హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Messages: టెక్స్‌ట్ మెసేజెస్‌ని షెడ్యూల్ చేయొచ్చు... ఎలాగో తెలుసుకోండి

Google Messages: టెక్స్‌ట్ మెసేజెస్‌ని షెడ్యూల్ చేయొచ్చు... ఎలాగో తెలుసుకోండి

Google Messages: టెక్స్‌ట్ మెసేజెస్‌ని షెడ్యూల్ చేయొచ్చు... ఎలాగో తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Google Messages: టెక్స్‌ట్ మెసేజెస్‌ని షెడ్యూల్ చేయొచ్చు... ఎలాగో తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Google Messages | ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ మెసేజెస్ యాప్‌లో టెక్స్‌ట్ మెసేజెస్‌ని షెడ్యూల్ చేయొచ్చు. భవిష్యత్తులో పంపాల్సిన ఎస్ఎంఎస్‌ను ముందే టైప్ చేసి టైమ్ సెట్ చేయొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

గూగుల్ డిఫాల్ట్ మెసేజ్ యాప్‌లో కొత్తకొత్త ఫీచర్స్ వస్తున్నాయి. ప్రతీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మెసేజెస్ (Google Messages) యాప్ డిఫాల్ట్ మెసేజింగ్ యాప్‌గా లభిస్తుంది. కొందరు ఈ యాప్ వాడకుండా థర్డ్ పార్టీ మెసేజింగ్ యాప్ (Messaging App) డౌన్‌లోడ్ చేసి వాడుతుంటారు. కానీ గూగుల్ మెసేజెస్ యాప్ వాడేవారే ఎక్కువ. ఇప్పుడు గూగుల్ మెసేజెస్ యాప్‌లో ఎస్ఎంఎస్ షెడ్యూల్ చేసే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అంటే మీరు ఎవరికైనా భవిష్యత్తులో ఏదైనా మెసేజ్ పంపాలనుకుంటే ముందే టైప్ చేసి, టైమ్ సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఉదాహరణకు ఎవరికైనా భవిష్యత్తులో బర్త్ డే మెసేజ్ యాప్ పంపాల్సి ఉంటే మెసేజ్ టైప్ చేసి, ఆ డేట్ సెలెక్ట్ చేస్తే చాలు. సరిగ్గా ఆ టైమ్‌కి ఎస్ఎంఎస్ డెలివరీ అవుతుంది.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు మెసేజెస్ షెడ్యూల్ చేసేందుకు ఇన్నాళ్లూ థర్డ్ పార్టీ యాప్ ఉపయోగించేవారు. ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్ వాడాల్సిన అసరం లేకుండా స్మార్ట్‌ఫోన్‌లో డిఫాల్ట్‌గా లభించే గూగుల్ మెసేజెస్ యాప్‌లో మెసేజ్ షెడ్యూల్ చేయొచ్చు. మరి మీ ఫోన్‌లో గూగుల్ మెసేజెస్‌లో ఎస్ఎంఎస్ ఎలా షెడ్యూల్ చేయాలో తెలుసుకోండి.

BoAt Smartwatch: బోట్ వేవ్ అల్టిమా కాలింగ్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది... ఫీచర్స్ తెలుసుకోండి

గూగుల్ మెసేజెస్ యాప్‌లో ఎస్ఎంఎస్ షెడ్యూల్ చేయండిలా

Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మెసేజెస్ యాప్ ఓపెన్ చేయండి.

Step 2- మీరు ఎవరికి మెసెజ్ పంపాలనుకుంటున్నారో వారి పేరు సెలెక్ట్ చేయండి.

Step 3- మెసేజ్ టైప్ చేయండి.

Step 4- ఆ తర్వాత సెండ్ బటన్ క్లిక్ చేయొద్దు. సెండ్ బటన్ పైన లాంగ్ ప్రెస్ చేయాలి.

Step 5- Schedule Send ఆప్షన్ సెలెక్ట్ చేయండి.

Step 6- ఆ తర్వాత Select date and time పైన క్లిక్ చేయండి.

Step 7- క్యాలెండర్‌లో డేట్ సెలెక్ట్ చేయండి.

Step 8- ఆ తర్వాత టైమ్ సెలెక్ట్ చేయండి.

Step 9- ఆ తర్వాత Save పైన క్లిక్ చేస్తే చాలు. మెసేజ్ షెడ్యూల్ అవుతుంది.

మీరు ఒకసారి షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను మాడిఫై చేయొచ్చు లేదా డిలిట్ చేయొచ్చు. షెడ్యూల్ చేసినా వెంటనే పంపాలనుకుంటే మెసేజ్ పంపొచ్చు. వేర్వేరు దేశాల్లో నివసించేవారికి మెసేజెస్ పంపడానికి, బిజీగా ఉండేవారికి ఎస్ఎంఎస్ చేయడానికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.

Price Cut: ఈ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది... రూ.9,999 ధరకే సొంతం చేసుకోండి

ఇటీవల మెసేజెస్ యాప్‌ను రీడిజైన్ చేసింది గూగుల్. యాపిల్ ఐమెసేజ్ ప్లాట్‌ఫామ్‌తో పాటు వాట్సప్‌కు పోటీ ఇచ్చేందుకు కొన్ని ఫీచర్స్‌ని అందిస్తోంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కూడా గూగుల్ టెస్ట్ చేస్తోంది.

First published:

Tags: Android, Google, Google messages

ఉత్తమ కథలు