AMERICAN PRIVATE EQUITY GIANT SILVER LAKE TO INVEST RS 5655 CRORE IN OF JIO PLATFORMS SS
Reliance Jio: జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.5,655 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న సిల్వర్ లేక్
Reliance Jio
(ప్రతీకాత్మక చిత్రం)
Reliance Jio Silver Lake deal | భారతదేశం యొక్క 360-డిగ్రీల డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో కొత్త ఉపాధి, కొత్త వ్యాపారాలు, కొత్త అవకాశాలను ఎవరూ కోల్పోకూడదని రిలయెన్స్ జియో బలమైన నమ్మకం.
రిలయెన్స్ జియో మరోసారి హెడ్లైన్స్లోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్బుక్ పెట్టుబడుల అంశం బిజినెస్ వర్గాల్లో ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ కూడా జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.5,655.75 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ పెట్టుబడితో జియో ప్లాట్‌ఫామ్స్ ఈక్విటీ విలువ రూ.4.90 లక్షల కోట్లు, ఎంటర్ప్రైజ్ విలువ రూ.5.15 లక్షల కోట్లకు చేరుస్తుంది. ఇది ఏప్రిల్ 22న ఫేస్బుక్ ప్రకటించిన పెట్టుబడి ఈక్విటీ వ్యాల్యుయేషన్‌కు 12.5% ప్రీమియంను సూచిస్తుంది. జియో ప్లాట్‌ఫామ్స్ రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ కంపెనీ. జియోకు చెందిన ప్రముఖ డిజిటల్ యాప్స్, డిజిటల్ ఎకోసిస్టమ్స్, భారతదేశంలో నెంబర్ 1 హైస్పీడ్ కనెక్టివిటీ ప్లాట్‌ఫామ్‌లను ఒకే గొడుగు కింద అందిస్తూ భారతదేశంలో డిజిటల్ సొసైటీని నిర్మించే దిశగా కృషి చేస్తోంది. రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ 38.8 కోట్ల మందికి పైగా సబ్స్క్రైబర్లకు కనెక్టివిటీ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తోంది. భారతదేశంలోని అన్ని వ్యాపారాలు ముఖ్యంగా చిరు వ్యాపారులు, రైతులతో పాటు 130 కోట్ల మంది ప్రజలకు డిజిటల్ ఇండియాను పరిచయం చేయడం జియో ఆశయం. ఇప్పటికే జియో ఇండియాలో డిజిటల్ సేవల రంగంలో అనేక మార్పుల్ని తీసుకొచ్చింది. గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా మారింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని ముందుకు నడిపించింది.
కోవిడ్ 19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిన నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత టెక్-ఇన్వెస్టర్లలో ఒకటైన సిల్వర్ లేక్‌తో ఈ భాగస్వామ్యం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. సమగ్ర డిజిటలైజేషన్ భారత ఆర్థిక వ్యవస్థ యొక్క పునరుజ్జీవనంలో కీలకమైన అంశం అవుతుంది. భారతదేశం యొక్క 360-డిగ్రీల డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో కొత్త ఉపాధి, కొత్త వ్యాపారాలు, కొత్త అవకాశాలను ఎవరూ కోల్పోకూడదని రిలయెన్స్ జియో బలమైన నమ్మకం.
భారతీయులందరి ప్రయోజనాల కోసం భారతీయ డిజిటల్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో, మార్చడంలో సిల్వర్ లేక్‌ను విలువైన భాగస్వామిగా స్వాగతిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. సిల్వర్ లేక్ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు విలువైన భాగస్వామిగా నిలిచింది. సిల్వర్ లేక్ టెక్నాలజీ, ఫైనాన్స్‌లలో అత్యంత గౌరవనీయమైనవాటిలో ఒకటి. ఇండియన్ డిజిటల్ సొసైటీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం వారి ప్రపంచ సాంకేతిక సంబంధాల నుంచి మరింత ముందుకెళ్లేందుకు మేము సంతోషిస్తున్నాము.
— ముఖేష్ అంబానీ, ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగంలో ఉన్న అవకాశాల్ని గుర్తించి టెక్నాలజీ రంగంలో సుమారు 40 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులతో సిల్వర్ లేక్ గ్లోబల్ లీడర్‌గా నిలుస్తోంది. ప్రపంచ స్థాయి నిర్వహణ బృందాలతో భాగస్వామ్యం చేయడం ద్వారా గొప్ప సంస్థలను నిర్మించడం, పెంచడం దీని లక్ష్యం. Airbnb, Alibaba, Ant Financial, Alphabet’s Verily and Waymo units, Dell Technologies, Twitter ఇలాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, స్మార్ట్ డివైజెస్, క్లౌడ్, ఎడ్జ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆగ్యుమెంటెడ్ అండ్ మిక్స్డ్ రియాల్టీ, బ్లాక్‌చెయిన్ లాంటి ప్రముఖ టెక్నాలజీస్‌తో జియో రూపొందించిన వాల్డ్ క్లాస్ డిజిటల్ ప్లాట్ఫామ్లో సిల్వర్ లేక్ పెట్టుబడులు దీనికి మరో నిదర్శనం.
జియో ప్లాట్‌ఫామ్స్ ప్రపంచంలోని అత్యంత గొప్ప సంస్థలలో ఒకటి. ఇది చాలా బలమైన, వ్యవస్థాపక నిర్వహణ బృందం నేతృత్వంలో ఉంది. తక్కువ ఖర్చుతో కూడిన డిజిటల్ సేవల శక్తిని సామూహిక వినియోగదారులకు, చిరు వ్యాపారులకు అందజేయడానికి వారు అసాధారణమైన ఇంజనీరింగ్ సామర్థ్యాలను తీసుకువచ్చారు. వారి మార్కెట్ సామర్థ్యం అపారమైనది. జియో మిషన్‌కు మరింత సహాయపడటానికి ముఖేష్ అంబానీ, రిలయన్స్, జియోలోని బృందంతో భాగస్వామిగా ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం. సంతోషిస్తున్నాము.
— ఎగాన్ డర్బన్, సిల్వర్ లేక్ కో-సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్
రిలయెన్స్ ఇండస్ట్రీస్‌కు ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా మోర్గాన్ స్టాన్లీ, లీగల్ కౌన్సిల్‌గా ఏజెడ్‌బీ అండ్ పార్ట్నర్స్, డేవిల్ పోల్క్ అండ్ వార్డ్‌వెల్ సహకారం అందించడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.