Home /News /technology /

AMSUNG GALAXY M52 5G REVIEW SOLID BATTERY AND PERFORMANCE KNOW OTHER FEATURES EVK

Samsung M 52 Review: బెస్ట్‌ బ్యాటరీ సామ‌ర్థ్యం.. అదిరిపోయే ఫీచ‌ర్స్ ఇవే శామ్‌సంగ్ ఎం52 ప్ర‌త్యేక‌త‌లు

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం52 5జీ  (image: Samsung India)

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం52 5జీ (image: Samsung India)

శామ్‌సంగ్ కొత్త ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. అదే శామ్‌సంగ్ గెలాక్సీ ఎం52 5జీ (Samsung Galaxy M52 5G) మోడల్‌. ప్ర‌స్తుతం మార్కెట్‌లో ల‌భిస్తున్న ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఆక‌ట్టుకొంటుంది. ఈ నేప‌థ్యంలో ఈ మోడ‌ల్ ఫీచ‌ర్స్ ఏంటో తెలుసుకోండి

ఇంకా చదవండి ...
    శామ్‌సంగ్ కొత్త ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. అదే శామ్‌సంగ్ గెలాక్సీ ఎం52 5జీ (Samsung Galaxy M52 5G) మోడల్‌. ప్ర‌స్తుతం మార్కెట్‌లో ల‌భిస్తున్న ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఆక‌ట్టుకొంటుంది. దీనికి కార‌ణాలు ముఖ్యంగా బ్యాట‌రీ ప‌నితీరు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) సందర్భంగా ఈ కొత్త మొబైల్‌ను పరిచయం చేసింది సాంసంగ్. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇదే ప్రాసెసర్ రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్,  శామ్‌సంగ్‌  గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్లలో కూడా ఉంది. ఈ నేప‌థ్యంలో మార్కెట్‌ (Market) లో శామ్‌సంగ్ ఎం 52 ఫీచ‌ర్స్ (Fetures) ఏంటో తెలుసుకోండి..

    బేసిక్ ఫీచ‌ర్స్‌..
    - శామ్‌ససంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
    - ఈ ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
    - ఎం52 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 11 5జీ బ్యాండ్స్, 4జీ వీఓ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

    Whatsapp : వాట్స‌ప్ ఖాతా ఎందుకు బ్లాక్ అవుతుందో తెలుసా.. చ‌ద‌వండి



    - ఈ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 12 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
    - సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో సింగిల్ టేక్ కెమెరా ఫీచర్ ఉంది. ఒక్క టేక్‌లో 10 ఫోటోస్ క్లిక్ చేయడంతో పాటు వీడియో రికార్డ్ చేయొచ్చు.
    - ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + వన్‌యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. బ్లేజింగ్ బ్లాక్, ఐసీ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు.

    ఇత‌ర ఫీచ‌ర్లు..
    - ఇటీవల మార్కెట్‌లో బాగా పాపులర్‌ అయిన వర్చువల్‌ RAM ఫీచర్‌ని శామ్‌సంగ్‌ అందించింది. శామ్‌సంగ్‌ సంస్థ ర్యామ్‌ ప్లస్‌ పేరుతో వరవ్చుల్‌ ర్యామ్‌ని అందిస్తుంది. ర్యామ్‌మెమెరీ నిండిపోయినప్పుడు వర్చువల్‌ రామ్‌ అప్పటికప్పుడు అదనంగా ర్యామ్‌ని అందిస్తుంది.

    Amazon Prime : అమెజాన్‌లో మ‌ళ్లీ మంత్లీ స‌బ్‌స్కిప్ష‌న్ ఆప్ష‌న్‌.. ధ‌రల వివ‌రాలు ఇవే


    శామ్‌సంగ్ కొత్త మోడ‌ల్‌లో 8 జీబీ ర్యామ్‌ ఫోన్‌లో వర్చువల్‌ ర్యామ్‌గా 4 జీబీవ‌ర్చువ్ RAM అందిస్తోంది.
    - మ‌నం ఎక్కువ‌గా వాడే ఫోన్లలో ఇలాంటి ప్రీ ఇన్‌స్టాల్‌డ్‌ బ్లోట్‌వేర్‌ యాప్స్‌ని తొలగించే అవకాశం ఉండదు. కానీ శామ్‌సంగ్‌ ఎం 52లో బ్లోట్‌వేర్‌ యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్‌ చేసుకునే వీలుంది.
    - గెలాక్సీ ఎం 52 ఫోన్‌ 5జీ నెట్‌వర్క్‌ని సపోర్ట్‌ చేస్తుంది. ఇందు కోసం ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 778 జీ ప్రాసెసర్‌ని ఉపయోగించారు. ఈ చిప్‌సెట్‌ 5 జీ నెట్‌వర్క్‌గి బాగా సపోర్ట్‌ చేస్తుంది.
    - ఫోన్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉండగా ప్రధాన కెమెరా 64 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతో పాటు కెమెరా అపాచర్‌ 1.8 ఎఫ్‌గా ఉంది. దీని వల్ల తక్కువ వెలుతురులో కూడా ఫోటోలు బాగా తీసుకునే సౌలభ్యం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Amazon Great Indian Festival Sale, AMAZON INDIA, Latest Technology, Samsung Galaxy, Smart phone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు