అమ్మాయిలు, మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన 'దిశ ఎస్ఓఎస్' యాప్ ఇప్పుడు హాట్ టాపిక్. వేల సంఖ్యలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడమే కాదు... 'దిశ ఎస్ఓఎస్' యాప్ ద్వారా ఆకతాయిల ఆటకట్టిస్తున్న కేసులున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కేవలం 7 నిమిషాల్లో బాధితురాలి దగ్గరకు వెళ్లిన పోలీసులు... వేధింపులకు పాల్పడ్డ కీచకుడిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఫిబ్రవరి 9న గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులోకి వచ్చిన 'దిశ ఎస్ఓఎస్' యాప్‌ను 5 రోజుల్లో 50,000 మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకోవడం విశేషం. కేవలం 4.7 ఎంబీ సైజ్ గల ఈ యాప్‌లో అమ్మాయిలు, మహిళల రక్షణకు ఉపయోగపడే అనేక ఫీచర్స్ ఉన్నాయి.
Disha SOS App: 'దిశ ఎస్ఓఎస్' యాప్ ఫీచర్స్ ఇవే...
'దిశ ఎస్ఓఎస్' యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలైంది. మొదటిసారి డౌన్‌లోడ్ చేయడానికి మాత్రమే ఇంటర్నెట్ అవసరం. యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఉపయోగించడానికి ఇంటర్నెట్ అవసరం లేదు. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్‌తో లాగిన్ చేయాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత సమాచారం, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ లాంటి వివరాలు అప్‌డేట్ చేయాలి. ఆపదలో ఉన్నప్పుడు ఈ యాప్ ఓపెన్ చేసి SOS బటన్ ప్రెస్ చేస్తే చాలు. యాప్ ఓపెన్ చేసి SOS బటన్ ప్రెస్ చేసేంత సమయం లేకపోతే ఫోన్‌ని గట్టిగా ఊపినా చాలు. మీరు ఎక్కడున్నారో లొకేషన్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది. అంతేకాదు... మీరు ఉన్న లొకేషన్ 10 సెకండ్ల వీడియో కూడా కమాండ్ రూమ్‌కు వెళ్తుంది. మీరు ఉన్న లొకేషన్ ఆధారంగా దగ్గర్లో అందుబాటులో ఉన్న పోలీస్ రక్షక్ వాహనాలకు, పోలీస్ స్టేషన్లకు సమాచారం వెళ్తుంది. పోలీస్ రక్షక్ వాహనాలు జీపీఎస్ ద్వారా మీరు ఉన్న ప్రాంతానికి చేరుకుంటాయి. మీరు ఆపదలో ఉన్నప్పుడు మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లో ఉన్న మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల నెంబర్లకు కూడా సమాచారం వెళ్తుంది.
యాప్ ఓపెన్ చేయగానే SOS బటన్‌తో పాటు నేరుగా 100 లేదా 112 నెంబర్‌కు కాల్ చేసేందుకు బటన్ ఉంటుంది. 100 నెంబర్‌కు నేరుగా కాల్ చేయొచ్చు. 112 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. ఇక యాప్‌లో ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ ఉంటుంది. మీరు క్యాబ్‌లో, ఆటోలో వెళ్తున్నప్పుడు మీ గమ్యస్థానాన్ని అందులో ఎంటర్ చేయాలి. ఒకవేళ వాహనం వేరే రూట్‌లో వెళ్తున్నట్టైతే వెంటనే కంట్రోల్ రూమ్‌తో పాటు మీ కుటుంబ సభ్యులకు సమాచారం వెళ్తుంది. యాప్‌లో పోలీస్ అధికారుల ఫోన్ నెంబర్లు, దగ్గర్లోని పోలీస్ స్టేషన్ల వివరాలు కూడా ఉంటాయి. వీటితో పాటు దగ్గర్లోని ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులు, ఫార్మసీల వివరాలు కూడా దిశ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో దిశ యాప్‌కు 4.9/5 స్టార్ రేటింగ్ ఉండటం మరో విశేషం. మరి మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్టైతే దిశ యాప్ డౌన్‌లోడ్ చేయడానికి
ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
Redmi Note 8: షాకిచ్చిన షావోమీ... రెడ్‌మీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్ ధర పెరిగింది
Save Money: జీతం మిగలట్లేదా? ఈ మనీ సేవింగ్ టిప్స్ ట్రై చేయండి
Aadhaar Card: మీ పిల్లలకు ఆధార్ కార్డు ఉందా? ఈ సేవలు ఉచితంPublished by:Santhosh Kumar S
First published:February 14, 2020, 12:31 pm