ఇట్ యాప్స్‌కు ప్రత్యామ్నాయ యాప్స్ ఇవే

Jio offer: జియో యూజర్లకు ఉచితంగా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్... ప్లాన్స్ ఇవే

QR codes: మీరు మీ వాట్సప్‌ని డెస్క్‌టాప్‌లో ఓపెన్ చేసేందుకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు కదా? సరిగ్గా అలాగే కాంటాక్ట్స్‌ని యాడ్ చేసేందుకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు. ప్రస్తుతం ఈ ఫీచర్ స్నాప్‌చాట్‌లో ఉంది.

Dark mode: స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ వాడేవారికి ఇప్పటికే డార్క్‌మోడ్ ఫీచర్ వచ్చింది. వెబ్, డెస్క్‌టాప్ యాప్‌లో కూడా డార్క్ మోడ్ ఫీచర్ రానుంది.

Group video calls: గ్రూప్ వీడియో కాల్‌లో మరిన్ని మార్పులు చేస్తోంది వాట్సప్. లిమిట్‌ను ఇప్పటికే నాలుగు నుంచి ఎనిమిదికి పెంచిన సంగతి తెలిసిందే. ఇకపై వాట్సప్ గ్రూప్ కాల్‌లోఉన్న పార్టిసిపెంట్స్‌లో ఒకరిని ఫుల్ స్కీన్‌లోకి మార్చొచ్చు. అంటే ఎవరి వీడియో పైన క్లిక్ చేస్తే వారి వీడియో ఫుల్ స్క్రీన్ అవుతుంది.KaiOS Status feature: కేఏఐఓఎస్‌కు స్టేటస్ ఫీచర్‌ను కూడా తీసుకురానుంది వాట్సప్.
First published: July 2, 2020, 5:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading