Amazon Summer Sale: రేపటి నుంచి అమెజాన్‌లో సమ్మర్ సేల్... ఆఫర్లు ఇవే...

Amazon Summer Sale | ఈ సేల్‌లో డిస్కౌంట్లతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్ యూజర్లకు 10 శాతం అదనంగా తగ్గింపు లభిస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

news18-telugu
Updated: May 2, 2019, 3:50 PM IST
Amazon Summer Sale: రేపటి నుంచి అమెజాన్‌లో సమ్మర్ సేల్... ఆఫర్లు ఇవే...
Amazon Summer Sale: అమెజాన్‌లో సమ్మర్ సేల్... ఆఫర్లు ఇవే... (image: REUTERS)
  • Share this:
మరో గ్రాండ్ సేల్‌కు అమెజాన్ రెడీ అయింది. మే 4 నుంచి 7 వరకు సమ్మర్ సేల్ నిర్వహించబోతోంది అమెజాన్. ఈ సేల్‌లో ఆకట్టుకునే ఆఫర్స్ ఎన్నో ఉన్నాయి. వన్‌ప్లస్ 6టీ, ఐఫోన్ ఎక్స్ లాంటి కాస్ట్‌లీ ఫోన్లను ఆఫర్లపై కొనొచ్చు. ఇవి మాత్రమే కాదు... హైఎండ్, మిడ్ రేంజ్, లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లు ఇవ్వనుంది అమెజాన్. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఒకరోజు ముందే మే 3న సేల్ మొదలవుతుంది. ఈ సేల్‌లో డిస్కౌంట్లతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్ యూజర్లకు 10 శాతం అదనంగా తగ్గింపు లభిస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

Read this: Realme Sale: రియల్‌మీ యానివర్సరీ సేల్... ఒక్క రూపాయికే స్మార్ట్‌ఫోన్స్, బ్యాక్‌ప్యాక్స్

Amazon Summer Sale: ఆఫర్లు ఇవే...


అమెజాన్ సమ్మర్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. వన్‌ప్లస్ 6టీ, సాంసంగ్ గెలాక్సీ ఎం20, గెలాక్సీ ఎం10, రియల్‌మీ యూ1, రెడ్‌మీ 6ఏ, రెడ్‌మీ వై2, రెడ్‌మీ 6 ప్రో, హానర్ వ్యూ 20, సాంసంగ్ గెలాక్సీ ఎస్9, వివో నెక్స్‌తో పాటు ఇతర స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు లభిస్తాయి. నాలుగు రోజుల పాటు జరిగే సేల్‌లో కెమెరాలు, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్‌, హోమ్ అండ్ కిచెన్ అప్లయెన్సెస్‌, టీవీలు, స్మార్ట్‌వాచీలు, ల్యాప్‌టాప్స్, ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లున్నాయి. అమెజాన్ ఇకో డివైజ్, ఫైర్ టీవీ స్టిక్, కిండిల్ ఇబుక్ రీడర్స్‌పైనా తగ్గింపు లభిస్తుంది. ఏఏ కేటగిరీలో ఎంత శాతం వరకు తగ్గింపు లభిస్తుందో తెలుసుకోండి.

Read this: Flipkart Sale: రూ.13,990 ధరకే ల్యాప్‌టాప్, టీవీలపైనా ఆఫర్లు

హార్డ్‌డ్రైవ్స్‌పై 60 శాతం వరకు తగ్గింపు
మెమొరీ కార్డులు, పెన్‌ డ్రైవ్‌లపై 60 శాతం వరకు తగ్గింపుస్మార్ట్‌వాచీలపై 60 శాతం వరకు తగ్గింపు
గేమింగ్ యాక్సెసరీస్‌పై 60 శాతం వరకు తగ్గింపు
హోమ్ ఆడియోపై 50 శాతం వరకు తగ్గింపు
కెమెరాలపై 50 శాతం వరకు తగ్గింపు
స్పీకర్లపై 50 శాతం వరకు తగ్గింపు
ఫిట్‌నెస్ ట్రాకర్స్‌పై 50 శాతం వరకు తగ్గింపు
ప్రింటర్లపై 45 శాతం వరకు తగ్గింపు
ట్యాబ్లెట్స్‌పై 40 శాతం వరకు తగ్గింపు

Photos: రెడ్‌మీ 7 రిలీజ్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా...

ఇవి కూడా చదవండి:

Realme Rs.1 Sale: ఒక్క రూపాయికే సొంతం చేసుకోండి టెక్ బ్యాక్ ప్యాక్... కొనండి ఇలా

IRCTC-SBI offer: ఫ్రీగా రైలు టికెట్... 10% క్యాష్‌బ్యాక్... ఆఫర్ ఇలా పొందండి

 
First published: May 2, 2019, 3:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading