హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Work From Home: ఇక వర్క్ ఫ్రం హోం మరింత సురక్షితం... ఎందుకంటే

Work From Home: ఇక వర్క్ ఫ్రం హోం మరింత సురక్షితం... ఎందుకంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Work From Home | మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇక వర్క్ ఫ్రం హోం మరింత సురక్షితం కానుంది. ఎందుకో తెలుసుకోండి.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 విజృంభనతో బయటికెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదివరకు కేవలం ఐటీ ఉద్యోగస్తులకు మాత్రమే పరిచయం ఉండే వర్క్ ఫ్రం హోం ప్రస్తుతం అన్ని కంప్యూటర్ ఆధారిత పరిశ్రమలకు సాధారణంగా మరింది. అందువల్ల వర్క్ ఫ్రం ఉద్యోగుల నుండి సురక్షితమైన VPN కోసం డిమాండ్ పెరిగింది. వీపీఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఇది మీ వ్యక్తిగత డేటా హ్యాకర్లకు చిక్కకుండా భద్రంగా ఉంచడానికి వాడే అప్లికేషన్. వర్క్ ఫ్రం హోతో వైర్గార్డ్ నెక్ట్స్ జెనరేషన్ వీపీఎన్ ప్రోటోకాల్ వినియోగించే వారి సంఖ్య కూడా పెరిగింది. వైర్‌గార్డ్ ఒక కొత్త VPN ప్రోటోకాల్ మరియు ఇది ఇతర ప్రోటోకాల్‌ల కంటే వేగంగా పనిచేస్తుంది. ఉద్యోగులు తమ సంస్థకు చెందిన సర్వర్‌లకు కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించే సమయంలో వారి డేటా చోరీ అయ్యే అవకాశం ఉంటుంది.

Smartphone: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి షాక్... ఇక బాక్సులో ఛార్జర్లు ఉండవు

Flipkart Big Diwali sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 7 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

అందువల్ల ఈ సమయంలో వారికి డేటా ప్రైవసీ, డేటా సెక్యూరిటీ మరియు స్పీడ్ అందించడానికి అత్యాధునిక క్రిప్టోగ్రఫీ స్టాండర్డ్స్ ఉపయోగపడుతాయి. అయితే, ప్రస్తుతం ఆండ్రాయిడ్ 12తో పనిచేసే డివైజ్లు బిల్ట్ ఇన్ వీపీఎన్తో వస్తున్నాయి. ఈ బిల్ట్ ఇన్ వీపీఎన్ ఫీచర్ ఇప్పటికే ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉంది. అయితే, తాజాగా ఈ వైర్‌గార్డ్‌ వీపీఎన్ను లైనక్స్ కెర్నల్‌కు చేర్చడమే కాకుండా లైనక్స్ 5.6లో కూడా అందుబాటులో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ కూడా లైనక్స్‌పై ఆధారపడి ఉన్నందున, ఆండ్రాయిడ్ 12తో పనిచేసే డివైజ్లు లైనక్స్ కెర్నల్ 5.4 ట్రీ మరియు కెర్నల్ 4.19 ట్రీ వంటి అనేక కొత్త కమిట్లను యాడ్ చేశాయి. ఈ కెర్నల్స్‌ను ఆండ్రాయిడ్ కామన్ కెర్నల్స్ అని కూడా పిలుస్తారు.

Samsung Single EMI Scheme: సాంసంగ్ నుంచి అద్భుతమైన ఆఫర్... ఎన్ని వస్తువులు కొన్నా ఒకే ఈఎంఐ

JioPhone: జియోఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.50,000 గెలుచుకోండి ఇలా

గూగుల్ ఇటీవల ఆండ్రాయిడ్ 12- కర్నెల్ 5.4 ట్రీ మరియు ఆండ్రాయిడ్ కామన్ కెర్నల్ 4.19 ట్రీకు అనేక కొత్త కమిట్‌లను యాడ్ చేసింది. వీటితో పాటు వైర్‌గార్డ్ VPN ప్రోటోకాల్ను కూడా నూతన కెర్నల్లో జోడించింది. గూగుల్ నుంచి విడుదలయ్యే ప్రతి కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ అనేక లైనక్స్ కెర్నల్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఉదాహరణకు, ఆండ్రాయిడ్ 11 లైనక్స్ కెర్నల్స్ 4.14 మరియు 4.19 ట్రీలను ఉపయోగిస్తుండగా, ఆండ్రాయిడ్ 12 లైనక్స్ కెర్నల్స్ 4.19 మరియు 5.4లను ఉపయోగించుకుంటాయి.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ డివైజెస్ లైనక్స్ కెర్నల్ 4.19తో నడుస్తుండగా, ఆండ్రాయిడ్ 12 ఫ్లాగ్‌షిప్‌ డివైజ్లు మాత్రం లైనక్స్ కెర్నల్ 5.4 పైన పని చేస్తున్నాయి. కాగా, తక్కువ ధరలో లభించే మోడల్స్ లైనక్స్ కెర్నల్ 4.19పై పనిచేస్తాయి. ఈ రెండు కర్నెల్స్ డిఫాల్ట్‌గా వైర్‌గార్డ్ సపోర్ట్ను కలిగి ఉంటాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Google, Work From Home

ఉత్తమ కథలు