• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • ANDROID SCANNER APP THAT WILL DIGITALLY FILE YOUR PAPERWORK MK GH

Google Stack app: ఇక ఈ యాప్ ఉంటే చాలు స్కానర్ అవసరం లేదు..

Google Stack app: ఇక ఈ యాప్ ఉంటే చాలు స్కానర్ అవసరం లేదు..

ప్రతీకాత్మక చిత్రం

టెక్ దిగ్గజం గూగుల్ మరో కొత్త యాప్‌ను విడుదల చేసింది. ముఖ్యమైన డాక్యుమెంట్లను స్కాన్ చేయడంతో పాటు వాటి స్టోరేజీ, నిర్వహణకు కొత్త యాప్‌ను సంస్థ అభివృద్ధి చేసింది. దీని పేరు ‘స్టాక్’ యాప్. దీన్ని గూగుల్‌కు చెందిన ఏరియా 120 డివిజన్ విభాగం అభివృద్ధి చేసింది.

  • Share this:
టెక్ దిగ్గజం గూగుల్ మరో కొత్త యాప్‌ను విడుదల చేసింది. ముఖ్యమైన డాక్యుమెంట్లను స్కాన్ చేయడంతో పాటు వాటి స్టోరేజీ, నిర్వహణకు కొత్త యాప్‌ను సంస్థ అభివృద్ధి చేసింది. దీని పేరు ‘స్టాక్’ యాప్. దీన్ని గూగుల్‌కు చెందిన ఏరియా 120 డివిజన్ విభాగం అభివృద్ధి చేసింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే స్కానర్ యాప్. స్మార్ట్ ఫోన్ కెమెరా ద్వారా డాక్యుమెంట్లు, బిల్లులు, వివిధ రకాల రసీదులను స్కాన్ చేయవచ్చు. వీటిని యూజర్లు భద్రంగా సేవ్ చేసుకోవచ్చు. వివిధ రకాల స్కానింగ్ కాపీలను కేటగిరీల వారీగా యాప్‌ ఆటోమేటిగ్గా సేవ్ చేస్తుంది. ఇందుకు గూగుల్‌కు చెందిన లాంగ్వేజ్ రికగ్నిషన్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ వంటి వాటిని యాప్ ఉపయోగిస్తుంది.

స్కాన్ చేసిన డాక్యుమెంట్లలోని అకౌంట్ నంబర్లు, బిల్లుల బకాయిలు, గడువు తేదీలు వంటి ముఖ్యమైన వివరాలను ఈ యాప్‌ గుర్తిస్తుంది. బిల్లుల చెల్లింపులు, గడువు తేదీల గురించి యూజర్లను అలర్ట్ కూడా చేస్తుంది. డాక్యుమెంట్లలోని సమాచారాన్ని కీ వర్డ్స్‌లా ఉపయోగించి యాప్‌లో ఫైల్‌ లొకేషన్‌ను సెర్చ్ చేయవచ్చు. ఈ ఇంటిగ్రేటెడ్ సెర్చ్ ద్వారా సంబంధిత డాక్యుమెంట్ ఏ విభాగంలో స్టోర్ అయిందో సులభంగా గుర్తించవచ్చు.

మెరుగైన సెక్యూరిటీ ఫీచర్లు
గూగుల్ స్కానర్ యాప్‌కు మెరుగైన సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. స్టాక్ యాప్‌ను బయోమెట్రిక్ ద్వారా లేదా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా యాక్సెస్ చేసేలా లాక్ చేయవచ్చు. యాప్ ద్వారా డాక్యుమెంట్ల కాపీలను గూగుల్ డ్రైవ్‌కు ఎక్స్‌పోర్ట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. తమ సంస్థ నుంచి వచ్చిన ప్రయోగాత్మక యాప్‌గా స్టాక్‌ను గూగుల్ పరిచయం చేసింది. ఈ ఎక్స్‌పరిమెంటల్ యాప్‌ను గూగుల్ కొనసాగిస్తుందా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. ప్రస్తుతం అమెరికాలోని ఆండ్రాయిడ్ యూజర్లకు దీన్ని అందుబాటులో ఉంచారు. యాప్‌ను ఇతర దేశాల యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చే విషయంపై కూడా గూగుల్ స్పందించలేదు. ప్రస్తుతానికి అమెరికా యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్టాక్ యాప్‌ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఆ యాప్‌లకు పోటీ
ప్రస్తుతం క్యామ్ స్కానర్, అడోబ్ స్కాన్ వంటి డాక్యుమెంట్ స్కానింగ్ యాప్‌లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఒకవేళ గూగుల్ స్టాక్‌ యాప్‌ను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తే.. ఇతర పోటీ సంస్థలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న స్కానింగ్ యాప్‌లు AI సామర్థ్యాలతో పనిచేయట్లేదు. అందువల్ల విస్తృతమైన ఫీచర్లు ఉన్న స్టాక్‌ యాప్‌ ఇతర యాప్‌లపై పైచేయి సాధించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Published by:Krishna Adithya
First published:

అగ్ర కథనాలు