తక్కువ ధరతో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో గూగుల్ పని చేస్తోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ అప్డేట్స్ అనౌన్స్ చేసింది. 2017లో గూగుల్ ఆండ్రాయిడ్ గో పేరిట ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ లైట్ వెర్షన్‌ను పరిచయం చేసింది. 2GB RAM కంటే తక్కువ ఉన్న బడ్జెట్ డివైజ్‌ల కోసం దీన్ని రూపొందించింది. Android Go మొదటి వెర్షన్ Android Oreoలో అందుబాటులో ఉంది. ఇటీవల గూగుల్ చేసిన ఓ బ్లాగ్ పోస్ట్‌లో.. గూగుల్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్‌ను అనౌన్స్ చేసింది. ఈ లేటెస్ట్ ఎడిషన్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం.
సులువుగా సాఫ్ట్వేర్ అప్డేట్స్
గూగుల్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ కోసం అందుబాటులో ఉన్న Go ఎడిషన్, Google Play సిస్టమ్ అప్డేట్లు అనే కొత్త ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ గో వినియోగించే డివైజ్‌లకు స్టోరేజ్ ఇబ్బంది లేకుండా ముఖ్యమైన సాఫ్ట్వేర్ అప్డేట్లను సులభంగా పొందేలా చేస్తుంది. Android One కంటే మరింత మెరుగైన పనితీరుతో గో ఎడిషన్‌ను అందిస్తోంది. దీన్ని లాంచ్ చేసిన ఐదేళ్లకు గూగుల్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్‌ను తీసుకువస్తోంది. తక్కువ RAM సైజ్‌తో వచ్చే డివైజ్‌లకు ఈ ఓఎస్ మెరుగైన పనితీరు అందించనుంది.
బడ్జెట్ ఫోన్లకు ఉపయోగం
ఆండ్రాయిడ్‌ను వినియోగించడానికి అన్ని ఫోన్లకు కనీసం 2GB RAM, 32GB స్టోరేజ్ అవసరమని గూగుల్ ఈ సంవత్సరం ప్రారంభంలో పేర్కొంది. కొత్త Go ఎడిషన్ కోసం ఇలాంటి ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కాబట్టి చాలా ఫోన్లు ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్‌తో రన్ అవుతాయి. ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్-బేస్డ్ ఫోన్లు రూ.10,000లోపు భారతదేశంలో లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని గూగుల్ చెబుతోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌లో 250 మిలియన్ల యాక్టివ్ డివైజ్‌లు రన్ అవుతున్నాయని తెలిపింది. అయితే ఏ డివైజ్‌లకు దీన్ని రిలీజ్ చేశారనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఫీచర్లు
గో ఎడిషన్ సాధారణ ఆండ్రాయిడ్ 13 వెర్షన్ ఇంటర్ఫేస్ డిజైన్‌తోనే వస్తుంది. ఈ ఇంటర్ఫేస్ ద్వారా ఫోన్లో నడుస్తున్న కలర్‌ఫుల్ థీమ్స్‌ను సింక్రనైజ్ చేయవచ్చు. దానిని మాన్యువల్‌గా ఎంచుకోవచ్చు. దీనితో పాటు Android 13 Go ఎడిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ అనుమతులు, యాప్ లాంగ్వేజ్ సెట్టింగ్‌లను కూడా అందిస్తోంది. ప్రతి యాప్‌కు ప్రత్యేక భాషను ఎంచుకోవచ్చు. సాధారణ సాఫ్ట్వేర్ అప్డేట్లు కాకుండా ఇతర యాప్‌లను అప్డేట్ చేయడానికి అనుమతించే ప్లే సిస్టమ్ అప్డేట్లను గూగుల్ అందించబోతోంది. ఇప్పటి వరకు సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ఉంచిన మెటీరియల్ యు డిజైన్ ఇంటర్ఫేస్తో పాటు, గో ఎడిషన్ మొదటిసారిగా Google Discover ఫీడ్‌ను కూడా పొందుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Smartphone