హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Andhra Pradesh: ఎన్నికల్లో అక్రమాల అడ్డుకట్టకు 'నిఘా' యాప్ ఆవిష్కరించిన సీఎం జగన్

Andhra Pradesh: ఎన్నికల్లో అక్రమాల అడ్డుకట్టకు 'నిఘా' యాప్ ఆవిష్కరించిన సీఎం జగన్

అమరావతిలోని క్యాంప్ ఆఫీస్‌లో 'నిఘా' యాప్‌ను ఆవిష్కరించన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
(image: @AndhraPradeshCM/twitter)

అమరావతిలోని క్యాంప్ ఆఫీస్‌లో 'నిఘా' యాప్‌ను ఆవిష్కరించన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (image: @AndhraPradeshCM/twitter)

Andhra Pradesh Elections Nigha App | ఆంధ్రప్రదేశ్‌లో మార్చి చివరి వరకు ఎన్నికల హడావుడి ఉంటుంది. ఈ ఎన్నికల్లో అక్రమాలకు బ్రేక్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త యాప్ రూపొందించింది.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల సందడి మార్చి 29 వరకు ఉంటుంది. ఈ ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించింది. 'నిఘా' పేరుతో తయారు చేసిన యాప్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలోని క్యాంప్ ఆఫీస్‌లో ఆవిష్కరించారు. ఎన్నికల్లో డబ్బు, ఆల్కహాల్ పంపకాలను అడ్డుకోవడం, ఎన్నికల అక్రమాలపై సామాన్యుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడమే ఈ యాప్ లక్ష్యం.

NIGHA App: నిఘా యాప్‌తో ఉపయోగాలివే...


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారు చేసిన నిఘా యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలను గుర్తించే ప్రజలు నేరుగా యాప్‌లో కంప్లైట్ చేయొచ్చు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం, గిఫ్ట్స్ లాంటివి ఇచ్చినా, ఇంటి ఓనర్ అనుమతి లేకుండా పోస్టుర్లు, బ్యానర్స్ అతికించినా, ఆయుధాలతో తిరుగుతున్నా యాప్‌లో కంప్లైంట్ ఇవ్వొచ్చు. ఫోటోలు, వీడియోలు తీసి అప్‌లోడ్ చేయొచ్చు. కంప్లైంట్‌తో పాటు జీపీఎస్ ద్వారా మీ లొకేషన్ ఎన్నికల అధికారులకు వెళ్తుంది. ఆ తర్వాత అధికారులు చర్యలు ప్రారంభిస్తారు. మీ కంప్లైంట్ స్టేటస్‌ని కూడా యాప్‌లో తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

DEET App: ఈ యాప్ ఉంటే... ఉద్యోగం వెతకడం ఈజీ

Womens Day 2020: భారతీయ రైల్వే నుంచి మహిళా ప్రయాణికులకు బెనిఫిట్స్ ఇవే

Indian Railways: రైలులో ఇచ్చే బ్లాంకెట్స్ వాడుతున్నారా? ఈ విషయం తెలుసా?

First published:

Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, Ap local body elections, AP News, Cm jagan, Mobile App, Telugu news, Telugu updates, Telugu varthalu, Ys jagan, Ys jagan mohan reddy

ఉత్తమ కథలు