Ambrane Earbuds: అంబ్రేన్ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్.. ఫెస్టివల్ ఆఫర్ కింద రూ.799కే.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

డాట్స్ స్లే టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ (Dots Slay TWS) పేరుతో రూపొందించిన ఈ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ ధరను రూ.2,199గా నిర్ణయించింది. అయితే పండుగ ఆఫర్‌లో భాగంగా ప్రస్తుతం వీటిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.799 ధరకే అందుబాటులో ఉంచింది.

  • Share this:
భారత్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అంబ్రేన్ (Ambrane) సరికొత్త ప్రొడక్ట్స్‌ను దేశంలో విడుదల చేస్తూ మార్కెట్ పరిధిని పెంచుకోవాలని భావిస్తోంది. తాజాగా ఆ సంస్థ సరికొత్త TWS ఇయర్‌బడ్స్‌ను (TWS earbuds) భారత మార్కెట్లోకి విడుదల చేసింది. డాట్స్ స్లే టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ (Dots Slay TWS) పేరుతో రూపొందించిన ఈ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ ధరను రూ.2,199గా నిర్ణయించింది. అయితే పండుగ ఆఫర్‌లో భాగంగా ప్రస్తుతం వీటిని అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) రూ.799 ధరకే అందుబాటులో ఉంచింది. ఈ ఇయర్‌బడ్స్ IPX4 వాటర్ రెసిస్టెన్స్‌తో పనిచేస్తాయి. అంబ్రేన్ డాట్స్ స్లే ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ మల్టీ ఫంక్షనల్ బటన్‌తో వస్తాయి.

ఫీచర్లు ఇవే..
ఈ ఇయర్ బడ్స్‌లో బూస్టెడ్ బాస్‌ కలిగిన 8 మిమీ డైనమిక్ డ్రైవర్స్ ఉంటాయి. 600mAh బ్యాటరీ సామర్థ్యంతో దీన్ని తయారు చేశారు. ఇది 38 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది. ఒకసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే.. ఈ TWS డివైజ్‌ నాన్‌స్టాప్‌గా 8 గంటల పాటు మ్యూజిక్‌ను ప్లే చేయగలదని సంస్థ తెలిపింది. ఈ ఇయర్ బడ్స్ 10m వైర్‌లెస్ రేంజ్ బ్లూటూత్ V5.1కి సపోర్ట్ చేస్తాయి. సిరి, గూగుల్ అసిస్టెంట్ వంటి వాయిస్ అసిస్టెంట్లకు సైతం ఇది సపోర్ట్ చేస్తుంది.
Flipkart Diwali Sell: రూ. 5990 విలువైన స్మార్ట్ వాచ్ కేవలం రూ. 500లకే.. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ లో సూపర్ ఆఫర్.. మరికొన్ని గంటలే ఛాన్స్..

ఈ ప్రొడక్ట్‌ లాంచించ్ సందర్భంగా మాట్లాడారు అంబ్రేన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రాజ్‌పాల్. దేశీయంగా తయారు చేసిన అంబ్రేన్ డాట్స్ స్లే TWSని లాంచ్ చేయడం గర్వకారణమని చెప్పారు. ‘భారత్‌లో ఉత్పత్తుల తయారీ ద్వారా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మా వంతు మద్దతు ఇస్తున్నాం. ఈ వారసత్వాన్ని అంబ్రేన్ కొనసాగిస్తోంది’ అని అశోక్ తెలిపారు.
Redmi Smart TV X: రెడ్‌మీ నుంచి సరికొత్త స్మార్ట్ టీవీ.. 4K స్క్రీన్ తో మరెన్నో సూపర్ ఫీచర్లు.. వివరాలివే

అంబ్రేన్ ఇటీవల కొత్త బ్రాండ్ ఐడెంటిటీని ప్రకటించింది. బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ సెలబ్రిటీ దిశా పటానీని ఎంపిక చేసి ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేస్తోంది. ఈ పండుగ సీజన్ కోసం భారతదేశంలో పదికి పైగా ఆడియో డివైజ్‌లను లాంచ్ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తాజా టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది.
Published by:Nikhil Kumar S
First published: