Home /News /technology /

ANDROID 13 COULD FINALLY BRING THIS FEATURE FOR SMARTPHONE USERS GH VB

Android 13: యాపిల్ ఐఫోన్ లో మాత్రమే ఉండే ఆ ఫీచర్ .. ఇక నుంచి ఆండ్రాయిడ్ 13 లో కూడా.. ఆ వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మార్కెట్​లోకి ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్‌ల తయారీలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. వినియోగదారుల సౌకర్యార్థం విభిన్న రకాల ఫీచర్లు, సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.

మార్కెట్​లోకి ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్(Software) వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్‌ల(Mobile Phones) తయారీలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. వినియోగదారుల సౌకర్యార్థం విభిన్న రకాల ఫీచర్లు(Features), సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు పలు రకాల ఆండ్రాయిడ్ వెర్షన్‌లు(Android Versions) లాంచ్ అయ్యాయి. త్వరలోనే ఆండ్రాయిడ్ 13(Android 13) వెర్షన్ కూడా అందుబాటులోకి రానుంది. ఈ సాఫ్ట్ ‌వేర్ ప్రివ్యూ(Software Preview) వెర్షన్​ఇప్పటికే అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివరిలో ఈ లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చే అవకాశం ఉంది.కొన్ని వారాల క్రితమే ఈ వెర్షన్‌లో కొన్ని ప్రత్యేక ఫీచర్లు(Feature) వస్తాయనే సమాచారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను కూడా ఇందులో పొందుపరిచారని తెలుస్తోంది.

Post Office Deposits: పోస్టాఫీస్ లో అధిక వడ్డీ అందించే పథకాలు ఇవే.. వాటిపై ఓ లుక్కేయండి..


ఆండ్రాయిడ్ 13లో మల్టిపుల్ API(Multiple API) ఫీచర్‌ రానుంది. అంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ఫ్లాష్ లైట్ బ్రైట్నెస్ లెవల్ నియంత్రించే ఫీచర్‌ను ఈ అప్డేట్ సాఫ్ట్ వేర్ వెర్షన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. ఇన్న సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ ఫీచర్ ఉండేది కాదు. కొన్ని సంవత్సరాల క్రితమే శాంసంగ్ సంస్థ ఈ ఫీచర్ ప్రయత్నించింది. ఈ అఫ్డేడెటెడ్ సాఫ్ట్‌వేర్‌లో వెనిల్లా అండ్లాయిడ్ వెర్షన్ కంటేఎక్కువ ఫీచర్లు ఉంటాయి.

యాపిల్​లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫీచర్​..

ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ ఫోన్‌లో వినియోగదారులు(శాంసంగ్ మినహా) ఒక APIని మాత్రమే కలిగి ఉన్నారు. ఈ ఫీచర్ ఫ్లాట్ లైట్ ఆన్ లేదా ఆఫ్ చేయడానికి ఉపయోగపడుతుంది. త్వరలో రానున్న ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌లో మల్టిపుల్ APIని పొందుపరిచారని సమాచారం. దీని ద్వారా ఫ్లాష్ లైట్ బ్రయిట్​నెస్​ను నియంత్రించువచ్చు. అంటే ప్రకాశవంతంగా వెలిగే స్థాయిని మార్చుకోవచ్చు. అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. ఇంత చిన్న ఫీచర్‌ను గూగుల్ ఇప్పటి వరకు తీసుకురాకపోవడం ఆశ్చర్యకరంగాఉన్నప్పటికీ యాపిల్ సంస్థ ఇప్పటికే ఇలాంటి ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Reliance: ప్రపంచ ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మారనున్న భారత్​.. రిలయన్స్‌, సన్‌మినా కంపెనీల మధ్య భారీ ఒప్పందం..!


ఫ్లాష్‌లైట్‌ను వేరే స్థాయిలో సెట్ చేసే సామర్థ్యాన్ని అందించే కొన్ని ఫీచర్‌ ఫోన్‌లు మీకు బహుశా గుర్తుండే ఉంటాయి. యాపిల్‌లో ఇప్పటికే ఈ ఫీచర్ ఉంది. కానీ ఆండ్రాయిడ్‌లో మాత్రం ఇంతకాలం మిస్ అయింది. అయితే ఆండ్రాయిడ్ 13లో ఈ మల్టిపుల్ APIలను జోడించినంత మాత్రాన అన్ని బ్రాండ్‌లలోనూ తమ కోడ్‌బేస్‌కు ఈ సదుపాయాన్ని జోడిస్తాయని చెప్పలేం. గూగుల్ పిక్సెల్7 ఫోన్‌లో మరి ఈ ఫీచర్‌ ఉంటుందని ఆశిస్తున్నారు. మరి ఉంటుందో లేదో వేచి చూడాలి.
Published by:Veera Babu
First published:

Tags: Android 13, Apple, Iphone, New features

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు