Google Clock: గూగుల్ క్లాక్‌ యాప్‌లో కొత్త బగ్.. మూగబోతున్న ఆండ్రాయిడ్ ఫోన్‌ అలారం.. సమస్యను ఎలా పరిష్కరించాలంటే..

ప్రతీకాత్మకచిత్రం

అలారం సమస్యపై ఫిర్యాదు చేసిన వారిలో ఎక్కువ మంది Google పిక్సెల్ డివైజ్‌ యూజర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అలారం కోసం Google క్లాక్‌ యాప్‌ను ఉపయోగించే ఇతర స్మార్ట్‌ఫోన్ యూజర్లు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు కంప్లైంట్ చేస్తున్నారు.

  • Share this:
Android యూజర్లు కొత్త సమస్యను గూగుల్‌కు రిపోర్ట్ చేస్తున్నారు. Google క్లాక్ సాయంతో సెట్ చేసే అలారం సిస్టమ్ పనిచేయట్లేదని, కొన్నిసార్లు దీని పనితీరు లోపిస్తోందని కస్టమర్లు సంస్థకు నివేదిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు Google ప్లే స్టోర్‌లో రివ్యూల ద్వారా ఈ సమస్యపై ఫిర్యాదులు చేస్తున్నారు. నెగిటివ్ రేటింగ్ ఇవ్వడంతో యాప్ మొత్తం రేటింగ్‌ సైతం తగ్గింది. తమ డివైజ్‌లలో అలారం మోగట్లేదని, సమస్యను పరిష్కరించాలని రివ్యూలలో కోరుతున్నారు.

ఇది చదవండి... Deleted Photos: గూగుల్​ డ్రైవ్​​ నుంచి డిలీట్​ చేసిన ఫైల్స్​ను తిరిగి ఎలా పొందాలి?.. ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి

 అలారం సమస్యపై ఫిర్యాదు చేసిన వారిలో ఎక్కువ మంది Google పిక్సెల్ డివైజ్‌ యూజర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అలారం కోసం Google క్లాక్‌ యాప్‌ను ఉపయోగించే ఇతర స్మార్ట్‌ఫోన్ యూజర్లు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు కంప్లైంట్ చేస్తున్నారు. Android  అథారిటీ నివేదిక ప్రకారం.. ఒప్పో, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు కూడా తమ డివైజ్‌లో అలారం మోగడం లేదని ఫిర్యాదు చేశారు. పిక్సెల్ డివైజ్‌లలో డిఫాల్ట్ క్లాక్ యాప్‌గా Google క్లాక్ ఉంటుంది కాబట్టి.. ఎక్కువ మంది పిక్సెల్ యూజర్లు తమ సమస్యను ప్రస్తావించారు.

ప్రస్తుతానికి ఈ సమస్యకు కారణం ఏంటనే అంశంపై స్పష్టమైన సమాచారం లేదు. అయితే యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ను DND మోడ్‌లో పెట్టినప్పుడు సమస్య తలెత్తుతుందని Android  అథారిటీ నివేదిక సూచిస్తుంది. Google క్లాక్ అలారం ట్యూన్ కోసం స్పోర్టిఫై వంటి థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించే వారి నుంచి కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయి.

సమస్యకు పరిష్కారం ఏంటి?
Google క్లాక్ అలారం సమస్యను Google గుర్తించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి సంస్థ కృషి చేస్తోంది. అయితే వినియోగదారులు తమ రోజువారీ షెడ్యూల్‌ల కోసం అలారాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అందువల్ల దీనికి సంబంధించిన బగ్‌ సమస్యను Google పరిష్కరించేంత వరకు థర్డ్ పార్టీ అలారం యాప్‌లను ఉపయోగించుకోవడం మంచిదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

ప్లే స్టోర్‌ నుంచి అథెంటిఫైడ్ థర్డ్ పార్టీ యాప్‌లను యూజర్లు డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించుకోవడమే ఈ సమస్యకు తక్షణ పరిష్కారం. Alarmy, AlarmMon, Sleep as Android వంటి యాప్‌లు ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ముందు రివ్యూ, రేటింగ్‌లను పరిశీలించి బెస్ట్ యాప్‌ను ఎంచుకోవడం మంచిది.
Published by:Krishna Adithya
First published: