AMBRANE DOTS MUSE EARBUDS WITH 23 HOUR BATTERY LAUNCHED IN INDIA PRICED AT RS 1999 GH VB
Ambrane Earbuds: అంబ్రేన్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్.. 23 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు..
ప్రతీకాత్మక చిత్రం
భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉపకరణాల తయారీ సంస్థ అంబ్రేన్ సరికొత్త డాట్స్ మ్యూజ్ ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. దీని లాంచింగ్ ద్వారా తన బడ్జెట్ డాట్ టీడబ్ల్యూఎస్ సిరీస్‌ను రిఫ్రెష్ చేసింది.
భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ (Smartphone) ఉపకరణాల తయారీ సంస్థ అంబ్రేన్ (Ambrane) సరికొత్త డాట్స్ మ్యూజ్ ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. దీని లాంచింగ్ ద్వారా తన బడ్జెట్(Budget) డాట్ టీడబ్ల్యూఎస్ సిరీస్‌ను రిఫ్రెష్ చేసింది. ఈ కొత్త ఇయర్‌బడ్స్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షనల్లో లభిస్తాయి. దీని ప్యాకేజింగ్ లోపల ఛార్జింగ్ కేబుల్‌ను కూడా అందిస్తుంది. ఈ ఇయర్‌బడ్స్ 23 గంటల పాటు ప్లేబ్యాక్(Play back) సమయాన్ని అందిస్తాయి. ఆండ్రాయడ్(Android), ఐఫోన్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఇద్దరూ బ్లూటూత్ v5.1 ద్వారా ఇయర్‌బడ్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఇయర్‌బడ్స్ ఆటోమేటిక్‌గా స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ అవుతాయి.
అంబ్రేన్ డాట్స్ మ్యూస్ TWS ఇయర్‌బడ్స్ ధర..
అంబ్రేన్ డాట్స్ మ్యూస్ TWS ఇయర్‌బడ్స్ రూ. 1,999 ధర వద్ద లభిస్తాయి. కస్టమర్లు వీటిని ఫ్లిప్‌కార్ట్, టాటా క్లిక్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు భారతదేశంలోని అనేక ప్రముఖ రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. అంబ్రేన్ ఇండియా అధికారిక వెబ్సైట్లో ప్రారంభపు ఆఫర్ కింద రూ. 1,299 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.
అంబ్రేన్ డాట్స్ మ్యూస్ TWS ఇయర్‌బడ్స్ స్పెసిఫికేషన్లు..
అంబ్రేన్ డాట్స్ మ్యూస్ TWS ఇయర్‌బడ్స్ 10mm ఆడియో పరిధిని అందిస్తాయి. వీటిలోని బూస్ట్ బాస్ టెక్నాలజీ మీకు పంచ్ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయి. ఈ ఇయర్‌బడ్స్ వాటర్ రెసిస్టన్స్ కోసం IPX4 రేటింగ్‌ను కలిగి ఉంటాయి. ప్రతి ఇయర్‌బడ్‌లో 40mAh బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ 8 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. దీనిలోని 220mAh బ్యాటరీ మొత్తం 23 గంటల ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుంది. ఇయర్‌బడ్స్ ఫ్రీక్వెన్సీ పరిధి 20KHz వరకు ఉంటుందని అంబ్రేన్ కంపెనీ పేర్కొంది.
ఇవి యాపిల్ ఎయిర్పాడ్లను పోలి ఉండే సిలికాన్ ఇయర్ టిప్స్ వలే హార్డ్ కేస్ డిజైన్‌ను కలిగి ఉంటాయి.
అంబ్రేన్ డాట్స్ ఇయర్‌బడ్స్ మ్యూజిక్ ప్లే చేయడానికి/పాజ్ చేయడానికి, కాల్‌లను నిర్వహించడానికి, వాల్యూమ్ స్థాయిలను మార్చడానికి, వాయిస్ అసిస్టెంట్లను సక్రియం చేయడానికి టచ్ కంట్రోల్‌కి మద్దతు ఇస్తుంది. అంబ్రేన్ డాట్స్ మ్యూజ్ ఇయర్‌బడ్స్ యాపిల్ సిరి, గూగుల్ అసిస్టెంట్ రెండింటితోనూ పని చేయగలవు. అంబ్రేన్ డాట్స్ మ్యూస్ TWS ఇయర్‌బడ్స్‌ను 'మేడ్ ఇన్ ఇండియా' ప్రోడక్ట్‌గా కంపెనీ చెబుతోంది. ఈ కొత్త ఇయర్‌బడ్స్ అంబ్రేన్ శ్రేణిలో ఇప్పటికే మార్కెట్లో లభిస్తున్న- డాట్స్ స్లే, డాట్స్ 38, డాట్స్ 11, డాట్స్ ట్యూన్ & నియోబడ్స్ 11 & 33 సరసన చేరనున్నాయి. ఈ నెల ప్రారంభంలో అంబ్రేన్ డాట్స్ మ్యూస్ ఇయర్‌బడ్స్ కోసం బ్రాండ్ ఇన్ఫ్లుయెన్సర్గా నటి నిధి అగర్వాల్ సంతకం చేసింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.