హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon Fire TV Cube: అమెజాన్ నుంచి థర్డ్ జనరేషన్ ఫైర్ టీవీ క్యూబ్‌ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..

Amazon Fire TV Cube: అమెజాన్ నుంచి థర్డ్ జనరేషన్ ఫైర్ టీవీ క్యూబ్‌ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..

Amazon Fire TV Cube: అమెజాన్ నుంచి థర్డ్ జనరేషన్ ఫైర్ టీవీ క్యూబ్‌ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..

Amazon Fire TV Cube: అమెజాన్ నుంచి థర్డ్ జనరేషన్ ఫైర్ టీవీ క్యూబ్‌ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..

Amazon Fire TV Cube: టెక్ దిగ్గజం అమెజాన్ తాజాగా థర్డ్ జనరేషన్ ఫైర్ టీవీ క్యూబ్‌(Amazon Fire TV Cube)ను ఇండియాలో పరిచయం చేసింది. ఈ వీడియో స్ట్రీమింగ్ డివైజ్‌ ధర ఎంతంటే..

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

టెక్ దిగ్గజం అమెజాన్ (Amazon) అలెక్సా వంటి వాయిస్ అసిస్టెంట్స్‌తో పాటు ఫైర్ టీవీ స్టిక్స్, ఫైర్ టీవీ క్యూబ్స్ (Fire TV Cubes) కూడా తీసుకొస్తోంది. తాజాగా థర్డ్ జనరేషన్ ఫైర్ టీవీ క్యూబ్‌(Amazon Fire TV Cube)ను ఇండియాలో పరిచయం చేసింది. ఈ వీడియో స్ట్రీమింగ్ డివైజ్‌ ధరను రూ.13,999గా నిర్ణయించింది. ఈ స్ట్రీమింగ్ డివైజ్ త్వరలోనే అమ్మకానికి రానుంది. అమెజాన్‌.ఇన్‌లో అందుబాటులోకి వచ్చిన వెంటనే దీనిని భారతీయులు కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా ఫైర్ టీవీ స్టిక్స్‌తో పోలిస్తే ఫైర్ టీవీ క్యూబ్స్ ధరలు అధికంగా ఉంటాయి. అయితే తాజాగా లాంచ్ అయిన అమెజాన్ ఫైర్ టీవీ క్యూబ్‌ 3rd జనరేషన్ ధర చాలా ఎక్కువగానే అనిపిస్తోంది. మరి అధిక ధరతో వచ్చే ఈ ఫైర్ టీవీ క్యూబ్‌లో ఉన్న ఫీచర్లు ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్ ఫైర్ టీవీ క్యూబ్‌ డివైజ్ సరికొత్త ఆక్టా-కోర్ 2.0 GHz ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ప్రాసెసర్ ప్రీవియస్ జనరేషన్ కంటే 20 శాతం ఎక్కువ శక్తివంతమైనదని కంపెనీ తెలిపింది. ఈ ఫైర్ టీవీ క్యూబ్‌ సూపర్‌ఛార్జ్‌డ్‌ ప్రాసెసర్‌ సాయంతో యాప్స్‌ను చాలా వేగంగా లాంచ్ చేస్తుంది. ఫ్లూయిడ్ స్ట్రీమింగ్ మీడియా ప్లేయర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. ఈ క్యూబ్‌ సినిమాటిక్ 4K అల్ట్రా హెచ్‌డీ, డాల్బీ విజన్, హెచ్‌డీఆర్, ఇమ్మర్సివ్ డాల్బీ అట్మోస్ ఆడియోకు సపోర్ట్ చేస్తుంది. అలానే Wi-Fi 6కి సపోర్ట్‌ను అందిస్తుంది.

ఇందులో HDMI ఇన్‌పుట్ పోర్ట్, సూపర్ రిజల్యూషన్ అప్‌స్కేలింగ్ వంటి కొత్త ఫీచర్లు అందించారు. రిజల్యూషన్ అప్‌స్కేలింగ్ అనేది HD కంటెంట్‌ని 4Kలో మార్చుతుంది. ఈ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్ ట్రిక్‌లను ప్లే చేస్తూ డిస్‌ప్లేలో డీటెయిల్స్, కాంట్రాస్ట్, క్లారిటీని మెరుగుపరిచి మెరుగైన పిక్చర్ క్వాలిటీ అందిస్తుంది.

ఇది కూడా చదవండి : ఇండియన్ నావిగేషన్ సిస్టమ్ NavIC అంటే ఏంటి? ఇస్రో డెవలప్‌ చేసిన ఈ టెక్నాలజీ ప్రత్యేకతలు ఇవే..

హ్యాండ్స్-ఫ్రీ అలెక్సాతో కస్టమర్లు నార్మల్ వాయిస్ కమాండ్స్‌తో తమకు ఇష్టమైన ఛానెల్స్‌, యాప్స్‌ను ఓపెన్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ Fire TV క్యూబ్‌కి LAN కనెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఈథర్నెట్ పోర్ట్‌ను కంపెనీ ఆఫర్ చేసింది. వైర్డు నెట్‌వర్క్ కనెక్షన్ కోసం ఈథర్నెట్ పోర్ట్‌ను సైతం అందించినట్లు కంపెనీ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

"క్రికెట్ మ్యాచ్‌ల నుంచి ఓటీటీ సినిమాల వరకు, ఫైర్ టీవీ క్యూబ్ యూజర్లకు ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫైర్ టీవీ క్యూబ్ మేం రూపొందించిన అత్యంత వర్సటైల్ Fire TV స్ట్రీమింగ్ మీడియా ప్లేయర్." అని అమెజాన్ డివైజ్‌ల డైరెక్టర్, కంట్రీ మేనేజర్ పరాగ్ గుప్తా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. Fire TV Cube కంపాటబుల్ రూటర్‌తో కస్టమర్లకు స్మూత్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. వీడియో కాలింగ్ కోసం ఫైర్ టీవీ క్యూబ్ USB పోర్ట్‌ను కూడా ఇచ్చింది. ఈ పోర్ట్‌ ద్వారా కంపాటబుల్ వెబ్‌క్యామ్‌లు కనెక్ట్ చేసుకొని ఇంట్లోనే అతిపెద్ద స్క్రీన్‌పై కుటుంబం లేదా స్నేహితులతో మాట్లాడుకోవచ్చు. అలెక్సా కమ్యూనికేషన్స్‌తో “Alexa, కాల్ మామ్” అని చెప్పి చాలా ఈజీగా వీడియో కాల్ స్టార్ట్ చేయవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Amazon, Amazon products, Tech news

ఉత్తమ కథలు