Powerbank: భారీ పవర్ బ్యాంక్ లాంచ్.. కెమెరా, ల్యాప్‌టాప్‌లు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు..!
ఆంబ్రాన్ 50,000 mAh పవర్ బ్యాంక్
ఇండియన్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఆంబ్రేన్ (Ambrane) నుంచి భారీ కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంక్ లాంచ్ అయింది. ఈ కంపెనీ మొట్టమొదటి హెవీ-డ్యూటీ, పవర్-ప్యాక్డ్ 50000mAh స్టైలో మ్యాక్స్ పవర్ బ్యాంక్‌ను (Stylo Max Power Bank) మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దీనితో డిజిటల్ కెమెరాలు, ల్యాప్‌టాప్‌ల వంట
ఇండియన్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఆంబ్రేన్ (Ambrane) నుంచి భారీ కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంక్ లాంచ్ అయింది. ఈ కంపెనీ మొట్టమొదటి హెవీ-డ్యూటీ, పవర్-ప్యాక్డ్ 50000mAh స్టైలో మ్యాక్స్ పవర్ బ్యాంక్‌ను (Stylo Max Power Bank) మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దీనితో డిజిటల్ కెమెరాలు, ల్యాప్‌టాప్‌ల వంటి పెద్ద డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి భారీ పవర్‌బ్యాంక్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ను అనేకసార్లు ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ బ్యాకప్ సొల్యూషన్ టెక్ ఎక్స్‌పర్ట్స్‌ను సైతం ఆకర్షిస్తోంది. ఇది బ్లూ, బ్లాక్ కలర్లో అందుబాటులో ఉంది. ఈ ప్రొడక్ట్ 180 రోజుల వారంటీతో వస్తుంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఆంబ్రేన్ వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ డివైజ్ ధర రూ.3,999 మాత్రమే కావడం విశేషం.
స్టైలో మ్యాక్స్ 50k mAh పవర్ బ్యాంక్‌ను టఫ్ ఎక్స్టీరియర్ అవుటర్ బాడీతో రూపొందించారు. తొమ్మిది లేయర్ల సుపీరియర్ చిప్సెట్ ప్రొటెక్షన్‌తో తీర్చిదిద్దారు. ఇది వేడెక్కడం, షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాల నుంచి అదనపు రక్షణ అందిస్తుంది. ఇండియాలోనే తయారు చేసిన ఈ లోకల్ పవర్‌బ్యాంక్‌ను హై గ్రేడియంట్ మాట్టే మెటాలిక్ కేసింగ్‌లో నిక్షిప్తం చేశారు. ఇది కాంపాక్ట్‌గా, దృఢంగా ఉంటుంది. ఈ డివైజ్‌ను ఎవరైనా ఎక్కడికికైనా తీసుకెళ్లవచ్చు.
ఈ భారీ పవర్‌బ్యాంక్‌కు 20W పవర్ అవుట్‌పుట్‌కు సపోర్ట్ చేస్తుంది. అద్భుతమైన ఛార్జింగ్ స్పీడ్, క్విక్ ఛార్జ్ 3.0 కోసం ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఈ హై-డెన్సిటీ పవర్ బ్యాంక్.. హై-స్పీడ్ టూ-వే ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. దీనికి కనెక్ట్ చేసిన ప్రతి డివైజ్‌ను సురక్షితంగా ఛార్జ్ చేయడానికి పవర్ అవుట్‌పుట్‌ను ఆటోమెటిక్‌గా కంట్రోల్ చేస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్‌తో ఈ పవర్‌బ్యాంక్‌ను ఎక్స్‌పోనెన్షియల్ రేటుతో ఛార్జ్ చేయవచ్చు. దీని గరిష్ట అవుట్‌పుట్ కరెంట్ 5V/2.4A. పవర్ బ్యాంక్ అధిక సామర్థ్యాన్ని (high efficiency) ఎనేబుల్ చేస్తుంది. 20W క్విక్ ఛార్జింగ్ కన్వర్షన్ రేట్‌తో ఛార్జ్ చేస్తుంది. దీనికి రెండు USB, ఒక టైప్-C కనెక్షన్ పోర్ట్ ఉన్నాయి. ఈ కెపాసిటీతో పవర్‌బ్యాంక్ ఒకే సమయంలో అనేక డివైజ్‌లను ఛార్జ్ చేయగలదు.
ఈ పవర్‌బ్యాంక్ లాంచ్‌పై ఆంబ్రేన్ ఇండియా డైరెక్టర్ సచిన్ రైల్హాన్ మాట్లాడారు. కస్టమర్లకు మెరుగైన ఎక్స్పీరియన్స్ అందించే ఈ ప్రొడక్ట్ సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘కొంతమంది ప్రయాణాలు, క్యాంపులను ఎక్కువగా ఇష్టపడతారు. వారికి మా 50k mAh స్టైలో మాక్స్ ఎంతో ఉపయోగపడుతుంది. దీని భారీ సామర్థ్యంతో ప్రయాణాల్లో ఊహించని ఛార్జింగ్ సర్వీస్‌ను ఎక్స్పీరియన్స్ చేయవచ్చు.’ అని సచిన్ తెలిపారు.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.