భారత్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ అంబ్రేన్ తన టీడబ్ల్యూఎస్ లైనప్‌లో మరో కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్ చేసింది. అంబ్రేన్ డాట్స్ ట్యూన్ (Ambrane Dots Tune) పేరుతో ఇవి మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ మేకిన్ ఇండియా ప్రొడక్ట్ ధరను కంపెనీ రూ. 2,199గా నిర్ణయించింది. ఈ ఇయర్‌బడ్స్ 29 గంటలపాటు ప్లేబ్యాక్ టైమ్‌ను అందించగలవని సంస్థ పేర్కొంది. వీటిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 6.5 గంటల పాటు నాన్‌స్టాప్‌గా మ్యూజిక్ ప్లే అందించగలవు. ఈ ఇయర్‌బడ్స్ బ్లాక్, పింక్, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. వీటిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటా క్లిక్ వంటి ప్రముఖ ఈ–కామర్స్ వెబ్సైట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఈ కొత్త టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ లాంచింగ్‌పై అంబ్రేన్ ఇండియా డైరెక్టర్ సచిన్ రైల్హాన్ మాట్లాడుతూ, “మిలీనియల్ జనరేషన్ అవసరాలకు తగ్గట్లు మా టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నాం. ఇందులో భాగంగా కొత్త ప్రొడక్ట్‌ను విడుదల చేశాం. ఇప్పటికే విడుదలైన మా ఆడియో ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. మా సరికొత్త డాట్స్ ట్యూన్ ఇయర్‌బడ్స్‌కు కూడా మంచి ఆదరణ ఉంటుందని ఆశిస్తున్నాం.” అని చెప్పారు.
ఈ ఇయర్‌బడ్స్‌లో బూస్టెడ్ బాస్ కలిగిన 10 మిమీ డైనమిక్ డ్రైవర్స్ ఉంటాయి. ఇవి మీకు అధిక బాస్‌తో కూడిన సౌండ్ ఎక్స్పీరియన్స్ అందిస్తాయి. ప్రతి ఇయర్‌బడ్స్‌లో హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్ కోసం డ్యూయల్ మైక్రోఫోన్లను అమర్చింది. అదనంగా అంబ్రేన్ డాట్స్ ట్యూన్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్, సిరికి మద్దతిస్తుంది. రోజంతా సౌకర్యవంతంగా వినియోగించడానికి చెవిలో గట్టిగా ఫిక్స్ అయ్యేలా డిజైన్ చేసింది. చెవులకు సరిగ్గా సరిపోయేలా సిలికాన్ టిప్స్‌తో వీటిని రూపొందించింది.
వీటిలోని బ్లూటూత్ v5.1 టెక్నాలజీతో యూజర్లు సీమ్‌లెస్ కనెక్టివిటీని ఆస్వాదించవచ్చు. ఇవి అద్భుతమైన సౌండ్ క్వాలిటీ, ఇన్స్టంట్ పెయిరింగ్, స్టేబుల్ కనెక్షన్, 10 మీటర్ల రేంజ్లో ఆడియో కనెక్టివిటీని అందిస్తాయి. ఆంబ్రేన్ డాట్స్ ట్యూన్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌లో సులభంగా యాక్సెస్ చేయగల కాల్, మ్యూజిక్ కంట్రోల్స్‌ను చేర్చింది. మల్టీఫంక్షన్ టచ్ సెన్సార్లను కూడా అమర్చింది. ఇవి ఫిట్నెస్ ఔత్సాహికులకు సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే ఇవి చెమట, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లను కలిగి ఉంటాయి. గతంలో అంబ్రేన్ టీడబ్ల్యూఎస్ లైనప్‌లో అనేక ఇన్-ఇయర్ ఇయర్‌బడ్స్ విడుదలయ్యాయి. బడ్జెట్ ధరలోనే అద్భుతమైన సౌండ్ క్వాలిటీ, బ్యాటరీ బ్యాకప్ అందిస్తుండటంతో మార్కెట్లో మంచి అమ్మకాలను ప్రదర్శించాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.