భారత కాలమానం ప్రకారం... సెప్టెంబర్ 1 ఉదయం 10.49 గంటలకు 2011 ES4 అనే గ్రహశకలం... భూమివైపు నుంచి వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా (NASA) తెలిపింది. ఇది భూమికి దగ్గరగా వచ్చినప్పుడు దూరం 44618 మైళ్లు ఉంటుంది. ఇప్పటివరకూ చాలా గ్రహశకలాలు భూమివైపు నుంచి వెళ్లాయి. వాటివల్ల మనకు ఎలాంటి నష్టమూ జరగలేదు. ఇప్పుడు రాబోతున్నది మాత్రం... ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే... మిగతా గ్రహశకలాలు... చందమామ కంటే దూరం నుంచి వెళ్లగా... ఈ గ్రహశకలం మాత్రం చందమామ కంటే దగ్గర నుంచి భూమివైపుగా వెళ్లబోతోంది. భూమికీ, చందమామకీ మధ్య దూరం 238855 మైళ్లు.
భూమికి దగ్గరగా వచ్చే గ్రహశకలాల్ని నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్గా నాసా పరిగణిస్తుంది. ఈ గ్రహశకలం ఆల్రెడీ ఆ లిస్టులో ఉంది. ఈ గ్రహశకలాలతో వచ్చిన చిక్కేంటంటే... ఇవి తమ దారిలో వెళ్తూ వెళ్తూ... మధ్యలో ఏదైనా గ్రహం వస్తే... దాని గురుత్వాకర్షణ శక్తికి లోనవుతాయి. దిశ మార్చుకొని... గ్రహంవైపు వెళ్తాయి. మన భూమి చందమామను కంటిన్యూగా ఆకర్షిస్తూ ఉంటుంది. అందువల్ల మన భూమి ఆకర్షణ బలం అక్కడి వరకూ ఉంటుంది. ఈ గ్రహశకలం చందమామ కంటే దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి... దీన్ని భూమి ఆకర్షించే అవకాశం ఉంది. ఇది మార్స్, జూపిటర్ (గురుగ్రహం) మధ్య ఉండే గ్రహశకలాల్లో ఒకటి కావచ్చని నాసా భావిస్తోంది.
2011 ES4 గ్రహశకలాన్ని నానా... అపోలో ఆస్టరాయిడ్ కేటగిరీలో కూడా పెట్టింది. ఇలాంటి గ్రహశకలాలు... భూమి, సూర్యుడి మధ్య భారీ కక్ష్యలో తిరుగుతుంటాయి. సూర్యుడి చుట్టూ ఓ రౌండ్ పూర్తైన ప్రతిసారీ... ఈ గ్రహశకలం భూ కక్ష్యలోకి వచ్చి వెళ్తుంది. ఇంతకీ ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటుందా అనే ప్రశ్నకు నాసా... అలా జరగదని చెప్పింది. ఎందుకంటే... ఈ గ్రహశకలం భారీ సైజులో లేదనీ... అందువల్ల దీన్ని భూమి ఆకర్షించేలోపే... ఇది భూ కక్ష్యను దాటేసి వేగంగా వెళ్లిపోతుందని నాసా వివరించింది. అందువల్ల మనం ఊపిరి పీల్చుకోవచ్చు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.