Android 12: ఆండ్రాయిడ్ 12 బీటా 5 అప్‌డేట్ వచ్చేసింది... ఫీచర్స్ ఏం ఉన్నాయంటే

Android 12: ఆండ్రాయిడ్ 12 బీటా 5 అప్‌డేట్ వచ్చేసింది... ఫీచర్స్ ఏం ఉన్నాయంటే

Android 12 Beta 5 | ఆండ్రాయిడ్ 12 బీటా 5 అప్‌డేట్ రిలీజ్ అయింది. సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. బీటా టెస్టింగ్ (Android 12 Beta 5) సక్సెస్ అయిన తర్వాత యూజర్లందరికీ ఈ ఫీచర్స్ అందుబాటులోకి వస్తాయి.

  • Share this:
ఆండ్రాయిడ్ 12 ఫైనల్ బీటా అప్‌డేట్‌ను (Android 12 Beta) విడుదల చేసింది గూగుల్. ఈ తాజా OS ఒరిజినల్ వెర్షన్‌ను మరికొన్ని వారాల్లో యూజర్లకు అధికారికంగా విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఆండ్రాయిడ్ 12 బీటా 5 (Android 12 Beta) అప్‌డేట్‌లో.. ఫిక్సెస్, ఆప్టిమైజేషన్‌లలో పెద్దగా మార్పులు చేయలేదు. కొత్త ప్యాక్‌లను కూడా తీసుకురాలేదు. దీంతో ఇది త్వరలోనే అధికారికంగా రిలీజ్ అవ్వనుందని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అధికారికంగా రిలీజ్ అయితే ఇతర యూజర్లు కూడా ఈ కొత్త ఫీచర్స్ వాడుకోవచ్చు. అయితే మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ చేయాలి.

ఆండ్రాయిడ్ 12 బీటా 5 ఫీచర్స్


కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో గూగుల్ క్లాక్ యాప్ కొత్త 7.0 వెర్షన్ ఉంది. ‘మెటీరియల్ యూ’ రీడిజైన్‌లో దీన్ని రూపొందించారు. తాజా అప్‌డేట్‌లో గూగుల్ అనలాగ్, డిజిటల్, వరల్డ్ క్లాక్‌లను పునరుద్ధరించినట్లు XDA డెవలపర్స్ తెలిపింది. ఇవి ఇప్పుడు వేరే సిస్టమ్ కలర్ పాలెట్‌తో వస్తున్నాయని నివేదించింది. దీంతోపాటు క్యాలిక్యులేటర్ యాప్ సైతం మెటీరియల్ యూ రీడిజైన్‌లో వస్తుందట. అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత వినియోగదారులు వివిధ బటన్లతో పాస్టెల్ రంగుల్లో క్యాలిక్యులేటర్‌ యాప్‌ను పొందవచ్చు.

Realme X7 Max 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.6,000 తగ్గింపు... తొలిసారి భారీ డిస్కౌంట్

ఆండ్రాయిడ్ 12 బీటా 5 అప్‌డేట్‌లో లాక్ స్క్రీన్ డివైజ్ కంట్రోల్స్‌ను కూడా అప్‌డేట్ చేశారు. ఫోన్ స్క్రీన్‌ను అన్‌లాక్‌ చేసి ఒక బటన్ ద్వారా స్మార్ట్ హోమ్ డివైజ్‌లను నియంత్రించే కంట్రోలింగ్ ఆప్షన్లు ఈ అప్‌డేట్‌లో ఉన్నాయి. గూగుల్ ఇప్పటికే డివైజ్ కంట్రోల్స్‌ను ఆండ్రాయిడ్ 11 పవర్ మెనూ నుంచి క్విక్ సెట్టింగ్స్ షేడ్‌కి మార్చింది. తాజా అప్‌డేట్‌లో వాటిని మరింత సౌకర్యవంతమైన ప్రదేశానికి మార్చినట్లు తెలుస్తోంది. ఫైనల్ అప్‌డేట్‌లో పిక్సెల్ లాంచర్‌లో అత్యంత వేగవంతమైన యూనివర్సల్ సెర్చ్ బార్‌ను కూడా గూగుల్ అందించనుందని XDA సంస్థ తెలిపింది. ఇందులో యాప్‌లతో పాటు కాంటాక్ట్స్, సెట్టింగ్స్, షార్ట్‌కట్స్ వంటివి ఉంటాయని వెల్లడించింది.

Yono SBI App: ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవల్ని యోనో లైట్ యాప్‌లో పొందండి ఇలా

తాజా బీటా అప్‌డేట్‌ను యూజర్లు డౌన్‌లోన్ చేసుకొని ఫీచర్లను పరిశీలించవచ్చు. అయితే బగ్స్ ప్రమాదం ఉన్నందువల్ల డేటాను బ్యాకప్ చేసుకోవడం మంచిది. ఇంతకు ముందు బీటా ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకున్న యూజర్లకు తాజా అప్‌డేట్ ఇప్పటికే అందుబాటులో వస్తుంది. ఒకవేళ ఇంకా నోటిఫికేషన్ రాకపోతే.. ఫోన్ సెట్టింగ్స్‌లో సిస్టమ్ విభాగానికి వెళ్లి, సిస్టమ్ అప్‌డేట్‌ ద్వారా మాన్యువల్‌గా అప్‌డేట్ చేసుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published: