Home /News /technology /

AMERICA NASA PLANS TO STUDY GOLDMINE ASTEROID WORTH OVER 10000 QUADRILLION HERE IS THE FULL DETAILS NK GH

NASA: బంగారు గ్రహశకలం.. నాసా దాన్ని భూమికి తెస్తుందా?

బంగారు గ్రహశకలం (image credit - NASA)

బంగారు గ్రహశకలం (image credit - NASA)

Goldmine Asteroid: అంతరిక్షంలో ఆ బంగారు గ్రహశకలం నాసా (NASA)తోపాటూ... ఖగోళ శాస్త్రవేత్తల్ని ఎక్కువగా ఆకట్టుకుంటోంది. మరి దాని విషయంలో నాసా తీసుకున్న నిర్ణయమేంటి?

Goldmine Asteroid: గ్రహశకలాల గురించి మనకు ఎంతో కొంత తెలుసు. స్కూల్లో పాఠాల్లోనూ, అప్పుడప్పుడూ శాస్త్రవేత్తలు... అవి భూమికి దగ్గరకు వెళ్తున్నాయి అని చెబుతుంటే వినే ఉంటాం. అలాంటి వాటిలో బంగారు గ్రహశకలం ఒకటి ఉందని మీకు తెలుసా? అది మన సౌర వ్యవస్థలోనే తిరుగుతోందట. దానిపై పరిశోధనలు జరపడానికి అమెరికా స్పేస్‌ ఏజెన్సీ నేషన్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ - నాసా (NASA) సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ గ్రహశకలం వివరాలు, అది పూర్తిగా బంగారంతో ఎందుకు ఉంది? ఆ బంగారం విలువ ఎంత? వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

నాసా చెబుతున్న గ్రహశకలం లేదా ఉల్క... సుమారు 199 కిలోమీటర్ల వెడల్పులో ఉంటుందట. దీనికి నాసా సైక్‌ 16 (psyche 16) అనే పేరు కూడా పెట్టింది. ఇందులో మూలకాల మొత్తం ధర సుమారు 10 వేల డాలర్ల క్వాడ్రిలియన్‌ (రూ.7,44,045 క్వాడ్రిలియన్) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఒక క్వాడ్రిలియన్‌ అంటేనే ఒకటి పక్కన 15 సున్నాలు ఉంటాయి. మరి రూ.7,44,045 క్వాడ్రిలియన్ అంటే దాని విలువ ఎంత ఉంటుందో లెక్కకు అందదు. ఇంకా చెప్పాలంటే ఆ గ్రహశకలంలోని రవ్వంత ముక్క కూడా కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. ఆ గ్రహశకలంలో చాలా ఖరీదైన మూలకాలు ఉన్నాయని నాసా అంచనా వేస్తోంది. అందుకే దీనిని గోల్డ్‌మైన్‌ గ్రహశకలం అని పిలుస్తోంది.

solar system, asteroids, quadrillion, nasa, m type asteroid, floatting, scientists, space psyche 16, earth, గ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు, సౌర వ్యవస్థ,
బంగారు గ్రహశకలం (image credit - NASA)


సైక్‌ 16 లెక్క తేల్చడానికి నాసా ఇప్పటికే ముహూర్తం పెట్టేసింది. 2026 నాటికి సైక్‌ దగ్గరకు తన మిషన్‌ను పంపించే ప్రయత్నం చేస్తోంది. దాని ద్వారా ఆ గ్రహశకలం గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయని అనుకుంటోంది. ప్రస్తుతం ఇది అంగారకం (Mars), జూపిటర్‌ (Jupiter) మధ్య ఉందట. అంటే భూమి నుంచి సుమారు 30 కోట్ల కిలోమీటర్ల దూరం అన్నమాట. ఈ గ్రహశకలంపై ముందుగా పూర్తి పరిశోధన చెయ్యాలని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. ఆ గ్రహశకలం ఏదో ఒక గ్రహానికి చెందిన భాగమని ప్రాథమికంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీన్ని 1852లో గుర్తించారు.

ఇది కూడా చదవండి: ముసలాయనను కాటేసిన పాము.. పెద్దాయన అలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు

సౌర వ్యవస్థ ఏర్పాటయ్యే సమయంలో ఏవైనా రెండు గ్రహాలు ఢీకొనడం వల్ల ఈ గ్రహ శకలం ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అప్పటి నుంచి ఆ గ్రహ శకలం సౌరవ్యవస్థలో తేలియాడుతోందని అనుకుంటున్నారు. ఇప్పటికే ఆ గ్రహ శకలం ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు కొంతమంది ప్రయోగాలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Zodiac Signs: రాశులపై నెగెటివ్ ఎనర్జీ ప్రభావం.. ఎవరిపై ఎలా ఉంటుందంటే?

ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం సైక్‌ 16 ఐరన్‌, నికెల్‌తో నిండి ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు మొత్తం సౌర వ్యవస్థలో ఉన్న ఎం టైప్‌ గ్రహశకలాల్లో సైక్‌ అతి పెద్దదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
First published:

Tags: Information Technology, Latest Technology, NASA

తదుపరి వార్తలు