Android 12 beta version: ఆండ్రాయిడ్ 12 లేటెస్ట్​ బీటా వెర్షన్ రిలీజ్​.. మీ స్మార్ట్​ఫోన్​లో ఇలా ఇన్​స్టాల్​ చేసుకోండి

Android Phone

మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే, మీ ఓఎస్ ఇంకాఅప్​డేట్​చేసుకోలేదా? వెంటనే చేసుకోండి. ఎందుకంటే,టెక్ దిగ్గజం గూగుల్​ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 12 బీటా వెర్షన్​ను విడుదల చేసింది. సులభంగా కొన్ని క్లిక్ తోనే మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఈ వెర్షన్ ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

  • Share this:
మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే, మీ ఓఎస్ ఇంకాఅప్​డేట్​చేసుకోలేదా? వెంటనే చేసుకోండి. ఎందుకంటే,టెక్ దిగ్గజం గూగుల్​ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 12 బీటా వెర్షన్​ను విడుదల చేసింది. సులభంగా కొన్ని క్లిక్ తోనే మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఈ వెర్షన్ ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఫలితంగా అనేక కొత్త ఫీచర్లను ఆస్వాదించవచ్చు.ప్రతి ఏటా గూగుల్ సంస్థ ఆండ్రాయిడ్ ఓఎస్ ను అప్డేట్ చేస్తుంది. అందులో భాగంగానే ఈసారి అనేక కొత్త ఫీచర్లతో ఆండ్రాయిడ్​ 12 బీటా వెర్షన్​ను విడుదల చేసింది. ఈ బీటా వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకునేందుకు ఆండ్రాయిడ్ 12 బీటా వెబ్ సైట్ ను సందర్శించాలి. అనంతరం మీ డివైజ్​తో లింక్​ అయినఈమెయిల్​ ఐడీతో లాగిన్ అవ్వాలి. మీ ఫోన్ ఆండ్రాయిడ్​ 12కు లిస్ట్ అయి ఉందో లేదో తెలుసుకోవడానికి "వ్యూ యువర్ ఎలిజిబుల్ డివైజ్" అనే ఆప్షన్ కు వెళ్లాలి. ఒకవేళ లిస్ట్​ అయి ఉండకపోతే మీ డివైజ్​ను నమోదు చేసుకోవాలి. అనంతరం అప్​డేట్​నోటిఫికేషన్ మీ స్మార్ట్ ఫోన్ కు వస్తుంది. దానిపై క్లిక్ చేసి "డౌన్ లోడ్ అండ్ ఇన్ స్టాల్" ఆప్షన్ ఎంచుకోవాలి.

ప్రత్యేకతలు..
ఈ సరికొత్త ఆండ్రాయిడ్ 12 సరికొత్త డిజైన్ లాంగ్వేజీతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ప్రైవసీ ఫీచర్లను గూగుల్ డివైజ్ ఎకో సిస్టంకు తీసుకువచ్చింది. కోర్ సిస్టం ద్వారా సర్వీస్ కోసం అవసరమైన సీపీయూ సమయాన్ని గూగుల్ 22 శాతం వరకు తగ్గించింది. ఈ అప్​డేటెడ్​ఓఎస్ ఇన్ స్టాల్ చేసుకోవడం వల్ల మీ స్మార్ట్ ఫోన్ మునుపటి కంటే మరింత వేగంగా పనిచేస్తుంది. బ్యాటరీ కూడా ఇంతకుముందు కంటే మెరుగైన పనితీరు కనబరుస్తుంది. యూజర్ ఎంపికను బట్టి ఫోన్ డిజైన్​నుమార్చుకోవచ్చు.గూగుల్ ఈ సరికొత్త డిజైన్ లాంగ్వేజ్​కు మెటిరీయల్ యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా గూగుల్ కు చెందని ఏదైనా కొత్త యాప్ నూతన డిజైన్ లో సింక్ చేయవచ్చు. నూతన లాక్ స్క్రీన్, విడ్జెట్లతో పాటు కొత్త రంగులు కూడా వస్తున్నాయి.

ఆండ్రాయిడ్ 12 బీటా వెర్షన్ సపోర్ట్​ చేసేఫోన్లు..
శాంసంగ్ జెడ్ ఫ్లిప్3, శాంసంగ్ జెడ్ ఫోల్డ్ 3, గూగుల్ పిక్సెల్ 6, గూగుల్ పిక్సెల్ 6 ప్రో, గూగుల్ పిక్సెల్ 3, గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్, గూగుల్ పిక్సెల్ 4, గూగుల్ పిక్సెల్ 4 ఎక్స్ఎల్, గూగుల్ పిక్సెల్ 3ఏ, గూగుల్ పిక్సెల్ 4ఏ, గూగుల్ పిక్సెల్ 4ఏ 5జీ, గూగుల్ పిక్సెల్ 5ఏ, ఓప్పో ఫైండ్ ఎక్స్3, నోకియా ఎక్స్20, వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 9 ప్రో, షియోమీ ఎంఐ 11, షియోమీ ఎంఐ 11 అల్ట్రా, షియోమీ ఎంఐ 11ఐ, షియోమీ ఎంఐ 11ఎక్స్ ప్రో, ZTE యాక్సాన్ 30 అల్ట్రా, టీసీఎల్ 20 ప్రో 5జీ, యాసస్ జెన్ ఫోన్8, రియల్ మీ జీటీ, ఐక్యూఓఓ 7 లెజెండ్, షార్ప్ అక్వాస్ సెన్స్ 5జీ, టెక్నో కేమన్ 17 లాంటి స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ 12 బీటా వెర్షన్ కు ఎలిజిబుల్ అవుతాయి.
Published by:Krishna Adithya
First published: