TCL Smart TV: అమెజాన్‌ టీవీ అప్​గ్రేడ్​ డేస్ సేల్ ప్రారంభం... టీసీఎల్ స్మార్ట్​టీవీలపై అద్భుతమైన ఆఫర్లు

TCL Smart TV: అమెజాన్‌ టీవీ అప్​గ్రేడ్​ డేస్ సేల్ ప్రారంభం... టీసీఎల్ స్మార్ట్​టీవీలపై అద్భుతమైన ఆఫర్లు (ప్రతీకాత్మక చిత్రం)

Amazon TV upgrade sale | కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? అమెజాన్‌లో టీవీ అప్‌గ్రేడ్ సేల్ ఇంకొన్ని గంటల్లో ముగియనుంది. ఏ స్మార్ట్‌ఫోన్లపై ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోండి.

  • Share this:
ప్రముఖ ఎలక్ట్రానిక్​ బ్రాండ్​ టీసీఎల్​ వరుస ఆఫర్లతో యూజర్లను ఆటకట్టుకుంటోంది. తాజాగా ఈ సంస్థ స్మార్ట్​టీవీ కొనుగోలుపై ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించింది. ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా నిర్వహిస్తున్న 'అమెజాన్ టీవీ అప్‌గ్రేడ్ డేస్‌' సేల్​లో తమ స్మార్ట్​టీవీలు కొనుగోలు చేసే వారికి ఈ ఆఫర్లు వర్తిస్తాయని తెలిపింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ మే 12న ముగియనుంది. సేల్​లో భాగంగా కంపెనీకి చెందిన హెచ్‌డిఆర్, యుహెచ్‌డి టివిల కొనుగోలుపై డిస్కౌంట్లను పొందవచ్చు. మరి ఏ స్మార్ట్​టీవీ ధర ఎంతో తెలుసుకోండి.

టిసిఎల్ 4 కె హెచ్‌డిఆర్ పి 615


ఈ స్మార్ట్​టీవీ 4 కె హెచ్‌డిఆర్, డాల్బీ ఆడియో టెక్నాలజీలతో పనిచేస్తుంది. ఇది 55 -అంగుళాలు, 65 -అంగుళాల రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇవి వరుసగా రూ. 40,999, రూ. 55,499 ధర వద్ద లభిస్తాయి.

టిసిఎల్ 4 కె యుహెచ్‌డి పి 715


ఈ టివి మోడల్ డైనమిక్ కలర్ ఎన్‌హాన్స్‌మెంట్, మైక్రో డిమ్మింగ్, 4 కె అప్‌స్కేలింగ్ టెక్నాలజీలతో పనిచేస్తుంది. ఇది కేవలం 55 అంగుళాల సింగిల్​ వేరియంట్​లో మాత్రమే లభిస్తుంది. దీన్ని అమెజాన్​లో రూ.42,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

Realme 8 5G: మీ పాత స్మార్ట్‌ఫోన్ ఇచ్చేస్తే రూ.549 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్

Flipkart Sale: రూ.15 వేలకే ఐఫోన్... ఆఫర్ వివరాలు ఇవే

టిసిఎల్ 4 కె హెచ్‌డిఆర్ పి 725


ఈ మోడల్​ ఐపిక్యూ ఇంజిన్, ఎంఈఎంసి, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ టెక్నాలజీలతో పనిచేస్తుంది. ఇది 65 అంగుళాల సింగిల్​ వేరియంట్​లో లభిస్తుంది. దీన్ని అమెజాన్​లో రూ. 89,990లకు కొనుగోలు చేయవచ్చు.

టిసిఎల్ 4 కె క్యూఎల్‌ఈడి సి 715


ఇందులో డాల్బీ విజన్, హెచ్‌డిఆర్ 10, ఐపిక్యూ ఇంజన్, ఆడియో కోసం డాల్బీ అట్మోస్, డిటిఎస్ స్మార్ట్ ఆడియో ప్రాసెసింగ్ వంటివి చేర్చింది. ఇది 50-అంగుళాల, 55 -అంగుళాల, 65-అంగుళాల వేరియంట్లలో లభిస్తుంది. ఇవి వరుసగా, రూ.49,999, రూ. 56,999, రూ. 88,499 ధర వద్ద లభిస్తాయి.

టిసిఎల్ 4 కె క్యూఎల్‌ఈడి సి 815


ఈ మోడల్​ క్వాంటం డాట్ టెక్నాలజీ, డాల్బీ విజన్, హెచ్‌డిఆర్ 10+, ఎంఈఎంసిలతో పనిచేస్తుంది. దీనిలో డాల్బీ అట్మోస్, ఇంటిగ్రేటెడ్ ఒన్క్యో సౌండ్‌బార్‌ టెక్నాలజీలను కూడా అందించారు. ఇది 55 అంగుళాల సింగిల్​ వేరియంట్​లో మాత్రమే లభిస్తుంది. ఇది రూ. 78,499 ధర వద్ద లభిస్తుంది.

JioFiber: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? ఈ జియోఫైబర్ ప్లాన్స్‌పై 30 రోజులు వేలిడిటీ అదనం

WhatsApp: వాట్సప్‌లో ఈ షార్ట్ కట్స్ తెలుసా? ఈ ట్రిక్స్ మీకోసమే

iFFALCON 4K UHD K71


ఈ టీవీ సిరీస్ 43 అంగుళాలు, 55 -అంగుళాలు, 65-అంగుళాల వేరియంట్లలో లభిస్తుంది. ఇవి వరుసగా రూ. 26,999, రూ. 36,999, రూ. 52,999 ధర వద్ద లభిస్తాయి.

iFFALCON 4K QLED H71


ఈ టీవీ సిరీస్ క్వాంటం డాట్ టెక్నాలజీ, 4 కె హెచ్‌డిఆర్, డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్ టెక్నాలజీలతో వస్తుంది. ఇది హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్‌ను కూడా అందిస్తుంది. ఇది 55 -అంగుళాలు, 65-అంగుళాల వేరియంట్లలో లభిస్తుంది, ఇవి వరుసగా రూ. 49,999, రూ. 83,999 ధర వద్ద లభిస్తాయి.
Published by:Santhosh Kumar S
First published: