హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Ambrane Powerbank: బాహుబలి పవర్ బ్యాంక్.. ఫోన్లకే కాదు ల్యాప్‌టాప్స్‌కు కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు!

Ambrane Powerbank: బాహుబలి పవర్ బ్యాంక్.. ఫోన్లకే కాదు ల్యాప్‌టాప్స్‌కు కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు!

Ambrane Powerbank: బాహుబలి పవర్ బ్యాంక్ వచ్చేసింది.. ఫోన్లకే కాదు ల్యాప్‌టాప్స్‌కు కూడా  చార్జింగ్ పెట్టుకోవచ్చు!

Ambrane Powerbank: బాహుబలి పవర్ బ్యాంక్ వచ్చేసింది.. ఫోన్లకే కాదు ల్యాప్‌టాప్స్‌కు కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు!

Powerbank | మార్కెట్‌లోకి కొత్త పవర్ బ్యాంక్ ఎంట్రీ ఇచ్చింది. ఫాస్ట్ చార్జింగ్ దీని ప్రత్యేకత. అంతేకాకుండా దీని సామర్థ్యం కూడా చాలా ఎక్కువే. ఫోన్లకు మాత్రమే కాకుండా ల్యాప్ టాప్స్‌కు కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Ambrane | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బ్యాటరీ టెక్నాలజీ అనేది క్రమంగా మెరుగుపడుతూ వస్తోంది. దీని వల్ల పవర్ బ్యాంక్స్ వినియోగం తగ్గుతూ వస్తోందని చెప్పుకోవచ్చు. ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ అందుబాటులోకి రావడంతో స్మార్ట్‌ఫోన్లను (Smartphone) కేవలం నిమిషాల వ్యవధిలోనే చార్జ్ చేసుకోవచ్చు. అయితే మీరు జర్నీలో ఉన్నా లేదంటే పవర్ కట్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు పవర్ బ్యాంక్స్‌తో (Banks) ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు.

ప్రముఖ టెక్ కంపెనీ అంబ్రేన్ తాజాగా కొత్త పవర్ బ్యాంక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ద్వారా కేవలం ఫోన్లు మాత్రమే కాకుండా ల్యాప్ టాప్స్ కూడా చార్జ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది. 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా దీని కెపాసిటీ కూడా 40,000 ఎంఏహెచ్‌గా ఉంది. ఈ మేడిన్ ఇండియా పవర్ బ్యాంక్ ద్వారా ఫోన్లను సులభంగానే వేగంగా చార్జ్ చేసుకోవచ్చు. ల్యాప్స్ టాప్స్, ట్యాబ్స్ వంటి వాటికి కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు.

నెలకు రూ.270తో స్మార్ట్‌టీవీ కొనండి.. 70 శాతానికి పైగా డిస్కౌంట్!

ఈ పవర్ బ్యాంక్‌కు 180 రోజుల వారంటీ ఉంటుంది. దీని కెపాసిటీ 40000 ఎంఏహెచ్. ఇది లిథియం పాలీమర్ బ్యాటరీ. పవర్ బ్యాంక్‌లోని 65 వాట్ పీడీ ఫాస్ట్ చార్జింగ్ ఔట్‌పుట్, 20 వాట్ డీసీ 2.0 ఔట్ ‌పుట్ ద్వారా స్మార్ట్‌ఫోన్స్ వేగంగా చార్జ్ అవుతాయి. అంతేకాకుండా ఇందులో 60 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఇన్‌పుడ్ కూడా ఉంది. అంటే పవర్ బ్యాంక్ కూడా వేగంగా ఫుల్ అవుతుంది. అలాగే ఫోన్లకు త్వరిగతిన చార్జ్ చేసుకోవచ్చు.

కొత్త ల్యాప్‌టాప్ అదిరింది.. ఒక్కసారి చార్జ్ చేస్తే 14 గంటలు వాడుకోవచ్చు, 2 ఏళ్లు వారంటీ!

ఈ పవర్ బ్యాంక్‌లో రెండు యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. ఒక టైప్ సీ పోర్ట్ ఉంటుంది. వీటి ద్వారా మల్టీపుల్ డివైజ్‌లకు చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎల్ఈడీ ఇండికేటర్ ఉంటుంది. దీని ద్వారా పవర్ బ్యాంక్‌లో ఎంత చార్జింగ్ మిగిలి ఉందో చెక్ చేసుకోవచ్చు. ఇది ఏబీఎస్ ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారు అయ్యింది. ఇంకా 12 లేయర్ల అడ్వాన్స్‌డ్ చిప్ సెట్ ప్రొటెక్షన్ ఉంది. అందువల్ల ఈ పవర్ బ్యాంక్ హీట్ కావడం లేదా డ్యామేజ్ అవ్వడం వంటివి ఉండవు. కంపెనీ కొత్తగా తీసుకువచ్చిన ఈ అంబ్రేన్ స్టైలో బూస్ట్ పవర్ బ్యాంక్ ధర రూ. 4,299గా ఉంది. దీన్ని దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో కొనొచ్చు. బ్లూ, గ్రీన్ రంగుల్లో ఈ పవర్ బ్యాంక్ అందుబాటులో ఉంది. కొనాలనుకునే వారికి కొనేయవచ్చు.

First published:

Tags: Amazon, Flipkart, Power bank, Smartphone

ఉత్తమ కథలు