Android 12: ఆన్‌లైన్‌లో లీకైన ఆండ్రాయిడ్ 12 ఫీచర్లు... కొత్తగా ఏం చేర్చారంటే?

Android 12: ఆన్‌లైన్‌లో లీకైన ఆండ్రాయిడ్ 12 ఫీచర్లు... కొత్తగా ఏం చేర్చారంటే? (Image Credit: XDA Developers)

Android 12 | ఆండ్రాయిడ్ 12 స్క్రీన్‌షాట్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఫీచర్స్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

  • Share this:
ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ ఇప్పటికీ ఇంకా చాలా స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులోకి రాలేదు. కానీ, అప్పుడే ఆండ్రాయిడ్ 12కు సంబంధించిన కొన్ని ఫీచర్లు ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ప్రధాన స్మార్ట్‌ఫోన్లలో ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్ రానున్నట్లు తెలుస్తోంది. ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్లో ఆండ్రాయిడ్ గణనీయమైన వాటాను కలిగి ఉన్న విషయం తెలిసిందే. దీన్ని స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, మరిన్ని గాడ్జెట్‌లలో ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం, ఆండ్రాయిడ్ 11 నోటిఫికేషన్‌లు, చాట్ బబుల్స్, అనుమతులతో పాటు మరిన్ని అద్భుతమైన మార్పులతో వినియోగదారులందరినీ ఆకర్షిస్తోంది. అయితే, ఆండ్రాయిడ్ 12 మరిన్ని అప్డేట్స్‌తో రానున్నట్లు ఆన్‌లైన్‌లో లీకైన స్క్రీన్‌షాట్లను బట్టి తెలుస్తోంది. ఈ స్క్రీన్ షాట్లను పరిశీలిస్తే తదుపరి అప్‌గ్రేడ్ ఎలా ఉంటుందనే దానిపై కొంత స్పష్టత వస్తుంది. లీకైన సమాచారం ప్రకారం ఆండ్రాయిడ్ 12లో ఉండే ఫీచర్లపై ఓలుక్కేయండి.

Password: అలర్ట్... ఈ 20 పాస్‌వర్డ్స్ ఉపయోగిస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ

mAadhaar యాప్ వాడుతున్నవారికి అలర్ట్... డిలిట్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి... ఎందుకంటే

ఆండ్రాయిడ్ 12 ఫీచర్లు...


గూగుల్ తన తరువాతి అప్‌డేట్ ఆండ్రాయిడ్ 12లో చాలా ప్రధాన మార్పులను చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్‌షాట్లు కూడా లీక్ అయ్యాయి. దీని డిజైన్‌లో అనేక మార్పులు చేసింది. అదేవిధంగా కొన్ని కొత్త ఫీచర్లను కూడా చేర్చింది. ఈ ఫీచర్లు కొన్ని iOS ని పోలి ఉన్నాయని నిశితంగా పరిశీలిస్తే తెలుస్తుంది. అంతేకాక, ఆండ్రాయిడ్ 12లో UI డిజైన్‌ను, పెద్ద నోటిఫికేషన్ టోగుల్ బటన్‌తో ఉన్న స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. ఆండ్రాయిడ్ 11లో ఆరు క్విక్ టోగుల్ బటన్స్ ఉండగా, ఆండ్రాయిడ్ 12లో మాత్రం నాలుగు టోగుల్ బటన్స్ మాత్రమే ఉన్నట్లు చూపించారు. అలాగే iOSలో కనిపించే సెక్యూరిటీ టోగుల్ను కూడా ఇందులో చేర్చినట్లు తెలుస్తోంది. అంటే, ఆండ్రాయిడ్ 12లో పటిష్టమైన సెక్యూరిటిని అందించడానికి ఈ అప్‌డేట్‌ను చేర్చారు.

Paytm: పేటీఎంలో కొత్త ఫీచర్... క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లిస్తే రూ.1,000 క్యాష్ బ్యాక్

Smartphone: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే...

అంతేకాదు, ఆండ్రాయిడ్ 12లో కాన్వర్జేషన్ విడ్జెట్స్‌ను కూడా పొందుపర్చినట్లు లీకైన స్క్రీన్‌షాట్లను ద్వారా తెలుస్తోంది. దీనితో పాటు ఇందులో రీసెంట్ మెసేజెస్, కాల్స్, యాక్టివిటీ స్టేటస్ వంటి కొత్త విడ్జెట్‌లను కూడా పొందుతారు. సమీప పరికరాలతో వై-ఫై పాస్‌వర్డ్‌లను పంచుకోవడం, మెరుగైన థీమింగ్, సిస్టమ్ అప్డేట్ల నుండి డికపుల్ చేసిన ఎమోజి అప్డేట్స్, యాప్ హైబర్నేషన్తో పాటు మరిన్ని ఫీచర్లను కూడా ఇందులో జోడించవచ్చని ఆశిస్తున్నారు. అలాగే, రాబోయే కొద్ది వారాల్లోనే ఆండ్రాయిడ్ 12 డెవలపర్ ప్రివ్యూని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
Published by:Santhosh Kumar S
First published: