Home /News /technology /

AMAZON SMARTPHONE UPGRADE OFFER HUGE DISCOUNTS ON THESE HAVE A LOOK UMG GH

Amazon: అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ ఆఫర్.. వీటిపై భారీ డిస్కౌంట్లు.. లుక్కేయండి

Amazon, Smartphone upgrade days, Amazon offers, OnePlus, Samsung, అమెజాన్, స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్‌, అమెజాన్ ఆఫర్లు, వన్‌ప్లస్, శామ్‌సంగ్

Amazon, Smartphone upgrade days, Amazon offers, OnePlus, Samsung, అమెజాన్, స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్‌, అమెజాన్ ఆఫర్లు, వన్‌ప్లస్, శామ్‌సంగ్

కొత్త ఫోన్(Phone) కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్ చెప్పింది ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon). స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని చూసేవారికి స్పెషల్‌గా ‘స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్‌’ (Smartphone Upgrade Days) సేల్‌ను ప్రకటించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్ చెప్పింది ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon). స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని చూసేవారికి స్పెషల్‌గా ‘స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్‌’ (Smartphone Upgrade Days) సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో తాజా స్మార్ట్‌ఫోన్‌లు, యాక్సెసరీస్‌పై అనేక డీల్స్, ఆఫర్లను అందిస్తోంది. వన్‌ప్లస్ (OnePlus), షియోమి (Xiaomi), శామ్‌సంగ్ (Samsung) వంటి బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్లపై కస్టమర్లు ఇప్పుడు 40% వరకు తగ్గింపు పొందవచ్చు. తాజా వన్‌ప్లస్ 10T 5G, 9T 5G, శామ్‌సంగ్ M13 సిరీస్‌ ఫోన్లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. వీటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ 2022 ఆగస్టు 14 వరకు అందుబాటులో ఉంటుందని అమెజాన్ వెల్లడించింది.

వన్‌ప్లస్ ఆఫర్లు
అప్‌గ్రేడ్ డేస్ సేల్‌లో వన్‌ప్లస్ మోడల్స్‌పై అమెజాన్ డిస్కౌంట్లతో పాటు EMI ఆప్షన్స్ అందిస్తోంది. OnePlus 9 సిరీస్ 5G ఇప్పుడు రూ.37,999 ధరకు అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌లో ఎంపిక చేసిన మోడళ్లపై డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌, రూ.5,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ఉన్నాయి. వన్‌ప్లస్ 10R ఫోన్ 6 నెలల వరకు నో కాస్ట్ EMIతో రూ.4,000 తగ్గింపుతో లభిస్తుంది. ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్‌పై అదనంగా రూ.3,000 వరకు తగ్గింపు పొందవచ్చు. వన్‌ప్లస్ 10 ప్రో 5G ఫోన్ ఫ్లాట్ రూ.5,000 తగ్గింపుతో లభిస్తుంది. తాజా వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ లాంచ్ OnePlus 10Tపై రూ.5,000 బ్యాంక్ ఆఫర్‌తో పాటు రూ.5,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో OnePlus Nord CE 2 Lite 5G ఇప్పుడు రూ.18,999తో అత్యంత తక్కువ ధరకు లభిస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ CE 2 5G ధర రూ.23,999 నుంచి ప్రారంభమవుతుంది.

శామ్‌సంగ్ ఆఫర్లు
అమెజాన్‌ స్పెషల్ సేల్‌లో శామ్‌సంగ్ M సిరీస్ ఫోన్లపై ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయి. టాప్ రేటింగ్ ఉన్న స్మార్ట్‌ఫోన్లపై గరిష్టంగా 30% తగ్గింపు ఉంటుంది. Samsung Galaxy M53 5Gపై గరిష్టంగా రూ.5,000 తగ్గింపు పొందవచ్చు. Samsung Galaxy M52పై ఫ్లాట్ రూ.5,000 తగ్గింపు ఉంది. బ్యాంక్ ఆఫర్లతో అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.

ఇదీ చదవండి:Mahindra EVs: ఇక అన్ని సెగ్మెంట్లలోకి ఈవీ కార్స్ లాంచ్.. మహీంద్రా ఫ్యూచర్ ప్లాన్ చూస్తే మతిపోతుందీ..!


 షియోమి స్మార్ట్‌ఫోన్లు
స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌లో షియోమి ఫోన్లపై గరిష్టంగా 40% డిస్కౌంట్ లభిస్తుంది. Redmi 9 సిరీస్ ఫోన్లు కేవలం రూ.6,999 నుంచి అందుబాటులో ఉంటాయి. అత్యధికంగా అమ్ముడైన Redmi Note 10 సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 10T 5G, రెడ్‌మీ నోట్ 10 Pro, రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, రెడ్‌మీ నోట్ 10S ఫోన్లు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తో కలిసి కేవలం రూ.10,999 ప్రారంభ ధరతో లభిస్తాయి.



తాజా రెడ్‌మీ K50i 5G ఫోన్‌.. ఎక్స్ఛేంజ్, ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌లు, నో కాస్ట్ EMI ఆఫర్లతో కలిపి రూ.25,999 నుంచి అందుబాటులో ఉంటుంది. షియోమి 11 లైట్, షియోమి 11T ప్రో ఫోన్లు వరుసగా రూ.24,999. రూ.37,999కి అందుబాటులో ఉంటాయి. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తో సహా రూ.6000 విలువైన అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Amazon, ONE PLUS, Tech news, Xiomi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు