Smartphones | మీరు స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నారా? అయితే కచ్చితంగా మీరు ఒక విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకని అనుకుంటున్నారా? ఆండ్రాయిడ్ ఫోన్ (Phone) యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే బ్యాంక్ (Bank) అకౌంట్ ఖాళీ అయిపోతుంది. జాగ్రత్తగా లేకపోతే మాత్రం సైబర్ నేరాల బారిన పడాల్సి వస్తుంది. సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్ మాల్వేర్ బైట్స్ తాజాగా కీలక విషయాన్ని వెల్లడించింది.
వైరస్ కలిగి ఉన్న గూగుల్ ప్లే స్టోర్ యాప్స్ జాబితాను విడుదల చేసింది. బ్లాగ్ పోస్ట్‌లో కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. వైరస్ బారిన యాప్స్ పిషింగ్ సైట్స్‌ను ఓపెన్ చేస్తున్నాయని కంపెనీ పేర్కొంది. క్రోమ్‌లో ఈ యాప్స్ ఫిషింగ్ వెబ్సైట్లను ఓపెన్ చేస్తున్నాయని మాల్వేర్ బైట్స్ తెలిపింది. అందువల్ల స్మార్ట్‌ఫోన్ వాడే వారు ఇలాంటి యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలి.
ఎస్బీఐ టాప్ 5 స్కీమ్స్.. రూ.లక్షకు రూ.10 లక్షల లాభం!
ట్రోజన్ మాల్వేర్ కలిగిన నాలుగు యాప్స్‌ను సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. వీటిల్లో బ్లూటూత్ ఆటో కనెక్ట్, బ్లూటూత్ యాప్ సెండర్, డ్రైవర్ బ్లూటూత్ యూఎస్బీ వైఫై, మొబైల్ ట్రాన్స్ఫర్ స్మార్ట్ స్విచ్ అనేవి 4 డేంజరస్ యాప్స్. అందువల్ల ఈ యాప్స్‌లో మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలేట్ చేసేయండి.
రూ.330 పొదుపుతో చేతికి రూ.14 లక్షలు.. ఈ 4 స్కీమ్స్‌తో భారీ లాభం!
ఈ నాలుగు యాప్స్‌ను కలిపి చూస్తే ఏకంగా 10 లక్షలకు పైగా డౌన్ లోడ్స్ ఉన్నాయి. ఈ యాప్స్‌కు సంబంధించిన ఓల్డర్ వెర్షన్లలో కూడా మాల్వేర్ ఉన్నట్లు గతంలోనే గుర్తించారు. అయతే మరోసారి వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ పేర్కొంటోంది. ఈ యాప్ తొలిగా సాధారణంగానే కనిపిస్తాయని, అయితే తర్వాత మాల్వేర్ ప్రవర్తనను ప్రదర్శిస్తాయని మాల్వేర్ బైట్స్ సంస్థ పేర్కొంటోంది.
ఈ 4 యాప్స్ అనేవి గూగుల్ క్రోమ్‌లో ఫిషింగ్ వెబ్సైట్లను ఓపెన్ చేస్తున్నాయని తెలిపింది. ఈ ఫిషింగ్ వెబ్సైట్లతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. అడల్ట్ కంటెంట్ ఉన్న పేజ్‌లు కూడా ఓపెన్ అవుతాయి. ఈ పేజ్‌లలో మీ ఫోన్ వైరస్ బారిన పడిందని, వెంటనే అప్డేట్ చేసుకోవాలనే పాపప్ మెసేజ్‌లు వస్తాయి. నిజం అని వీటిపై క్లిక్ చేస్తే ఇక అంతే. మీ డేటా మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్లిపోతుంది. అందుకే ఇలాంటి యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. మీ ఫోన్ లాక్‌లో ఉన్నా కూడా క్రోమ్‌లో ఈ యాప్స్ వల్ల ఫిషింగ్ సైట్లు ఓపెన్ అవుతాయి. అందువల్ల మీరు వెంటనే మీ ఫోన్ నుంచి ఈ యాప్స్‌ను డిలేట్ చేసేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apps, Mobile phones, Smartphones