అప్పట్లో రోజుకు 23న్నర గంటలే... పరిశోధనలో ఆసక్తికర విషయాలు

ప్రస్తుతం రోజుకు 24 గంటలు కదా. మరి అప్పట్లో అరగంట ఎందుకు లేదు... సైంటిస్టులు ఏం కనిపెట్టారు? ఎలా కనిపెట్టారు?

news18-telugu
Updated: March 10, 2020, 1:35 PM IST
అప్పట్లో రోజుకు 23న్నర గంటలే... పరిశోధనలో ఆసక్తికర విషయాలు
అప్పట్లో రోజుకు 23న్నర గంటలే... పరిశోధనలో ఆసక్తికర విషయాలు (credit - twitter - JustGetFlux)
  • Share this:
ఇప్పటికి సరిగ్గా 7 కోట్ల సంవత్సరాల కిందట... అంటే... డైనోసార్లు అంతరించిపోతున్న టైమ్. ఆ సమయంలో భూమి... ఇప్పటికంటే వేగంగా తిరిగేది. 23న్నర గంటల్లోనే రోజు గడిచిపోయేది. ఫలితంగా భూమి సంవత్సరానికి 372 సార్లు... సూర్యుడి చుట్టూ తిరిగేది. ఇప్పుడైతే 365 సార్లే తిరుగుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌‌లోని... అల్ హజర్ పర్వతాల్లో జరిపిన పరిశోధనలో ఈ విషయాలు తెలిశాయి. మొల్లస్క్ షెల్స్ అనే శిలాజాల్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ శిలాజాలకు... ప్రతి రోజూ కొత్త రింగ్స్ ఏర్పడ్డాయి. ఆ రింగులు... ప్రతీ నిమిషమూ ఎంత పెరిగేవి అనే విషయాన్ని లేజర్ల ద్వారా అత్యంత కచ్చితమైన లెక్కలతో తేల్చారు. అందువల్ల అప్పట్లో ఏడాదికి ఎన్ని రోజులు, రోజుకు ఎన్ని గంటలు అన్నది శాస్త్రవేత్తలు తేల్చగలిగారు.


ఈ పరిశోధన ద్వారా... త్వరలో 450 కోట్ల సంవత్సరాల కిందట చందమామ ఎలా ఏర్పడిందో కూడా తెలుస్తుందని అంటున్నారు. కెమికల్ ఎనాలసిస్ ప్రకారం... 7 కోట్ల ఏళ్ల కిందట... సముద్ర ఉష్ణోగ్రతలు వేడిగా ఉండేవి. సముద్ర నీరు ఎండాకాలంలో 40 డిగ్రీల సెల్సియస్ ఉండేది. చలికాలంలో 30 డిగ్రీలుండేదని తెలిసింది. అప్పట్లో.. అల్ హజర్ పర్వతాల్లో సముద్ర నీరు ఉండేది. పగడాలు, కోరల్ రీఫ్స్ ఉండేవి. ఆ సమయంలో (6.6 కోట్ల ఏళ్ల కిందట)... భూమిపై భారీ గ్రహశకలం పడటంతో... సముద్రాలు అల్లకల్లోలం అయ్యాయి. అదే సమయంలో కోరల్ రీఫ్స్ నాశనమయ్యాయి.


ఇంతకీ అప్పట్లో అరగంట త్వరగా భూమి తన చుట్టూ తాను ఎందుకు తిరిగేదన్నదానికి శాస్త్రవేత్తలు ఓ సమాధానం చెప్పారు. ఆ సమయంలో భూమి ఇప్పటికంటే చిన్నగానే ఉండేదట. క్రమంగా కోట్ల సంవత్సరాలు గడుస్తుంటే... రోదసి నుంచీ భూమిపై పడే ఉల్కలు, గ్రహశకలాలు, దుమ్ము, ధూళి వల్ల భూమి సైజు పెరిగిందనీ... తద్వారా భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం కాస్త తగ్గిందని అంటున్నారు. ఐతే... భూమి తిరిగే వేగం తగ్గుతుంటే... చందమామ భూమికి దూరం అవుతోంది. ఏడాదికి 3.82 సెంటీమీటర్లు దూరం అవుతోంది.
Published by: Krishna Kumar N
First published: March 10, 2020, 1:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading