• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • ANDROID ADDS DARK MODE FEATURE FOR GOOGLE MAPS KNOW HOW IT WORKS SS GH

Google Maps: డార్క్ మోడ్‌లో గూగుల్ మ్యాప్స్... ఎలా పనిచేస్తుందో ఓ లుక్కేయండి

Google Maps: డార్క్ మోడ్‌లో గూగుల్ మ్యాప్స్... ఎలా పనిచేస్తుందో ఓ లుక్కేయండి

Google Maps: డార్క్ మోడ్‌లో గూగుల్ మ్యాప్స్... ఎలా పనిచేస్తుందో ఓ లుక్కేయండి (ప్రతీకాత్మక చిత్రం)

Google maps Dark mode feature | గూగుల్ మ్యాప్స్‌లో కూడా డార్క్ మోడ్ ఫీచర్ వచ్చేసింది. సెట్టింగ్స్ ఎలా మార్చాలో తెలుసుకోండి.

  • Share this:
పెరుగుతున్న పోటీ కారణంగా వివిధ రకాల ఫీచర్లను తీసుకొస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి పలు టెక్ కంపెనీలు. అంతేకాకుండా ప్రతిదాంట్లోనూ వైవిధ్యాన్ని చూపిస్తూ యూజర్లను తమ వైపునకు తిప్పుకుంటున్నాయి. ఇటీవల అన్ని కంపెనీలు పాటిస్తున్న పద్ధతి డార్క్ మోడ్.. దీనివల్ల కళ్లపై భారం తక్కువగా పడి ఎక్కువ సేపు ఫోన్ చూసినా ప్రమాదం తక్కువగా ఉంటుంది. అందుకే ఫేస్ బుక్, ట్విట్టర్ తర్వాత తాజాగా గూగుల్ క్రోమ్ కూడా డార్క్ మోడ్ ని ప్రారంభించింది. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో కూడా డార్క్ మోడ్ ను తీసుకొచ్చింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసిందీ టెక్ దిగ్గజం. దీని గురించి వెల్లడిస్తూ "మనకు ఏం కావాలి? డార్క్ థీమ్! ఎక్కడ కావాలి? గూగుల్ మ్యాప్స్ లో!" అంటూ వైవిధ్యంగా ట్వీట్ చేసింది.

Vi New Plans: ఈ వొడాఫోన్ ఐడియా-Vi ప్రీపెయిడ్ ప్లాన్స్‌కు డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ

Samsung Galaxy A32: సాంసంగ్ గెలాక్సీ ఏ32 స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో ఆఫర్స్

గత ఏడాది సెప్టెంబరు నుంచి గూగుల్ మ్యాప్స్ లో డార్క్ మోడ్ కోసం ఆ సంస్థ బృందం పనిచేస్తోంది. పలు రకాలుగా పరీక్షించి తాజాగా ఆండ్రాయిడ్ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఈ నైట్ మోడ్ ద్వారా కంటి సమస్యల నుంచి రక్షణ కల్పించడమే కాకుండా మీ ఫోన్ బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు. ఈ డార్క్ మోడ్ ను ఎనేబుల్ చేసుకునేందుకు గూగుల్ మ్యాప్స్ లోని రైట్ కార్నర్ లో ఉండే ఐకాన్ పై క్లిక్ చేయాలి. అనంతరం కాన్ఫిగరేషన్ ఆపరేషన్స్ కు చెందిన థీమ్ సెట్టింగ్ జాబితాలోకి వెళ్లి డార్క్ మోడ్ ను యాక్టి వేట్ చేసుకోవాలి. అయితే ఈ ఆప్షన్ రావాలంటే వినియోగదారులు లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ వర్షన్ 10.61.2 నుంచి ఈ ఫీచర్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఇష్టం లేని వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు సాధారణ థీమ్ లో కి మార్చుకునే వెసులుబాటు ఉంది. ఈ డార్క్ మోడ్ ద్వారా సులభంగా యాక్సెస్ చేసుకోవడమే కాకుండా నేవిగేషన్ కూడా బాగా కనిపిస్తుంది.

Exchange Offer: మీ పాత ఫోన్ ఇచ్చి రూ.549 చెల్లించి ఈ ఫోన్ తీసుకోవచ్చు

WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... మీ ఛాట్స్‌కి పాస్‌వర్డ్ పెట్టుకోవచ్చు

మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్న వారిలో ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో కంటి సంబంధిత సమస్యలు ప్రధానమైనవి. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ కారణంగా కళ్లకు హాని కలిగే ప్రమాదముంది. ఇందుకోసమే చాలా టెక్ కంపెనీలు డార్క్ మోడ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే చాలా యాప్స్ ఈ నూతన ఫీచర్ ను వినియోగదారుల ముందుంచాయి. తాజాగా గూగుల్ మ్యాప్స్ కూడా ఈ జాబితాలోకి చేరింది. డార్క్ మోడ్ ను ఎనేబుల్ చేసుకోవడం వల్ల యూజర్ కళ్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడంతో పాటు చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటుందని గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు. మరి ఈ కొత్త ఫీచర్ ను మీరు కూడా ఓ సారి ప్రయత్నించండి.
Published by:Santhosh Kumar S
First published: