హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Android Q: ఆండ్రాయిడ్ క్యూ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి... సపోర్ట్ చేసే ఫోన్స్ ఇవే

Android Q: ఆండ్రాయిడ్ క్యూ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి... సపోర్ట్ చేసే ఫోన్స్ ఇవే

Android Q: ఆండ్రాయిడ్ 10 క్యూ ఓఎస్‌లో టాప్ ఫీచర్స్ ఇవే

Android Q: ఆండ్రాయిడ్ 10 క్యూ ఓఎస్‌లో టాప్ ఫీచర్స్ ఇవే

Android Q Updates | ఆండ్రాయిడ్ క్యూ బీటా వర్షన్ గూగుల్ ఫోన్లల్లో లభిస్తుంది. దాంతో పాటు 15 పార్ట్‌నర్ డివైజ్‌లల్లో కూడా ఆండ్రాయిడ్ క్యూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

    ఆండ్రాయిడ్ ఓఎస్‌లో మరో అడుగు వేసింది గూగుల్. ఆండ్రాయిడ్ క్యూ రిలీజ్ చేసింది. గూగుల్ I/O 2019 డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఆండ్రాయిడ్ 10 క్యూ రిలీజైంది. గూగుల్ ఆండ్రాయిడ్ క్యూలో ఆకట్టుకునే ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. స్మార్ట్ రిప్లై, స్మార్ట్ సజెషన్స్, లైవ్ క్యాప్షన్, డిజిటల్ వెల్‌బీయింగ్, డార్క్ థీమ్ లాంటి ప్రత్యేకతలెన్నో ఉన్నాయి. అంతేకాదు... ఆండ్రాయిడ్ క్యూ 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ క్యూ బీటా వర్షన్ గూగుల్ ఫోన్లల్లో లభిస్తుంది. దాంతో పాటు 15 పార్ట్‌నర్ డివైజ్‌లల్లో కూడా ఆండ్రాయిడ్ క్యూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ క్యూ ఫీచర్స్ గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

    ఆండ్రాయిడ్ క్యూ బీటా అప్‌డేట్ లభించే ఫోన్లు ఇవే...


    Asus ZenFone 5Z

    Essential PH-1

    Nokia 8.1

    Huawei Mate 20 Pro

    LG G8 ThinQ

    OnePlus 6T

    Oppo Reno

    Realme 3 Pro

    Sony Xperia XZ3

    Tecno Spark 3Pro

    Vivo X27

    Vivo NEX S

    Vivo NEX A

    Xiaomi Mi Mix 3 5G

    Xiaomi Mi 9


    మీ దగ్గర ఈ స్మార్ట్‌ఫోన్లు ఉంటే మీరు ఆండ్రాయిడ్ క్యూ బీటా వర్షన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పిక్సెల్ ఫోన్ యూజర్లకు అప్‌డేట్ నోటిఫికేషన్ వస్తుంది. నాన్-గూగుల్ ఫోన్స్ అయితే ఆండ్రాయిడ్ డెవలపర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ డెవలపర్ వెబ్‌సైట్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లాక స్క్రోల్ డౌన్ చేసి మీ దగ్గర ఉన్న ఫోన్ ఏదో చూడండి. 'Get the Beta' బటన్‌పైన క్లిక్ చేయండి. మీరు ఎన్‌రోల్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రస్తుతం కొన్ని ఫోన్లల్లో మాత్రమే ఆండ్రాయిడ్ క్యూ బీటా లభిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని ఫోన్లకు ఆండ్రాయిడ్ క్యూ లభించనుంది.


    Photos: గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ ఎలా ఉన్నాయో చూశారా?


    ఇవి కూడా చదవండి:


    Android Q: ఆండ్రాయిడ్ 10 క్యూ రిలీజ్ చేసిన గూగుల్... ఫీచర్స్ ఇవే


    SBI Flexi Deposit: ఈ డిపాజిట్‌ స్కీమ్‌తో మీకు లాభాలెన్నో...


    LIC Policy: ఏడాదికి రూ.100 ప్రీమియంతో ఎన్నో లాభాలు

    First published:

    Tags: Android, Android 10, Asus, Google, Huawei, LG, Nokia, Oneplus, Oppo, Realme, Smartphone, Sony, Vivo, Xiaomi

    ఉత్తమ కథలు