అమెజాన్ సమ్మర్ సేల్(Summer Sale) ప్రారంభమైంది. అయితే ఎంతకాలం సేల్ నడుస్తుందో అమెజాన్ ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ సేల్‌లో అనేక రకాల ప్రొడక్ట్స్‌పై డీల్స్, డిస్కౌంట్లను అందిస్తోంది. 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి, రూ.25,000ల కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదని భావిస్తున్నవారికి ఉత్తమ ఫీచర్లతో ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. Samsung, Realme, Xiaomi, OnePlus తదితర బ్రాండ్‌ల ఫోన్‌లపై కనీసం రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది.
* OnePlus Nord CE 2 5G: రూ.23,999
ఈ స్మార్ట్‌ఫోన్ 2022 మోడల్ రూ.2,000 ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత రూ.23,999కి అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్ బేస్ మోడల్‌లో 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్, Mediatek 900 డైమెన్సిటీ ప్రాసెసర్, 6.43 అంగుళాల, 90Hz FHD+ AMOLED డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆక్సిజన్‌ఓఎస్ 11 బేస్డ్‌ఆన్ ఆండ్రాయిడ్ 11పై రన్ అవుతుంది.
* Samsung Galaxy M52 5G: రూ.23,999(అసలు ధర: రూ.36,999)
గెలాక్సీ M52 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల FHD+ SuperAMOLED ప్లస్ ఇన్ఫినిటీ-O డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G ఆక్టా-కోర్ చిప్‌సెట్, 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. 64MP + 12MP + 6MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఆఫర్‌లో దీన్ని రూ.23,999కి కొనుగోలు చేయవచ్చు.
* iQoo Z6 5G: రూ.13,999 (అసలు ధర: రూ. 19,990)
iQoo Z6 5G ఒక బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665 5G మొబైల్ ప్లాట్‌ఫారమ్‌పై పని చేస్తుంది. 6.58-అంగుళాల FHD+ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ ఉన్నాయి. రూ.13,999కి లభిస్తుంది.
Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ సేల్... రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే
* Redmi Note 11 Pro + 5G: (అసలు ధర: రూ.24,999)
Redmi Note 11 Pro+ 5G క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665 5G చిప్‌సెట్, 6GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. హ్యాండ్‌సెట్ 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 108MP HM3 సెన్సార్ + 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ + 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. దీన్ని రూ.19,999కి సొంతం చేసుకోవచ్చు.
* Samsung Galaxy M32 5G: రూ.17,999 (అసలు ధర: రూ.23,999)
గెలాక్సీ M32 5G ఫోన్ 48MP ప్రైమరీ కెమెరా + 8MP అల్ట్రా-వైడ్ కెమెరా + 5MP డెప్త్ సెన్సార్ + 2MP మాక్రో సెన్సార్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. రూ.17,999కి లభిస్తుంది.
* Xiaomi 11 Lite NE 5G: రూ.23,999 (అసలు ధర: రూ.33,999)
Xiaomi 11 Lite NE 5G క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 778 5G ఆక్టా-కోర్ చిప్‌సెట్, 6GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ FHD+ రిజల్యూషన్ OLED డాట్ డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4250 mAh బ్యాటరీ ఉంది. రూ.23,999కి లభిస్తుంది.
* iQoo Z3 5G: రూ.19,990 (అసలు ధర: రూ.24,990)
iQoo Z3 5G 180Hz ఫోన్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 768 5G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 55W ఫ్లాష్‌ఛార్జ్‌కు సపోర్ట్ చేస్తుంది. రూ.19,990కి అందుబాటులో ఉంది.
* Realme Narzo 30 5G: రూ.14,999 (రూ.2,000 కూపన్ తగ్గింపుతో సహా)
నార్జో 30 5G ఫోన్ 6.5-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్ ద్వారా పని చేస్తుంది. 6GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. రూ.14,999కి సొంతం చేసుకోవచ్చు.
* Oppo A74 5G: రూ.15,490 (అసలు ధర: రూ.20,990)
Oppo A74 5G స్మార్ట్‌ఫోన్ 6.49-అంగుళాల FHD + పంచ్-హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 5G చిప్‌సెట్‌తో, 6GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. హ్యాండ్‌సెట్‌లో 48MP మెయిన్ + 2MP మాక్రో + 2MP డెప్త్ లెన్స్‌లతో కలిపి 48MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. రూ.15,490కి లభిస్తుంది.
* Vivo V21e 5G: రూ.23,990 (అసలు ధర: రూ.27,990)
వివో V21e 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్, 8GB RAM, 128GB స్టోరేజ్, 6.4-అంగుళాల FHD+ డిస్ప్లే, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4000mAh బ్యాటరీచ 64MP+ 8MP రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. రూ.23,990కి సొంతం చేసుకోవచ్చు.
* Realme 8s 5G: రూ.16,494 (అసలు ధర: రూ.20,999)
రియల్‌మీ 8s 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌తో 6GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. హ్యాండ్‌సెట్ 6.5-అంగుళాల FHD+ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ కలిగి ఉంది. వెనుకవైపు 64 MP+ 2 MP+ 2MP కెమెరా, ముందు భాగంలో 16MP కెమెరా ఉన్నాయి. రూ.16,494కి అందుబాటులో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, Amazon, AMAZON INDIA, Mobile phones, Summer sale, Technology