Home /News /technology /

ANDROID 13 BETA 3 3 FOR PIXEL SMARTPHONES RELEASED WITH MAJOR BUG UMG GH

Android 13: ఆండ్రాయిడ్ 13 బీటా 3.3 అప్‌డేట్ విడుదల.. బగ్స్‌ ఫిక్స్ చేసిన గూగుల్.. పిక్సెల్ డివైజ్‌లకు రిలీజ్

ఆండ్రాయిడ్ 13 బీటా 3.3

ఆండ్రాయిడ్ 13 బీటా 3.3

ఆండ్రాయిడ్‌ 13 బీటా వెర్షన్‌కు సంబంధించిన మూడో బీటా అప్‌డేట్‌ను గూగుల్ ఈ నెల ప్రారంభంలో లాంచ్ చేసింది. దీంట్లో కొన్ని బగ్స్ బయట పడటంతో, తాజాగా ఈ వెర్షన్‌కు బీటా 3.3 కొత్త అప్‌డేట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మనం వాడే స్మార్ట్‌ఫోన్లు (Smart Phone) చాలావరకు ఆండ్రాయిడ్ (Android) ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే రన్ అవుతాయి. గూగుల్‌ అభివృద్ధి చేసే ఈ ఓఎస్‌ నుంచి కొత్త వెర్షన్‌ను యూజర్లు కోరుకుంటారు. ప్రస్తుతం గూగుల్ ఆండ్రాయిడ్ 13 బీటా (Beta) వెర్షన్‌ను టెస్ట్ చేస్తోంది. ఈ క్రమంలో కొత్త వెర్షన్‌కు సంబంధించిన మూడో బీటా అప్‌డేట్‌ను గూగుల్ ఈ నెల ప్రారంభంలో లాంచ్ చేసింది. దీంట్లో కొన్ని బగ్స్ బయట పడటంతో, తాజాగా ఈ వెర్షన్‌కు బీటా 3.3 కొత్త అప్‌డేట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పిక్సెల్ ఫోన్ యూజర్లు ఈ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను బీటా వెర్షన్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు. అయితే ఆండ్రాయిడ్ బీటా 4 అప్‌డేట్స్ కోసం యూజర్లు ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు.

తాజా అప్‌డేట్‌తో ఆండ్రాయిడ్‌ 13 బీటాలో అనేక బగ్స్‌ను గూగుల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు బీటా అప్‌డేట్‌ తర్వాత UIలో గుర్తించిన కొన్ని బగ్స్‌ను ఫిక్స్ చేయడానికి కొత్త అప్‌డేట్‌ను రిలీజ్ చేసినట్లు గూగుల్ పేర్కొంది. ఆండ్రాయిడ్ 13ని స్థిరంగా ఉంచడానికి బీటా 3.3 అప్‌డేట్‌ కీలక అడుగు అని నిపుణులు చెబుతున్నారు. తాజా బీటా 3.3 అప్‌డేట్‌లో ఎలాంటి సమస్యలను పరిష్కరించారో తెలుసుకుందాం.

* యూజర్లు యాప్ డ్రాయర్‌ను మూసివేసి, హోమ్ స్క్రీన్‌లో యాప్ ఫోల్డర్‌ను ఓపెన్ చేసినప్పుడు.. యాప్ డ్రాయర్‌కు ‘ఆల్వేస్ ఆన్ కీబోర్డ్‌ ఆప్షన్‌’ను చూపించే పిక్సెల్ లాంచర్ ప్రాబ్లమ్‌ను తాజాగా ఫిక్స్ చేశారు.

* కొన్ని సందర్భాల్లో సిస్టమ్ UI క్రాష్ అయినప్పుడు, వెనక్కి వెళ్లమని జస్టర్‌ చూపించడం వంటి సమస్యలను పరిష్కరించారు.

* నెట్‌వర్క్ అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో డివైజ్‌లు WiFi నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయలేని ప్రాబ్లమ్‌ను తాజాగా పరిష్కరించారు. ఇప్పుడు సిగ్నల్ స్ట్రెన్త్ బాగానే ఉంది.

* BluetoothManagerService TbsServiceని ప్రయత్నించినప్పుడు కనిపించే ప్రాబ్లమ్స్‌ను ఫిక్స్ చేశారు. ఇది యాప్‌ల పనితీరు తగ్గడానికి కారణమైంది.

* కొన్ని సందర్భాల్లో డివైజ్‌ను ఛార్జ్ చేయడానికి ప్లగ్ ఇన్ చేసిన తర్వాత (ఉదాహరణకు, రాత్రిపూట), డివైజ్ రీబూట్ అయ్యే వరకు స్పందించని బగ్‌కు చెక్ పెట్టారు.

* కొన్ని డివైజ్‌లలో కెర్నల్ భయాందోళనకు కారణమైన సమస్యను పరిష్కరించారు.

* కనెక్టివిటీ థర్మల్ పవర్ మేనేజర్‌ ప్రాబ్లమ్‌ను సరిచేశారు. ఇది UI స్లో అవ్వడం, యాప్స్ స్పందించకపోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో బ్యాటరీ డ్రెయిన్ అవ్వడానికి కారణమైంది.

* మీ పిక్సెల్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 బీటా ప్రోగ్రామ్‌ను ఎన్‌రోజ్ చేస్తే.. మీరు Android 13 బీటా 3.3 OTA అప్‌డేట్‌ అందుకోవాలి.

* పిక్సెల్ యూజర్లకు మాత్రమే..
కొత్త వెర్షన్‌ గూగుల్ పిక్సెల్ డివైజ్‌లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. పిక్సెల్ డివైజ్ యూజర్లు ఆండ్రాయిడ్ 13 బీటా ప్రోగ్రామ్‌లో ఈజీగా ఎన్‌రోల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ బీటా నుంచి మీ పిక్సెల్‌లో తాజా ఆండ్రాయిడ్ 13 బీటా వెర్షన్‌ను మాన్యువల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఫోన్‌కు తాజా వెర్షన్ సపోర్ట్ చేస్తుందో లేదో చూడాలి. పిక్సెల్ 4 నుంచి పిక్సెల్ 6 ప్రో మోడళ్ల యూజర్లు ఈ బీటా ప్రోగ్రామ్‌లో చేరవచ్చు. మీ డివైజ్‌కు ఎలిజిబిలిటీ ఉంటే.. ‘+ Opt-in’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 24 గంటల్లో ఫోన్ సెట్టింగ్స్‌లోని సిస్టమ్ అప్‌డేట్‌కి వెళ్లి తాజా అప్‌డేట్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Android, Android 13, Google, Smart phones

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు