Amazon: కెమెరా లెన్స్ ధర రూ.9 లక్షలు... పొరపాటున రూ.6,500 ధరకు అమ్మేసిన అమెజాన్‌

Amazon Prime Day Sale | సుమారు రూ.9 లక్షల విలువైన Canon EF 800 lens ధర రూ.6,500 మాత్రమే చూపించడంతో షాకయ్యారు. భలే మంచి ఆఫర్ దొరికింది కదా అని కొనేశారు.

news18-telugu
Updated: July 20, 2019, 2:33 PM IST
Amazon: కెమెరా లెన్స్ ధర రూ.9 లక్షలు... పొరపాటున రూ.6,500 ధరకు అమ్మేసిన అమెజాన్‌
Amazon: కెమెరా లెన్స్ ధర రూ.9 లక్షలు... పొరపాటున రూ.6,500 ధరకు అమ్మేసిన అమెజాన్‌ (image: Reuters)
news18-telugu
Updated: July 20, 2019, 2:33 PM IST
అమెజాన్ ప్రైమ్ డే సేల్... ప్రతీ ఏటా భారీ ఆఫర్లతో ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహించే సేల్ ఇది. ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ఉంటాయని ఆన్‌లైన్ షాపింగ్ కస్టమర్లకు తెలుసు. అందుకే ఈ సేల్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు కస్టమర్లు. సేల్‌లో మంచి డీల్స్ వెతికిమరీ ఆర్డర్లు చేస్తుంటారు. జూలై 15, 16న అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరిగిన విషయం తెలిసిందే. అమెజాన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'ప్రైమ్ డే సేల్'లో ఓ పెద్ద పొరపాటు జరిగింది. ఈ పొరపాటు వల్ల అమెజాన్ కస్టమర్లు లక్షల్లో లాభపడ్డారు. అమెరికాలో ప్రైమ్ డే సేల్‌లో ఓ కెమెరా లెన్స్ ధర విషయంలో అమెజాన్ పొరపాటు చేసింది. 13,000 డాలర్ల విలువైన కెమెరా లెన్స్‌ను కేవలం 94.50 డాలర్లకే అమ్మేసింది. అంటే సుమారు రూ.9 లక్షల విలువైన కెమెరాను రూ.6,500 ధరకే అమ్మింది.

ఆన్‌లైన్ షాపింగ్‌లో డీల్స్‌ని ట్రాక్ చేసే ఓ వెబ్‌సైట్ మొదట ఈ డీల్‌ని గుర్తించింది. ఈ డీల్ గురించి తమ వెబ్‌సైట్‌లో షేర్ చేయడంతో కస్టమర్లు అమెజాన్ వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి చూశారు. సుమారు రూ.9 లక్షల విలువైన Canon EF 800 lens ధర రూ.6,500 మాత్రమే చూపించడంతో షాకయ్యారు. భలే మంచి ఆఫర్ దొరికింది కదా అని కొనేశారు. ఇదొక్కటే కాదు 550 డాలర్లు (సుమారు రూ.37,800) విలువైన Sony Alpha A6000 కెమెరా కూడా 94.50 డాలర్ల (సుమారు రూ.6,500) ధరకు అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో లిస్టైంది. ఇంకేముంది... భారీ డిస్కౌంట్లు రావడంతో కస్టమర్లు ఎగబడి కొన్నారు. ఒక్కొక్కరు ఐదారు ఆర్డర్లు చేశారు. అమెజాన్ ఈ పొరపాటు గుర్తించేసరికి పదుల సంఖ్యలో ఆర్డర్లు వచ్చాయి. అమెజాన్ వాటిని కస్టమర్లకు డెలివరీ కూడా చేసేసింది.

Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి...




ఇవి కూడా చదవండి:

NYKS Jobs: నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌లో 337 ఉద్యోగాలు

Aadhaar-PAN: ఆధార్, పాన్ కార్డులో పేర్లు వేర్వేరుగా ఉన్నాయా? ఇలా చేయండి

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి మధ్యప్రదేశ్ టూర్... ప్యాకేజీ వివరాలివే
First published: July 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...