Home /News /technology /

AN AMAZING NEW FEATURE IN WHATSAPP THIS IS HOW YOU CAN FIND OUT WHO HAS BLOCKED YOU OR NOT UMG GH

WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో లేదో ఇలా సులభంగా తెలుసుకోవచ్చు..!

వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్..  మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో లేదో ఇలా సులభంగా తెలుసుకోవచ్చు..!

వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో లేదో ఇలా సులభంగా తెలుసుకోవచ్చు..!

ఎవరైనా వాట్సాప్‌(WhatsApp)లో మిమ్మల్ని బ్లాక్ చేసినప్పుడు, దానికి సంబంధించిన అలర్ట్ కనిపించదు. వారు మీ కాంటాక్ట్‌ను బ్లాక్ చేసినట్లు ధ్రువీకరించే ఫీచర్‌ను వాట్సాప్ అందించదు. అయితే ఎవరైనా మిమ్మల్ని బ్లాక్(Block) చేశారో లేదో తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో చ?

ఇంకా చదవండి ...
మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్(WhatsApp) ద్వారా ఎన్నో రకాల సేవలు పొందవచ్చు. ఎప్పటికప్పుడు యూజర్లకు బెస్ట్ ఫీచర్లను పరిచయం చేస్తున్న వాట్సాప్‌.. కొన్ని సేఫ్టీ, సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తోంది. ఆండ్రాయిడ్(Android), iOS డివైజ్‌లలో ఏదైనా అకౌంట్‌ను బ్లాక్ చేసే ఫీచర్ అందుబాటులో ఉంది. యూజర్లు తమకు నచ్చని, ఇబ్బంది పెట్టే కాంటాక్ట్స్‌ను ఈజీగా బ్లాక్ చేసుకోవచ్చు. కానీ ఎవరైనా వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేసినప్పుడు, దానికి సంబంధించిన అలర్ట్ కనిపించదు. వారు మీ కాంటాక్ట్‌ను బ్లాక్ చేసినట్లు ధ్రువీకరించే ఫీచర్‌ను వాట్సాప్ అందించదు. అయితే ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో చూడండి..

మెసేజ్ డెలివరీ స్టేటస్
ఎవరైనా మిమ్మల్ని వాట్సాప్‌లో బ్లాక్ చేశారని అనుమానం ఉంటే, వారికి మెసేజ్ పంపడానికి ప్రయత్నించండి. మీ మెసేజ్ డెలివరీ అవ్వకపోతే దానికి రెండు కారణాలు ఉండవచ్చు. ఆ యూజర్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండాలి లేదా వారు ఇంటర్నెట్ ఆఫ్ చేసి ఉండాలి. కానీ ఒకటి లేదా రెండు రోజుల తర్వాత కూడా మెసేజ్ డెలివరీ కాకపోతే, ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసినట్లు చెప్పవచ్చు.

వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి
మీకు డౌట్ ఉన్న కాంటాక్ట్‌తో వాట్సాప్‌లో గ్రూప్‌ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. ఇలాంటప్పుడు మీకు “ఈ కాంటాక్ట్‌ను యాడ్ చేయడానికి మీకు అధికారం లేదు” అని నోటిఫికేషన్ డిస్‌ప్లే అయితే.. వారు మిమ్మల్ని బ్లాక్ చేశారని కన్ఫర్మ్ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?


ఆ వ్యక్తికి కాల్ చేయండి
వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారని డౌట్ వస్తే, వారికి కాల్ చేయండి. వారు మిమ్మల్ని నిజంగా బ్లాక్ చేస్తే, మీ కాల్ వారికి రీచ్ కాదు. వాట్సాప్ కాల్ చేసినప్పుడు రింగింగ్ స్టేటస్‌ చూపకపోతే, ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేశారని అర్థం.

ప్రొఫైల్ ఫోటో చెక్ చేయండి
ఏదైనా కాంటాక్ట్ ప్రొఫైల్ ఫోటో మీకు ఇంతకు ముందు కనిపించి, ఇప్పుడు సడన్‌గా కనిపించకపోతే.. ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వారు ప్రొఫైల్ ఫోటోను రిమూవ్ చేసినప్పుడు ఎవరికీ ఫోటో కనిపించదు. కానీ వారి కాంటాక్ట్ లిస్ట్‌లో మీ ఒక్కరికే ప్రొఫైల్ ఫోటో కనిపించకపోతే డౌట్ పడాల్సిందే.



లాస్ట్ సీన్, ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేయండి
మీ కాంటాక్ట్స్‌ లిస్ట్‌లోని వాట్సాప్ అకౌంట్‌ హోల్డర్ ఆన్‌లైన్ స్టేటస్ లేదా లాస్ట్ సీన్ వివరాలు మీకు గతంలో కనిపించి, ఇప్పుడు కనిపించకపోతే.. ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసే అవకాశం ఉంది.
Published by:Mahesh
First published:

Tags: Android, Block, Tech news, Whatsapp tricks

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు