ANDHRA PRADESH GOVERNMENT JOINS HANDS WITH WHATSAPP TO PROVIDE INFORMATION ON GOVT DECISIONS SCHEMES AND OTHER EVENTS SS
WhatsApp APDC: వాట్సప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల సమాచారం
WhatsApp APDC: వాట్సప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల సమాచారం
(ప్రతీకాత్మక చిత్రం)
WhatsApp APDC | ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ (APDC) వాట్సప్‌తో చేతులు కలిపింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వ పథకాలు (Govt Schemes), ఇతర సమాచారాన్ని వాట్సప్ ద్వారా ప్రజలకు చేరవేయనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ( AP Govt Schemes), కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (APDC) ఇప్పుడు వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించింది. ఇందుకోసం వాట్సాప్‌తో (WhatsApp) ఒప్పందం కుదుర్చుకుంది. ఇంటర్నెట్ వాడేవారి సంఖ్య వేగంగా పెరుగుతున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వంటి రాష్ట్రంలో ఇలాంటి వేదిక అవసరాన్నీ, ప్రాముఖ్యతనూ గుర్తించిన వాట్సాప్ ఇండియా ఏపీడీసీ వాట్సాప్ వేదికకు పూర్తి సాంకేతిక మద్దతు అందిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, నిర్ణయాలకు సంబంధించిన సమాచారం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మరింత వేగంగా అందనుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రగతిశీల అజెండాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రఖ్యాత మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ప్రభుత్వానికీ, ప్రజలకు మధ్య డిజిటల్ మాధ్యమాల ద్వారా వారధిలా ఉండాలన్న ఏపీడీసీ లక్ష్యానికి ఈ ముందడుగు ఎంతో సాయపడుతుంది.
ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, చేపట్టే సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంతోపాటు... ఈ విషయాలపై తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు కూడా ఈ వాట్సాప్ సేవలు మరింతగా ఉపయోగపడతాయని ఏపీడీసీ భావిస్తోంది. ఈ సేవల విస్తరణలో భాగంగా త్వరలో పూర్తిస్థాయి వాట్సాప్ ఛాట్‌బాట్ సేవలను కూడా ఏపీడీసీ అందించనుంది.
రాష్ట్రంలో ఇ-గవర్నెన్స్‌ని మరింత మెరుగుపరిచే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మాకు గర్వంగా ఉంది. వైవిధ్యభరితమైన, ప్రతి అవసరానికీ తగిన ఇ-గవర్నెన్స్ పరిష్కారాలు రూపొందించేందుకు మా వాట్సాప్ వ్యాపార వేదిక ద్వారా మేం నిరంతరం పనిచేస్తాం. వీటివల్ల పౌరులతో వేగవంతమైన, సులభతరమైన, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సత్సంబంధాలు నెరిపేందుకు వీలవుతుంది. మేం రూపొందించిన పరిష్కారాలను దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, నగరపాలక సంస్థలకు అందించి, వాటితో కలిసి పనిచేసేందుకు మేం నిరంతరం ప్రయత్నిస్తాం.
— శివనాథ్ ఠుక్రాల్, వాట్సప్ ఇండియా పబ్లిక్ పాలసీ అధిపతి
SBI Offer: ఎస్బీఐ కార్డ్ ఉన్నవారికి ఈ మొబైల్‌పై అదిరిపోయే డిస్కౌంట్... EMI రూ.882 మాత్రమే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల సమాచారాన్ని రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరవేయడంలో ఏపీడీసీ ప్రారంభించబోయే ఈ వాట్సాప్ ఛాట్‌బాట్ సేవలు ఉపయోగపడనున్నాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.