Amazon special sale: విద్యార్థుల కోసం అమెజాన్ స్పెషల్ సేల్.. రూ.10 వేలలోపు లభించే ఈ గాడ్జెట్లపై ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

విద్యార్థుల ఆన్లైన్ క్లాసుల కోసం అమెజాన్ స్పెషల్ సేల్ ను నిర్వహిస్తోంది. ఆన్లైన్ క్లాసుల కోసం కావాల్సిన అన్ని పరికరాలను ఈ సేల్ లో అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు..

  • Share this:
ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వరుస డిస్కౌంట్లు, ఆఫర్లతో నంబర్- 1 ఈ కామర్స్ ప్లాట్ఫామ్ గా కొనసాగుతోంది. కేవలం పండుగలు, ప్రత్యేకమైన రోజుల్లోనే కాకుండా రెగ్యులర్ గా కూడా ఆఫర్లను ప్రకటిస్తూ తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. ప్రస్తుతం, పరిస్థితుల్లో ఆన్లైన్ విద్యకు సహకరించేందుకు ‘అమెజాన్ స్పెషల్ సేల్’ ప్రారంభించింది. సేల్లో భాగంగా విద్యార్థుల ఆన్లైన్ క్లాసులకు అవసరమయ్యే అన్ని గాడ్జెట్స్ను అందుబాటు ధరలోనే తీసుకొచ్చింది. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ప్రింటర్‌లు, కీబోర్డులు, ఇతర గాడ్జెట్లపై బారీ ఆఫర్లను ప్రకటించింది. ఆన్‌లైన్ క్లాసులకు అవసరమయ్యే రూ .10,000 ధరలోపు అందుబాటులో ఉన్న టాప్ 10 గాడ్జెట్స్ పై ఓ లుక్కేయండి.
Amazon Mobile Saving Days Sale: స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్న వారికి అమెజాన్ గుడ్ న్యూస్.. ఈ మోడల్స్ పై భారీ తగ్గింపు.. రేపటి వరకే ఛాన్స్

లెనోవో టాబ్ ఎం 8 హెచ్‌డి టాబ్లెట్(Lenovo Tab M8 HD tablet):
ఆన్లైన్ క్లాసుల కోసం మీ పిల్లలకు టాబ్లెట్ కొనాలని చూస్తున్నట్లయితే, ఈ లెనోవో టాబ్లెట్ బెస్ట్ ఆప్షన్. అమెజాన్ స్పెషల్ సేల్లో భాగంగా రూ. 14,000 ధర గల లెనోవో ల్యాప్టాప్ను కేవలం రూ .8,991 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ లెనోవో టాబ్ ఎం 8 హెచ్‌డి 8 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది. ఇది మీడియాటెక్ హెలియో ఎ 22 సోసి ప్రాసెసర్తో పనిచేస్తుంది.

లాజిటెక్ కె 480 వైర్‌లెస్ కీబోర్డ్(Logitech K480 wireless keyboard):
ఆన్లైన్ క్లాసుల కోసం టాబ్లెట్‌ కొనుగోలు చేసే విద్యార్థులకు ఈ వైర్‌లెస్ కీబోర్డ్ చాలా ఉపయోగపడుతుంది. లాజిటెక్ కంపెనీ తయారు చేసిన ఈ కీబోర్డ్ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లు, ఐప్యాడ్‌లు, స్మార్ట్‌ఫోన్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఈ కీబోర్డ్ను బ్లూటూత్ ద్వారా ఒకేసారి మూడు పరికరాలకు కనెక్ట్ చేయవచ్చు. దీని అసలు ధర రూ. 2,299 ఉండగా, అమెజాన్ సేల్లో రూ .2,594 వద్ద లభిస్తుంది.

ఎల్జీ 22- అంగుళాల ఐపిఎస్ మానిటర్(LG 22-inch IPS Monitor):
ఆన్లైన్ క్లాసుల కోసం మంచి బడ్జెట్ ధరలో క్వాలిటీ మానిటర్ కొనాలనుకుంటే ఎల్జీ మానిటర్ బెస్ట్ ఆప్షన్. మీ స్మార్ట్‌ఫోన్‌ను ఈ మానిటర్‌కు అటాచ్ చేయడం ద్వారా పెద్ద స్క్రీన్‌లో ఆన్లైన్ క్లాసులు వినవచ్చు. ఇది కళ్ళకు సులభంగా ఉంటుంది. ఎల్‌జీ మానిటర్‌లో 22 అంగుళాల ఫుల్ హెచ్‌డి రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంటుంది. ఇక, దీని కనెక్టివిటీ ఫీచర్లను పరిశీలిస్తే.. 1 VGA పోర్ట్, 1 HDMI పోర్ట్, 1 DVI పోర్ట్, 1 ఆడియో- అవుట్ పోర్ట్, 1 హెడ్ఫోన్ పోర్ట్ వంటివి చేర్చింది. దీని అసలు ధర రూ. 14,250 ఉండగా.. దీన్ని రూ. 9,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.

కెనాన్ పిక్స్మా MG2577s ఆల్ ఇన్ వన్ ఇంక్‌జెట్ కలర్ ప్రింటర్(Canon Pixma MG2577s All-in-One Inkjet Colour Printer):
ప్రింటింగ్, స్కానింగ్, కాపీ అవసరాలకు తగ్గట్టు సరసమైన ప్రింటర్ కావాలనుకుంటే కెనాన్ కలర్ ప్రింటర్ బెస్ట్ ఆప్షన్. ఈ కెనన్ ప్రింటర్తో బ్లాక్ అండ్ వైట్, కలర్ రెండు రకాల ప్రింట్లను తీయవచ్చు. దీని అసలు ధర రూ. 3,3636 ఉండగా.. అమెజాన్ సేల్లో ఇది రూ .3,299 ధర వద్ద అమ్ముడవుతోంది.

జింక్ టెక్నాలజీస్ కూలింగ్ ప్యాడ్(Zinq Technologies cooling pad):
ల్యాప్‌టాప్ కూలింగ్ ప్యాడ్ కోసం చూస్తున్నట్లయితే, జింక్ సంస్థ నుండి వచ్చిన ఈ మోడల్ను పరిశీలించవచ్చు. ఇది 15.6 -అంగుళాల నుండి 17 -అంగుళాల వరకు ఉన్న ల్యాప్‌టాప్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఇతర డివైజ్లను కనెక్ట్ చేయడానికి దీనిలో రెండు యుఎస్‌బి పోర్ట్‌లు అందించారు. మెరుగైన కూలింగ్ కోసం దీనిలో 5 ఫ్యాన్లను అమర్చారు. దీని అసలు ధర రూ. 1,999 ఉండగా.. దీన్ని రూ. 1,296 వద్ద కొనుగోలు చేయవచ్చు.

టీపీ లింక్ వైర్‌లెస్ రేంజ్ ఎక్స్‌టెండర్(TP-Link TL-WA850RE N300 wireless range extender):
ఆన్‌లైన్ క్లాసులకు అడ్డంకులు లేని ఇంటర్నెట్ ఫెసిలిటీ చాలా అవసరం. మీ ఇంటిలో సరైన ఇంటర్నెట్ లేకపోతే.. మీకు రేంజ్ ఎక్స్‌టెండర్ లేదా రౌటర్ చాలా అవసరం. ఈ వైర్లెస్ TP-Link TL-WA850RE N300 రౌటర్ మీ ఇంటర్నెట్ వేగాన్ని పెంచుతుంది. దీని అసలు ధర రూ. 2,999 ఉండగా.. అమెజాన్ ఏకంగా దీనిపై రూ. 1,600 తగ్గింపు అందిస్తుంది.

హర్మాన్ ఇన్ఫినిటీ గ్లైడ్ 500(Infinity Glide 500 by Harman):
మీరు ఆన్లైన్ క్లాసులు వినే క్రమంలో బయటి శబ్దాల వల్ల ఇబ్బందులకు లోనవ్వకుండా ఉండాలంటే, క్వాలిటీ హెడ్‌ఫోన్‌లను వాడాలి. అటువంటి వారికి హర్మాన్ ఇన్ఫినిటీ గ్లైడ్ 500 హెడ్‌ఫోన్‌లు బెస్ట్ ఆప్షన్. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 20 గంటల బ్యాటరీ జీవితాన్ని అందిస్తాయి. దీని అసలు ధర రూ. 3,499 ఉండగా.. అమెజాన్ సేల్లో రూ.1,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

లాజిటెక్ సి 270 హెచ్‌డి వెబ్‌క్యామ్(Logitech C270 HD Webcam):
దాదాపు అన్ని ల్యాప్‌టాప్‌లు వెబ్‌క్యామ్‌లతో వస్తాయి. అయితే. వాటిలో చాలావరకు క్వాలిటీ లేనివే ఉంటాయి. కాబట్టి మీరు మంచి క్వాలిటీ గల వెబ్‌క్యామ్‌ కోసం చూస్తున్నట్లైతే లెనోవా విడుదల చేసిన లాజిటెక్ సి 270 హెడ్డి వెబ్క్యామ్ బెస్ట్ ఆప్షన్. ఇది 720p రిజల్యూషన్‌ అందిస్తుంది. దీనితో పాటు బిల్ట్ ఇన్ నాయిస్ రెడ్యూజింగ్ మైక్‌ను కూడా అందించారు. దీని అసలు ధర రూ.2,595 ఉండగా.. దీన్ని రూ .2,195 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు .

ఐబాల్ ఫ్రీగో జి 20 వైర్‌లెస్ ఆప్టికల్ మౌస్(iBall FreeGo G20 Wireless Optical Mouse):
మౌస్ మీ ల్యాప్‌టాప్ వినియోగాన్ని సులభతరం చేస్తుంది. మీ డెస్క్‌టాప్ వినియోగానికి మౌస్ తప్పనిసరి పరికరం. ఐబాల్‌కు చెందిన ఈ మోడల్ అసలు ధర రూ.700 ఉండగా.. అమెజాన్‌లో రూ .428 వద్ద అమ్ముడవుతోంది. ఎర్గోనామిక్ డిజైన్‌ కలిగిన ఈ మౌస్ 10 మీటర్ల కనెక్టివిటీ రేంజ్ కలిగి ఉంటుంది.

ఆల్-న్యూ ఎకో డాట్ స్మార్ట్ స్పీకర్(All-new Echo Dot):
ఆన్లైన్ క్లాసులు అంతరాయం లేకుండా శ్రద్ధగా వినేందుకు స్మార్ట్ స్పీకర్‌ను కలిగి ఉండటం చాలా అవసరం. దీనికి ఆల్ న్యూ ఎకోడాట్ స్మార్ట్స్పీకర్లు బెస్ట్ ఆప్షన్. అమెజాన్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఈ స్మార్ట్ స్పీకర్ బ్లూ, బ్లాక్, వైట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో మొత్తం 4 మైక్రోఫోన్లు ఉంటాయి. దీని అసలు ధర రూ. 4,499 ఉండగా.. ఇది రూ.3,799 వద్ద అమ్ముడవుతోంది.
First published: